Tech-Mahindra-apssdc-jobs-vacancies-350-registration-link

Tech-Mahindra-apssdc-jobs-vacancies-350-registration-link

Jobs in AP: ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త.. డిగ్రీ అర్హతతో Tech Mahindraలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ – APSSDC ప్రముఖ టెక్ మహింద్ర సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 25లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.

ప్రముఖ ఐటీ కంపెనీ Tech Mahindraలో ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 350 ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.

Customer Service_Voice విభాగంలో నియామకాలను చేపట్టారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఖాళీలు, అర్హతల వివరాలు..

ఈ ప్రకటన ద్వారా మొత్తం 350 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఇందులో వైజాగ్ లో 150 ఖాళీలు, భుబనేశ్వర్ లో 200 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

అండర్ గ్రాడ్యుయేట్/గ్రాడ్యుయేట్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో తెలిపారు.

పురుషులు/స్త్రీలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 19-30 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల నుంచి రూ.12 వేల వరకు వేతనం చెల్లించనున్నారు.

Registration – Direct Link

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు ఈ నెల 25ని ఆఖరి తేదీగా నిర్ణయించారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు టెలిఫోనిక్ రౌండ్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేస్తారు.

ఎంపికైన అభ్యర్థులు విశాఖపట్నం, భుబనేశ్వర్ లో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలిపారు.

error: Content is protected !!
Scroll to Top