The-Common-Law-Admission-Test-CLAT-2021-online-application-syllabus-details

Welcome to CLAT 2021

The Common Law Admission Test (CLAT) is a national level entrance exam for admissions to undergraduate (UG) and postgraduate (PG) law programmes offered by 22 National Law Universities around the country.

CLAT is organized by the Consortium of National Law Universities consisting of the representative universities.

Registrations for the examination closed on 15th May 2021. The exam will be conducted on 13th June 2021.

క్లాట్‌ 2021 గెట్‌ రెడీ*

జాతీయ స్థాయిలో పేరొందిన న్యాయకళాశాలల్లో చేరేందుకు ఉద్దేశించిన ‘క్లాట్‌ 2021’ నోటిఫికేషన్‌ విడుదలైంది.
ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌లో జూన్‌ 13న దేశవ్యాప్తంగా 60 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. దరఖాస్తుకు చివరి తేదీ మే 15.
నల్సార్‌ సహా దేశవ్యాప్తంగా 22 సంస్థల్లో న్యాయశాస్త్రంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పీజీ చేసేందుకు కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌(క్లాట్‌)ని నిర్వహిస్తున్నారు.
సుమారు 2500 వరకు యూజీ, 720 పీజీ సీట్లు ఈ సంస్థల్లో ఉన్నాయి. మరో 52 ప్రైవేటు కళాశాలలు సైతం క్లాట్‌లో సాధించిన స్కోరు ఆధారంగానే సీట్లు కేటాయిస్తున్నాయి.

తాజా మార్పులు

క్లాట్‌ పరీక్ష విధానంలో రెండేళ్ల క్రితం స్వల్ప మార్పులు చేశారు.
క్లాట్‌లో అడిగే ప్రశ్నలను 200 నుంచి 150కి తగ్గించారు.
పరీక్ష పన్నెండో తరగతి(ఇంటర్‌) స్థాయిలో ఉంటుంది.
ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ నాలెడ్జ్‌ సహా కరెంట్‌ అఫైర్స్‌, లీగల్‌ రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
క్వాంటిటేటివ్‌ విభాగం పదోతరగతి స్థాయిలో ఉంటుంది. 
క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌లో కాంప్రహెన్షన్‌ ఆధారిత ప్రశ్నలు, ఇంగ్లీష్‌, కరెంట్‌ అఫైర్స్‌, డిడక్టివ్‌ రీజనింగ్‌, లాజికల్‌ రీజనింగ్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
పీజీ కోర్సుల విషయానికి వస్తే విద్యార్థులు క్లాట్‌లో 40 శాతం మార్కులు సాధించాలి.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగ అభ్యర్థులు 35 శాతం మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. 
క్లాట్‌ జాతీయస్థాయి పరీక్ష. మెరిట్‌ కమ్‌ ప్రిఫరెన్స్‌ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.
అంటే క్లాట్‌లో విద్యార్థి సాధించిన ర్యాంకు, కాలేజీలకు సంబంధించి తన చాయి్‌సను అనుసరించి సీటు అలాట్‌మెంట్‌ ఉంటుంది. క్లాట్‌ దరఖాస్తులోనే ఈ చాయి్‌స్‌ను పొందుపరచాల్సి ఉంటుంది. 
క్లాట్‌ ఫలితాలతో పాటు సీటు అలాట్‌మెంట్‌నూ తెలియజేస్తారు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు కనీసం నలభైఅయిదు శాతం మార్కులతో ఇంటర్‌ పాసై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు నలభై శాతం మార్కులు పొంది ఉంటే సరిపోతుంది. ఇంటర్‌ చివరి సంవత్సరం వార్షిక పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పీజీ చేయాలనుకునే విద్యార్థులు కనీసం 55 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమాన అర్హత సాధించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మాత్రం అయిదు శాతం మేర సడలింపు ఉంటుంది. వీరికి గరిష్ఠ వయోపరిమితి లేదు. ఎల్‌ఎల్‌బీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్షలో యూజీ ప్రశ్నపత్రంలో 150 మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. 
పీజీ క్లాట్‌లో వంద ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి.
ఆబ్జెక్టివ్‌లో అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం కరెక్ట్‌గా గుర్తిస్తే ఒక మార్కు కేటాయిస్తారు.
తప్పయితే నాలుగో వంతు మార్కు కట్‌ చేస్తారు. 
సబ్జెక్టివ్‌ విభాగంలో ఒక్కో ప్రశ్నకు 25 చొప్పున రెంటికి కలిపి 50 మార్కులు కేటాయించారు. 
యూజీ సిలబస్‌:
ఇంగ్లీష్‌ – కాంప్రహెన్షన్‌ పాసేజ్‌లు, గ్రామర్‌; మేథమెటిక్స్‌ – టెన్త్‌వరకు ఉండే ఎలిమెంటరీ మేథ్స్‌; జనరల్‌ నాలెడ్జ్‌  – స్టాటిక్‌ జనరల్‌ నాలెడ్జ్‌, కరెంట్‌ అఫైర్స్‌ – నేషనల్‌, ఇంటర్నేషనల్‌; లాజికల్‌ రీజనింగ్‌ – లాజికల్‌, అనలిటికల్‌ రీజనింగ్‌ స్కిల్స్‌; లా ఆప్టిట్యూడ్‌ – స్టడీ ఆఫ్‌ లా, రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ ఎబిలిటీ, హైపొథిటికల్‌ సిట్యుయేషన్స్‌ ఆధారంగా ప్రశ్నలు.

మే 15 వరకు గడువు పొడిగింపు

యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన క్లాట్‌ దరఖాస్తుల గడువు తేదీని 2021 మే 15 వరకు పొడిగించారు.
పరీక్ష ఫీజు రూ.4000. ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్‌ విద్యార్థులకు రూ.3500.
ప్రీవియస్‌ ప్రశ్నపత్రాలు కావాలనుకుంటే రూ.500.
ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
దేశవ్యాప్తంగా అరవై సెంటర్లలో క్లాట్‌ జరుగుతుంది.
దరఖాస్తులో ఎంపిక చేసుకున్న సెంటర్‌లోనే పరీక్ష రాసే అవకాశాన్ని సాధారణంగా కల్పిస్తారు.

COMMON LAW ADMISSION TEST (CLAT) 2021 NOTIFICATION PDF

CLAT-2021 OFFICIAL WEBSITE CLICK HERE

Under Graduate

Eligibility

Syllabus & Guide

Question Paper Format

Sample Questions

Instructions

Learning Tools & Materials

Post Graduate

Eligibility

Syllabus & Guide

Question Paper Format

Instructions

error: Don\'t Copy!!!!