SBI Quick Personal Loan-through-salary-account

SBI Quick Personal Loan: ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? 15 నిమిషాల్లో రూ.20 లక్షల లోన్

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ బ్యాంకులో సాలరీ అకౌంట్ (SBI Salary Account) ఉన్నవారికి కేవలం 15 నిమిషాల్లోనే రూ.20 లక్షల వరకు పర్సనల్ లోన్ మంజూరు చేస్తోంది.

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కస్టమరా? ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉందా? అయితే మీరు రూ.20 లక్షల వరకు పర్సనల్ లోన్ (Personal Loan) తీసుకోవచ్చు. తమ బ్యాంకులో సాలరీ అకౌంట్ ఉన్నవారి కోసం ఎస్‌బీఐ క్విక్ పర్సనల్ లోన్ (SBI Quick Personal Loan) పేరుతో వెంటనే వ్యక్తిగత రుణాలను మంజూరు చేస్తోంది ఎస్‌బీఐ. కస్టమర్లు వ్యక్తిగత అవసరాలు, పెళ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులు, ఇతర అవసరాల కోసం ఈ రుణాలను ఉపయోగించుకోవచ్చు. కస్టమర్లు తక్కువ వడ్డీకే రూ.20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు.

వడ్డీ రేట్లు కూడా తక్కువ. https://www.sbiloansin59minutes.com/ ప్లాట్‌ఫామ్ ద్వారా కేవలం 15 నిమిషాల్లో రుణాలను మంజూరు చేస్తోంది ఎస్‌బీఐ.

SBI Quick Personal Loan: ఎస్‌బీఐ క్విక్ పర్సనల్ లోన్ వివరాలు

ఎస్‌బీఐ క్విక్ పర్సనల్ లోన్ అర్హతల వివరాలు చూస్తే ఈ రుణాలకు దరఖాస్తు చేసే కస్టమర్లకు తప్పనిసరిగా ఎస్‌బీఐలో సాలరీ అకౌంట్ ఉండాలి. ప్రతీ నెలా రూ.15,000 పైనే అకౌంట్‌లో సాలరీ క్రెడిట్ అవుతూ ఉండాలి. ఇందులో 50 శాతం వరకు ఈఎంఐ వచ్చేలా పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసేవారు, కార్పొరేట్ ఉద్యోగులు ఈ రుణాలకు దరఖాస్తు చేయొచ్చు. కనీసం ఒక ఏడాది సర్వీసులో ఉండాలి.

ఎస్‌బీఐ క్విక్ పర్సనల్ లోన్‌కు దరఖాస్తు చేసే కస్టమర్ల వయస్సు 21 నుంచి 58 ఏళ్ల మధ్య ఉండాలి. కనీసం రూ.24,000 నుంచి రూ.20,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజు లోన్ అమౌంట్‌లో 1.50 శాతం చెల్లించాలి. కనీసం రూ.1,000 నుంచి రూ.15,000 + జీఎస్‌టీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. రీపేమెంట్ కోసం 6 నెలల నుంచి 72 నెలల మధ్య గడువును ఎంచుకోవచ్చు. 10.85 శాతం నుంచి 12.85 శాతం మధ్య వడ్డీ చెల్లించాలి.

SBI Quick Personal Loan: ఎస్‌బీఐ క్విక్ పర్సనల్ లోన్‌కు దరఖాస్తు చేయండి ఇలాStep 1- ముందుగా https://www.sbiloansin59minutes.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Step 2- హోమ్ పేజీలో Personal Loan పైన క్లిక్ చేయాలి.

Step 3- ఆ తర్వాత apply now పైన క్లిక్ చేయాలి.

Step 4- ఆ తర్వాత పూర్తి పేరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌తో రిజిస్ట్రేషన్ చేయాలి.

Step 5- మీ వివరాలతో లాగిన్ చేసిన తర్వాత మీ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

Step 6- ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

Step 7- మీరు ఎంత రుణానికి దరఖాస్తు చేస్తున్నారో, టెన్యూర్ ఎంతో సెలెక్ట్ చేయాలి.

Step 8- మీ వివరాలను విశ్లేషించి 15 నిమిషాల్లో ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ లభిస్తుంది.

error: Don\'t Copy!!!!