RECRUITMENT OF lic-HFL-ASSISTANTS & ASSISTANT MANAGERS

RECRUITMENT OF lic-HFL-ASSISTANTS & ASSISTANT MANAGERS

LIC HFL Jobs 2022: ఎల్‌ఐసీలో ఉద్యోగాలు.. డిగ్రీ, పీజీ పాసైన వాళ్లు అర్హులు.. రూ.80,110 వరకూ జీతం

LIC Housing Finance Limited: ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ అసిస్టెంట్/ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 25 దరఖాస్తులకు చివరితేది

LIC HFL Recruitment 2022:ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలోని శాఖల్లో అసిస్టెంట్/ అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నియామకానికి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 80 పోస్టులను భర్తీ చేయనుంది.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.

అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవచ్చు. ఆగస్టు 25 దరఖాస్తులకు చివరితేది.

LIC HFL JOBS ONLINE APPLICATION

LIC HFL JOBS NOTIFICATION PDF

మొత్తం ఖాళీల సంఖ్య: 80

 • అసిస్టెంట్: 50 పోస్టులు

 • అసిస్టెంట్ మేనేజర్: 30 పోస్టులు

ముఖ్య సమాచారం:

 • అర్హత: అభ్యర్థులకు ఏదైనా డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ నైపుణ్యాలు ఉండాలి.

 • వయోపరిమితి (01.01.2022 నాటికి): 21 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

 • జీత భత్యాలు: నెలకు రూ.33,960(అసిస్టెంట్ పోస్టులకు), రూ.80,110(అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులకు) ఉంటుంది.

 • ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉంటుంది.

 • దరఖాస్తు ఫీజు: రూ.800

 • ఏపీ, తెలంగాణలోని ఆన్‌లైన్ పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.

 • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: ఆగస్టు 25, 2022

 • ఆన్‌లైన్ పరీక్ష(అసిస్టెంట్): సెప్టెంబర్- అక్టోబర్ 2022

 • ఆన్‌లైన్ పరీక్ష (అసిస్టెంట్ మేనేజర్): సెప్టెంబర్- అక్టోబర్ 2022

 • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.lichousing.com/

LIC HFL JOBS ONLINE APPLICATION

LIC HFL JOBS NOTIFICATION PDF