మున్సిపల్ పాఠశాలలో పర్యవేక్షణ అధికారాలను పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ అప్పగిస్తూ మున్సిపల్ కార్యదర్శి ఉత్తర్వులు విడుదల.
MUNCIPAL TEACHERS MERGING IN EDUCATION DEPARTMENT G.O RELEASED
మునిసిపల్ టీచర్ల సర్వీసుల పర్యవేక్షణతోబాటు పరిపాలన బాధ్యతలు పాఠశాల విద్యా శాఖ కు అప్పగిస్తూ G.O.Ms.No.84, తేది: 24-06-2022 విడుదల అయ్యింది. దీని ప్రకారం ఇకపై మునిసిపల్ టీచర్ల సర్వీస్ లపై అజమాయిషీ విద్యా శాఖ కు అప్పగించబడింది. దీనివల్ల 398 నోషనల్ ఇంక్రిమెంట్లు, పి.యఫ్. , ప్రమోషన్స్, బదిలీలు వంటి విషయాల్లో మునిసిపల్ టీచర్లకు మేలు జరుగనుంది. హెడ్ మాస్టర్లకు డీడీఓ అధికారాలు రప్పించుకోవాలి. నాన్ టీచింగ్ స్టాఫ్ వ్యవస్థను పాఠశాల విద్యా శాఖ అధీనంలోకి వస్తున్నందున వారి జీత భత్యాలు కూడా విద్యాశాఖ చెల్లించవలసి ఉంటుంది.
మున్సిపల్ స్కూల్స్ కు సంబంధించిన ఆస్థులు మునిసిపల్ మేనేజిమెంట్ల పరిధిలోనే ఉంటాయి. ప్రమోషన్స్, బదిలీలు మునిసిపల్ పరిధిలోనే జరుగుతాయి.
మున్సిపల్ పాఠశాలల పరిపాలన, పర్యవేక్షణ బాధ్యతలు - పాఠశాల విద్యాశాఖ కి అప్పగిస్తూ ఉత్తర్వుల జారీ...* *G.O.MS.No.84 MA&UD Dt: 24-06-2022*
*విజయవాడకి, విశాఖపట్నంకి 324, 323 GOs లో ఉన్న సర్వీస్ రూల్స్ మాత్రమే వర్తిస్తాయి.*
*జిల్లా యూనిట్ గా మిగతా మున్సిపాలిటీస్ 320 GO ప్రకారం ఓకే గొడుగు కిందకు వస్తాయి.*
*జిల్లా పరిషత్ GO లు అన్నీ మున్సిపాలిటీలకు నగరపాలక సంస్థలకు వర్తిస్తాయి.*