RBI-changed-banking-times-details

Bank Timings: బ్యాంక్ ఖాతాదారులకు RBI శుభవార్త.. మారిన బ్యాంకుల టైమింగ్స్.. వివరాలివే

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. బ్యాంకుల టైమింగ్స్ (Banks Timings) మార్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బ్యాంకు ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త చెప్పింది. బ్యాంకు పని గంటలను పెంచింది. దీంతో బ్యాంకు పని వేళల్లో మార్పులు జరగనున్నాయి. ఆర్బీఐ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఉదయం 9 గంటలకే బ్యాంకులు ఇక తెరుచుకోనున్నాయి

సోమవారం నుంచే ఈ నిర్ణయం అములులోకి వచ్చంది. అయితే.. బ్యాంకుల క్లోజింగ్ టైం మాత్రం మారలేదు. బ్యాంకులను మూసే సమయం మాత్రం యథాతథంగా ఉంటుందని RBI ప్రకటించింది

కరోనా మహమ్మారి ప్రారంభంలో బ్యాంకులు తెరిచి ఉండే సమయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగ్గించింది. అయితే.. ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గి సాధారణ పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో బ్యాంకులు తెరిచి ఉండే సమయాన్ని పెంచాలని నిర్ణయించింది

దీంతో సోమవారం నుంచి ఉదయం 9 గంటలకే బ్యాంకులు తెరిచి ఉంచేలా నిర్ణయం తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇదిలా ఉంటే.. తమ నియంత్రణలో ఉండే మార్కెట్‌ ట్రేడింగ్‌ సమయాల్లో సైతం ఆర్‌బీఐ మార్పులు చేసింది

కొత్త ట్రేడింగ్‌ సమయం సోమవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఇదిలా ఉంటే ఆర్బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమ నియంత్రణలో ఉండే మార్కెటింగ్ ట్రేడింగ్ వేళలను సవరించింది

ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఉంటాయని ఆర్బీఐ వెల్లడించింది. కరోనా పరిస్థితులు అదుపులోకి రావడంతో బ్యాంకుల టైమింగ్స్. ట్రేడింగ్ సమయాన్ని పునరుద్ధరించినట్లు ఆర్బీఐ వెల్లడించింది

error: Don\'t Copy!!!!