teachers-employees-doubts-answers-with-G.O-copy

teachers-employees-doubts-answers-with-G.O-copy

సందేహాలు – సమాధానాలు 

606. ❓ప్రశ్న:*

నేను, నా భార్య ఇద్దరం టీచర్ల0.హెల్త్ కార్డుకి ప్రీమియం నా జీతం ద్వారా చెల్లించుచున్నాను.నా భార్య హెల్త్ కార్డులో వారి  తల్లిదండ్రులు పేర్లు చేర్చుకోవచ్చా??

✅జవాబు:*

చేర్చుకోవచ్చు. మహిళా టీచర్లు కూడా ఆధారిత తల్లిదండ్రులు పేర్లు హెల్త్ కార్డులో చేర్చుకోవచ్చు.

•••••••••

607. ❓ప్రశ్న:*

EOL కాలాన్ని వాలoటరీ రిటైర్మెంట్ కి పరిగణనలోకి తీసుకుంటారా??

✅జవాబు:*

EOL కాలాన్ని అర్హత గల సెలవు గా లెక్కించరు.

కానీ వ్యక్తిగత కారణాల తో eol ఐతే 36 నెలల వరకు, అనారోగ్య కారణాలతో ఐతే ఎంతకాలం ఐనా eol కాలాన్ని పెన్షన్ లెక్కింపు కి అర్హత సెలవుగానే పరిగణిస్తారు.

•••••••••

608. ❓ప్రశ్న:*

నేను HM గా పనిచేస్తున్నాను.అనారోగ్య కారణాల చేత SA గా రివర్సన్ తీసుకోవాలని అనుకుంటున్నాను.పరిస్థితి ఏమిటి??

✅జవాబు:*

FR14 ప్రకారం HM పోస్టులో లీన్ స్థిరీకరణ జరిగే వరకు SA పోస్టులో మీ లీన్ కొనసాగుతుంది.కనుక మీరు రివర్శన్ తీసుకోవచ్చు.ఐతే పదోన్నతి ద్వారా వచ్చిన 2 ఇంక్రిమెంట్లు రద్దు అవుతాయి.SA క్యాడర్ లో తదుపరి AAS కి అర్హత ఉండదు.

•••••••••

609. ❓ప్రశ్న:

నాకు వినికిడి లోపం 70 శాతం ఉన్నట్లు మెడికల్ సర్టిఫికేట్ కలదు. కాని ఎలవెన్స్ పొందటానికి సరైన వివరములు లేవు. నేను అలవెన్స్ పొందటానికి అర్హుడునా..???

✅జవాబు:*

మీరు కన్వీయన్స్ ఎలవెన్స్ కు అర్హులు. సంబంధిత ఉత్తర్వులు DDO ఇస్తే సరిపోతుంది.GO MS:197, Dt:6-7-2006. సివిల్ సర్జన్ ర్యాంక్ తగ్గని తత్సంబంధిత వైద్యుడు ఈ ధృవపత్రం జారీ చేయాలి. ఈ సర్టిఫికేట్ జారీ చేసిన తేదీ నుండి వర్తించును. CL తప్పించి మరి ఏ సెలవులలోనూ ఈ ఎలవెన్స్ ఇవ్వబడదు. సస్పెన్సన్ కాలంలో కూడా ఇవ్వబడదు.

GO MS No:262, Dt:25-8-1980

•••••••••

610. ❓ప్రశ్న:*

ఏ నెలలో ఆర్జిత సెలవు ను నగదుగా మార్చుకోవాలి??

✅జవాబు:*

మెమో.1478 ; ఆర్ధిక ; తేదీ:22.6.11 ప్రకారం 12 నెలల వ్యవధిలో 15 రోజులు,24 నెలల కాల వ్యవధి లో 30 రోజులు ఏ నెలలో నైనా ఆర్జిత సెలవు ను నగదుగా మార్చుకోవచ్చు.

error: Content is protected !!
Scroll to Top