SBI Raksha Bandhan Offer-20%-DISCOUNT-upto-August-22

SBI Raksha Bandhan Offer: ఎస్‌బీఐ కస్టమర్లకు బంపరాఫర్.. రక్షా బంధన్ సందర్భంగా భారీ డిస్కౌంట్లు

రక్షాబంధన్ సందర్భంగా దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాదాాదారులకు శుభవార్త చెప్పింది. షాపింగ్ పై భారీ డిస్కౌంట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

YONO SBI: The Mobile Banking and Lifestyle App!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. రక్షా బంధన్ కొనుగోళ్లపై భారీగా ఆఫర్లను ప్రకటించింది. యోనో యాప్ ద్వారా షాపింగ్ చేస్తే 20 శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు ప్రకటించింది.

కరోనా నేపథ్యంలో తమ కస్టమర్లు ఆన్లైన్ షాపింగ్ చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించింది. ఫెర్న్స్ యాంట్ పెటల్స్ కంపెనీకి చెందిన బహుమతి కొనుగోలు చేసిన కస్టమర్లు 20 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చని SBI తెలిపింది. అయితే.. ఎంత తక్కువ మొత్తంలో షాపింగ్ చేసినా ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని SBI స్పష్టం చేసింది.

అయితే.. గరిష్టంగా డిస్కౌంట్ రూ. 999 వరకు మాత్రమే ఉంటుంది.

యోనో యాప్ ద్వారా షాపింగ్ చేసిన వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది

SBI Home Loan: కొత్త ఇల్లు కొనాలనుకుంటున్న వారికి SBI శుభవార్త.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బంపరాఫర్

యోనో యాప్ ద్వారా చెల్లింపులు చేసిన వారికే ఈ డిస్కౌంట్ అందుతుంది. వినియోగదారులు ఈ ఆఫర్‌కి సంబంధించి ఏదైనా సందేహాలుంటే ఉంటే.. SBI YONO, sbiyono.sbi అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని SBI సూచించింది. యోనో SBI యాప్ లేని వారు sbiyono.sbi/index.html ఈ లింక్ తో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎస్‌బిఐ ట్వీట్ చేసింది.

ఈ ఆఫర్ రాఖి పండగ అయిన ఆగస్టు 22 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ తెలిపింది. SBI20 కోడ్ ను ఉపయోగించి షాప్ చేస్తే డిస్కౌంట్ అందుకోవచ్చు.

FOR MORE DETAILS CLICK HERE

error: Don\'t Copy!!!!