school-readiness-2021-22-guidelines-instructions-ap-cse-in-telugu

ప్రభుత్వ మెమో నంబరు: 1441536/Prog.II/A1/2021-2 తేది. 03.07.2021

️విషయం: పాఠశాల విద్య – COVID-19 ప్రత్యామ్నాయ విద్యా కార్యకలాపాలకు పాఠశాల సంసిద్ధత – తగు సూచనలు జారీ.

️నిర్దేశములు: ప్రభుత్వ ఉత్తర్వులు, పాఠశాల విద్య, 1441536/Prog.II/A1/2021, 3, 30. 06. 2021

పై సూచిక నందు 2021-22 విద్యా సంవత్సరానికిగాను, పాఠశాల సంసిద్ధత ప్రణాళిక తయారీకి బోధన- అభ్యాస ప్రక్రియ కు సూచనలు మరియు మార్గదర్శకాలను జారీ చేయడమైనది. సదరు సూచనలను అనుసరించి 2020-21 విద్యా సంవత్సరం ప్రారంభానికి గాను, విద్యార్థులు ప్రత్యక్ష బోధనాభ్యసన లో పాల్గొనేంత వరకు ఈ దిగువ మార్గదర్శకాలను సూచించడమైనది.

6TH CLASS TO 10TH CLASS VIDYA VARADHI WORK SHEETS FOR ONLINE CLASSES

ప్రాధమిక సన్నాహక సమావేశం:

 ది 05.07.2021 న గ్రామంలోని అన్ని ప్రాధమిక, ప్రాధమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ తమ గ్రామ / వార్డు సచివాలయాన్ని సందర్శించి సదరు కార్యదర్శి తో సమావేశం జరిపి ప్రస్తుతం కోవిద్ పరిస్థితుల దృష్ట్యా విద్యా శాఖ ఆదేశాలమేరకు సదరు పాఠశాల రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ను చర్చించడానికి 06.07.2021 న విస్తృత స్థాయి సమావేశం నకు గ్రామ సచివాలయ వాలంటీర్ లను హాజరు కావలసిందిగా కోరాలి. సదరు సమావేశంలో గ్రామ 1 వార్డు సచివాలయ సిబ్బంది ని, అంగన్వాడీ కార్యకర్తలను పాల్గొనమని కోరాలి. సమావేశ వేదికను సంయుక్తంగా నిర్ణయించాలి.

విస్తృత స్థాయి సమావేశం:

ది 06.07.2021 న ఆయా గ్రామాలలోని సంబంధిత గ్రామ సచివాలయ పరిధిలోని పాఠశాలల, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయలు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్స్, మరియు పేరెంట్స్ కమిటీ లతో విస్తృత స్థాయి సమావేశం కోవిద్ నిబంధనలను పాటిస్తూ ఏర్పాటు చేయాలి. ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించవచ్చు. ఈ సమావేశం లో పాఠశాల కోవిద్ ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళిక ను చర్చించాలి. ఈ ‘సమావేశం లో ఈ విషయాలు చర్చించాలి. దిగువ విషయాలు చర్చించాలి:

గ్రామ సచివాలయ పరిధి లోని విద్యార్థుల జాబితా ను తయారు చేసుకోవాలి. (అమ్మ ఒడి కోసం రూపొందించిన జాబితా ను సూచిక గా తీసుకొన వచ్చు) 

విద్యార్థుల సంఖ్య, మరియు ఉపాధ్యాయుల సంఖ్య ను బట్టి విద్యార్థులను, ఉపాధ్యాయులను బృందాలు గా చేసి ఉపాధ్యాయ బృందాలకు విద్యార్థి బృందాలను అనుసంధానం చేయాలి. ఉపాద్యాయ బృందం లో అంగన్వాడీ కార్యకర్తలను లను అవసరాన్ని బట్టి చేర్చుకోవాలి. ఈ ప్రక్రియ లో ఒక ఉపాధ్యాయ బృందానికి, విద్యార్థుల సంఖ్య 15 కు మించకుండా చూడాలి. తప్పని పరిస్థితులలో విద్యార్థుల సంఖ్య ను పెంచుకోవచ్చు.

ఈ ఉపాధ్యాయ బృందాలు, తమ కు కేటాయించబడిన విద్యార్థులకు ఏ ఏ పరికరాలు అందుబాటులో ఉన్నాయో చూసుకొని, చురుకైన విద్యార్థులు నాయకులు / చిట్టి ఉపాధ్యాయులు గా పరిగణించి వారి ద్వారా ఉపాధ్యాయ పర్యవేక్షణ లేని సమయం లో సదరు విద్యార్థుల బృందం ప్రత్యమ విద్యాభ్యసన కు తోడ్పడేలా చూడాలి.

ఈ ప్రక్రియ లో విద్యార్థులకు ప్రభుత్వం అందిచే డ్రై రేషన్, మొదలైన ప్రయోజనాలు సకాలంలో అందిచడం తో పాటుగా, బడి బయటి విద్యార్థులను గుర్తించి వారిని కుడా ఈ ప్రత్యామ్నాయ విద్యా అభ్యాసన లో భాగస్వామ్యం చేయాలి.

ది. 15.07. 2021 నుండి జరగబోయే ప్రత్యామ్నాయ బోధనాభ్యసనకు రాష్ట్ర విద్యా శాఖ ద్వారా ప్రసారమయ్యే దూరదర్శన్ మరియు రేడియో కార్యక్రమాల వివరాలను విదార్థులకు తెలియజేయాలి. ఈ కార్యక్రమాలు తమ గ్రూప్ లోని విద్యార్థులందరూ వీక్షించే/ఆలకించే విధంగా ఉపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలి. 

విద్యార్థులకు వివిధ మాధ్యమాల ద్వారా అందుబాటులో గల డిజిటల్ కంటెంట్ ను సేకరించి వాటిని విద్యార్థులకు అందచేయాలి (డీఖా నందు గల కంటెంట్ ను ఉపయోగించుకోవచ్చును)  ఔత్సాహిక ఉపాధ్యాయులు వీడియోలను తయారు చేసి విద్యార్థులకు అందేలా చూడాలి. సదరు వీడియోలను ప్రసారం చేయడానికి స్థానిక కేబుల్ నెట్వర్క్ వారి సహాయం తీసుకోవచ్చును. . 

ఈ ప్రత్యామ్నాయ విద్యాభ్యాసం గ్రంథాలయాల సౌకర్యాలను వినియోగించుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. 

సాంకేతిక సహకారం కోసం స్థానికంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు సహకారం తీసుకోవచ్చును. సహాయం తీసుకోవచ్చును. ఈ ప్రత్యామ్నాయ విద్యాభ్యాసం గ్రంథాలయాల సౌకర్యాలను వినియోగించుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. 

 సాంకేతిక సహకారం కోసం స్థానికంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు సహకారం తీసుకోవచ్చును.

07.07 2021 నుండి పైన తెలుపబడిన అంశాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి రోజువారీ కార్యాచరణను ను రూపొందించుకోవాలి.

పాఠశాల సంసిద్ధత కొరకు రేడియో పాఠాలు / వీడియో తరగతులు:

1ST CLASS TO 10TH CLASS DOORDARSHAN SAPTHAGIRI VIDEO LESSONS ALL SUBJECTS

విద్యార్థులలో అభ్యసనాంతరాలను పూడ్చడం, అభ్యసన సులభతరం చేయటం తో పాటు విద్యార్థులు ప్రత్యక్ష బోధన మొదలుపెట్టేనాటికి పాఠశాల సంసిద్ధత కోసం వీడియో తరగతులు దూరదర్శన్ (సప్తగిరి) ఛానల్ ద్వారా ప్రతిరోజు ప్రసారం చేయడానికి, అదేవిధంగా రేడియో పాఠాలు కూడా ప్రసారం చేయడానికి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టరుగారు తగిన చర్యలు తీసుకోవాలి. అందుకు అవసరమైన షెడ్యూలు ను వెంటనే విడుదల చేయాలి. విద్యార్థులు ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా పరిజ్ఞానం మెరుగుపరచడానికి మరియు ముఖ్యమైన పాఠ్యాంశ భావనలను పునశ్చరణ చేసుకోవడానికి ఈ తరగతులు సహాయపడతాయి.

ఏ ఏ విద్యార్థులు ఈ కార్యక్రమాలు ఆలకించారో / వీక్షించారో సంబంధిత గ్రూప్ఉ పాధ్యాయులు ఎప్పటికప్పుడు నమోదు చేసుకోవాలి.

రాష్ట్ర విద్యాపరిశోధనా, శిక్షణ సంస్థ వారి వర్క్ షీట్స్:

6TH CLASS TO 10TH CLASS VIDYA VARADHI WORK SHEETS FOR ONLINE CLASSES

ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి రాష్ట్ర విద్యాపరిశోధనా, శిక్షణ సంస్థ సంబంధిత వర్క్ షీట్స్ లను 15. 07. 2021 నాటికి అందుబాటులోకి తీసుకు రావాలి. 

సదరు వర్క్ షీట్స్ జిల్లా ఉమ్మడి పరీక్షా బోర్డుల ద్వారా పాఠశాలలకు అందుబాటు లోకి తీసుకు రావాలి.

రేడియో, వీడియో పాఠాలను అనుసరించి, అవి ప్రసారం కాబడిన తేదీ తర్వాత విద్యార్థులకు తగిన సూచనలు ఇచ్చి వర్క్ షీట్స్ పూర్తి చేసేవిధంగా తగు చర్యలు చేపట్టాలి. 

తదుపరి వారం లో ఏ ఏ విద్యార్థులు వర్క్ షీట్స్ పూర్తి చేసారో లేదో సమీక్షించి, ఆ యా ఫలితాలను తల్లిదండ్రులు, మరియు ఉపాధ్యాయ గ్రూప్స్ ద్వారా విద్యార్థులకు తెలియజేయాలి.

రాష్ట్ర విద్యాపరిశోధనా, శిక్షణ సంస్థ వారు రూపొందించిన వర్క్ షీట్స్ కు అదనంగా ఉపాధ్యాయులు తమ తమ విద్యార్థులకు వారి అభ్యాసన స్థాయిని బట్టి వర్క్ షీట్స్ రూపొందిచవచ్చు.

1ST CLASS TO 10TH CLASS ALL SUBJECTS TEXT BOOKS PDF

ప్రత్యమ్నాయ బోధనాభ్యసన లో ఉపాధ్యాయుల పాత్ర:

ఉపాధ్యాయులు బృందాలు గా ఏర్పడాలి. 

వారికీ అనుసంధానం చేయబడిన విద్యార్థులను సందర్శిచాలి. వారి తల్లి దండ్రులకు ప్రస్తుత ప్రత్యామ్నాయ బోధభ్యసన పట్ల అవగాహన కల్పించాలి. 

చిట్టి నాయకులు / చిట్టి ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేసుకోవాలి. 

సాంకేతిక సాధనాల ద్వారా సాధ్యమైన ఇ-కంటెంటు సేకరించాలి. విద్యార్థులకు అందించాలి. కోవిద్ పరిస్థితుల పట్ల అవగాహన కల్పించాలి. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలి.

ప్రధానోపాధ్యాయుల పాత్ర:

ఉపాధ్యాయుల సేవలను తగిన విధం గా ఉపయోగించుకోవాలి. సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. 

తమ తమ పరిధి లోని ఉపాధ్యాయ గ్రూపులను, విద్యార్థుల గ్రూపులను నిరంతరం పర్యవేక్షిస్తూ సలహాలు సూచనలు ఇవ్వాలి. తగిన సహకారం అందించాలి. విద్యార్థుల అభ్యసనాన్ని రికార్డు చేయాలి.

డిజిటల్, వర్చ్యువల్ క్లాసూంలను అందుబాటు లోకి తీసుకురావాలి. • సాంకేతిక సాధనాలు అందుబాటులో లేని (నో-టెక్) విద్యార్థులకు వారి తల్లిదండ్రుల అనుమతి తో దూరదర్శన్, రేడియో కార్యక్రమాలు పాఠశాలలో వీక్షించే / ఆలకించే ఏర్పాటు చేసుకోవచ్చు. (కోవిద్ నిబంధనలు తప్పనిసరి)

స్థానిక ప్రజా ప్రతినిధులకు విషయావగాహన చేయడం ద్వారా తగిన సహకారాన్ని పొందాలి.

పేరెంట్స్ కమిటీలను భాగస్వామ్యం చేయాలి.

జుమ్/వెబెక్స్ వంటి సాధనాలతో ఉపాధ్యాయులతో సమీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల ప్రగతి ని చర్చించాలి. సమాచారాన్ని ఎప్పటికప్పుడు పై అధికారులకు వినతించాలి.

ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత అంగన్వాడీ కార్యకర్తలనుండి 3+, 4+, 5+ పిల్లల వివరాలు సేకరించాలి.

పాఠశాలకు అందవలసిన టెక్స్ట్ బుక్స్, జగనన్న విద్యా కానుక కిట్స్ అన్నీ సరిపడా అందాయో లేదో చూసుకోవాలి. అవసరం ఐతే సంబంధి మండల విద్యాశాఖాధికారులకు విషయాన్ని తెలియజేయాలి.

విద్యార్థులను నమోదు చేసుకునేటప్పుడు. గత ఆదేశాలను దృష్టిలో ఉంచుకోవాలి.

కోవిడ్-19 ని నియంత్రించడానికి ఎప్పటికప్పుడు ఇస్తున్న ప్రామాణిక కార్యాచరణ విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలి.

అందరు ప్రాంతీయ విద్యా ఉప సంచాలకులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు మరియు సమగ్ర శిక్షా అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు ఈ కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలి.

సంచాలకులు, పాఠశాల విద్య, సమగ్ర విద్య రాష్ట్ర ప్రాజెక్టు డైరక్టరుగారు, సంచాలకులు, రాష్ట్ర విద్యాపరిశోధనా శిక్షణ మండలి మరియు సంచాలకు, సీమాట్ వారు పై ఆదేశాలను అమలు చేయడానికి ప్రాంతీయ సమ్యుక్త సంచాలకులకు, జిల్లా విద్యాశాఖాధికారులకు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లకు, ఇతర క్షేత్ర స్థాయి సిబ్బందికి తగిన ఆదేశాలు వెంటనే జారీ చేయాలి. ఈ విషయమై ప్రగతిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించాలి.

APSCERT NW TEXT BOOKS FOR ALL CLASSES & ALL SUBJECTS PDF FILES

ADMISSION FORMS PDF 2021-22 YEAR FOR PRIMARY, UP & HIGH SCHOOLS

error: Don\'t Copy!!!!