summer-holidays-upto-june-30th-online-classes-from-june-12th-for-all-classes

జూన్ 30 వరకు పాఠశాలలకు *(ఉపాద్యాయులు మరియు విద్యార్థులకు కూడా)* వేసవి సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ.

★ జూన్ 12 నుండి అన్ని తరగతులకు ఆన్‌లైన్ విద్య కోసం, వివరణాత్మక అకడమిక్ క్యాలెండర్ మరియు వివిధ మార్గాల ద్వారా తీసుకోవలసిన కార్యకలాపాలను అంటే..
★ *డిడి,*
★ *రేడియో,*
★ *యూట్యూబ్,*
★ *వాట్సాప్ గ్రూపుల*
ద్వారా కాంటాక్ట్ కావడం మొదలైనవి సిద్ధం చేయాలని పాఠాశాల విద్య డైరెక్టర్, ఎస్.ఇ.ఆర్‌.టి కి ఆదేశం.

★ *10వ తరగతి విద్యార్థుల* విషయంలో సంబంధిత ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన విద్యా సహాయాన్ని *జూన్ 1 వ తేదీ నుంచి*  కొనసాగించాలి.

అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ..
★ *నాడు-నేడు,*
★ *మధ్యాహ్న భోజన పధకం,*
★ *జగనన్న విద్యా కానుక* కార్యక్రమాలకి సంబంధించి సంబంధిత అధికారుల సూచనలను పాటించాలని *తాజా  ఆదేశాలతో* పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ.. 

AP CSE PROCEEDINGS CLICK HERE

♦12 నుంచి ఆన్లైన్ తరగతులు

 రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలోకి రాకపోవడంతో వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

కేంద్ర మానవ వనరుల శాఖ ఇటీవల నిర్వహించిన సమావేశంలో రాష్ట్రాలు జూన్ 30 వరకు విద్యాసంస్థలను మూసివేయాలని సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను జూలైలో నిర్వహిస్తామని ప్రకటించింది.

సెలవుల పొడిగింపు, పరీక్షల వాయిదా నిర్ణయాలకనుగుణంగా అకడమిక్ క్యాలెండర్ రూపొందించాలని ఎస్సీఈఆర్టీకి సూచించారు. అలాగే సెలవుల్లో విద్యాబోధన కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే ప్రణాళిక సిద్ధం చేయాలని కోరారు. దూరదర్శన్, రేడియో, యూట్యూబ్, వాట్సప్ మాధ్యమాల ద్వారా విద్యార్థులకు తరగతులునిర్వహించేందుకు అవసరమైన కరిక్యులమ్  రూపొందించాలని ఉత్తర్వుల్లో సూచించారు.

ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులకు జూన్ 12వ తేదీ నుంచి ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.

జూలై నెలలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో జూన్ 1 నుంచే వారికి అవసరమైన విద్యా విషయిక అంశాలను వివరించేలా చూడాలని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలైన మనబడి నాడు- నేడు, జగనన్న విద్యాకానుకల కోసం తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు, మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్, పాఠశాల విద్య సలహాదారులతో అధికారులు సమన్వయం చేసుకోవాలని ఉత్తర్వుల్లో చినవీరభద్రుడు సూచించారు.

6TH CLASS TO 10TH CLASS WORK BOOKS & WORK SHEETS PDF

1st CLASS TO 10th CLASS ALL SUBJECTS TEXT BOOKS & WORK BOOKS CLICK HERE

error: Don\'t Copy!!!!