SBI PO 2022 Notification-1673-jobs

SBI PO 2022 Notification: డిగ్రీ అర్హతతో 1673 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

RECRUITMENT OF PROBATIONARY OFFICERS ADVERTISEMENT NO: CRPD/ PO/2022-23/18

Important Events

Dates

Commencement of on-line registration of application 22/09/2022
Closure of registration of application 12/10/2022
Closure for editing application details 12/10/2022
Last date for printing your application 27/10/2022
Online Fee Payment 22/09/2022 to 12/10/2022

SBI PO Notification 2022: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI).. సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్‌ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్.. పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రధానాంశాలు:

ఎస్‌బీఐ పీవో రిక్రూట్‌మెంట్‌ 2022

1673 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల

సెప్టెంబర్‌ 22 నుంచి దరఖాస్తులు ప్రారంభం

నోటిఫికేషన్‌

SBI PO JOBS ONLINE APPLICATION

SBI PO Recruitment 2022: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(SBI).. సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్‌ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్.. పీవో ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్‌ 22 నుంచి ప్రారంభమవుతుంది. అక్టోబర్‌ 12 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://sbi.co.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ప్రొబేషనరీ ఆఫీసర్: 1673 పోస్టులు(ఎస్సీ- 270, ఎస్టీ- 131, ఓబీసీ- 464, ఈడబ్ల్యూఎస్‌- 160, యూఆర్‌- 648)

ఖాళీలు: రెగ్యులర్- 1600; బ్యాక్‌లాగ్- 73.

అర్హతలు: ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి(01.04.2022 నాటికి): 21 – 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు బేసిక్‌ పే రూ.41,960.

దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు మినహాయింపు ఉంటుంది).

ఎంపిక విధానం: ఫేజ్ 1- ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2- మెయిన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 3- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ & ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రీ-ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సెంటర్లు/ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్లు: చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.

ఏపీ అండ్‌ తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్‌ 22, 2022

దరఖాస్తులకు చివరితేది: అక్టోబర్‌ 12, 2022

దరఖాస్తు ఫీజు చెల్లింపు తేదీలు: 22.09.2022 నుంచి 12.10.2022 వరకు.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్: 2022, డిసెంబర్ మొదటి/ రెండో వారంలో ప్రారంభం.

స్టేజ్‌ 1- ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2022, డిసెంబర్ 17/ 18/ 19/ 20

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన: డిసెంబర్ 2022/ జనవరి 2023

మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్: జనవరి 2023/ ఫిబ్రవరి 2023

స్టేజ్‌ 2- ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్‌: జనవరి 2023/ ఫిబ్రవరి 2023

మెయిన్‌ ఎగ్జామ్ రిజల్ట్‌ ప్రకటన: ఫిబ్రవరి 2023

ఫేజ్ 3 కాల్ లెటర్ డౌన్‌లోడ్: ఫిబ్రవరి 2023

ఫేజ్ 3- సైకోమెట్రిక్ పరీక్ష: ఫిబ్రవరి/ మార్చి 2023

ఇంటర్వ్యూ & గ్రూప్ ఎక్సర్‌సైజ్‌ తేదీలు: ఫిబ్రవరి/ మార్చి 2023

తుది ఫలితాల ప్రకటన: మార్చి 2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://sbi.co.in/

ప్రిలిమినరీ రాత పరీక్ష విధానం: మొత్తం 100 మార్కులకు, 100 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలకు ఆన్‌లైన్‌ విధానంలో గంట సమయంలో పరీక్ష జరుగుతుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌లో 30 ప్రశ్నలకు 30 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీలో 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష జరుగుతుంది.

నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.
మెయిన్‌ రాత పరీక్ష విధానం: 

మొత్తం 155 ఆబ్జెక్టివ్‌ టైప్ ప్రశ్నలకు 200 మార్కులకుగానూ 3 గంటల సమయంలో పరీక్ష ఉంటుంది. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌లో 40 ప్రశ్నలకు 50 మార్కులు, డాటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌లో 30 ప్రశ్నలకు 50 మార్కులు, జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్‌లో 50 ప్రశ్నలకు60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో 35 ప్రశ్నలకు 40 మార్కుల చొప్పున ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష ఉంటుంది.

డిస్క్రిప్టిప్‌ పేపర్:

 రెండు ఎస్సేలకు 20 మార్కుల చొప్పున 50 మార్కులకు 30 నిముషాల్లో పరీక్ష ఉంటుంది. గ్రూప్‌ ఎక్సర్‌సైజ్‌కు 20 మార్కులు, ఇంటర్వ్యూకు 30 మార్కులు ఉంటుంది.

నోటిఫికేషన్‌
SBI PO JOBS ONLINE APPLICATION

error: Don\'t Copy!!!!