Punjab-National-Bank-145-jobs-recruitment

Punjab-National-Bank-145-jobs-recruitment

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో 145 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ () 145 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 22 నుంచి ప్రారంభమవుతుంది. ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మే 7వ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 145

  • మేనేజర్ (రిస్క్‌)- 40

  • మేనేజర్‌ (క్రెడిట్‌)- 100

  • సీనియర్‌ మేనేజర్‌ (ట్రెజరీ)- 5

ముఖ్య సమాచారం:

  • అర్హతలు: పోస్టులను బట్టి సీఏ/సీఎంఏ లేదా 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ (ఫైనాన్స్‌)/ పీజీడీఎం (ఫైనాన్స్‌)/ తత్సమాన పీజీ డిగ్రీ (ఫైనాన్స్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

  • వయసు: అభ్యర్థుల వయసు 25 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి.

  • ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

  • దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.50, ఇతరులకు రూ.850

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్‌ 22, 2022

  • దరఖాస్తులకు చివరితేది: మే 7, 2022

  • పరీక్ష తేది: జూన్‌ 12, 2022

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://www.pnbindia.in/

NOTICE DATED (20-04-2022)

RECRUITMENT FOR 145 POSTS OF SPECIALIST OFFICERS

error: Content is protected !!
Scroll to Top