PRC-NEWS-main-points-prc-caliculator-tables-software

PRC కి సంబంధించిన కీలక ఉత్తర్వులు రెడీ అయ్యి నిన్న సాయంత్రం విడుదల చేయాలని భావించినా ఉద్యోగులు ముఖ్యంగా ఉపాధ్యాయుల నుండి వెల్లువెత్తుతున్న నిరసన దృష్ట్యా పునరాలోచనలో ఆర్థిక శాఖ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం….

ఇదే ఊపు తో నిరసనలు వెల్లువెత్తాలి…. రివర్స్ PRC రివర్స్ అవ్వాలి అంతే…

Completely clarity this pdf file to know your loosings CLICK HERE

AP PRC Salary Difference Statement (Online)
From Jul 2018 to Dec 2021 (Month wise)*
కొత్త PRC లో మీ నెలవారీ జీతం ఎంత తగ్గుతుందో తెలుసుకోండి
రెండు నిమిషాలలో మీ కొత్త జీతం వివరాలను ఒకసారి చెక్ చేయండి.

CLICK HERE

https://teachernews.in/ap-prc-salary-statement/

01/07/2018 నాటి బేసిక్ గుర్తు లేకపోయినా ప్రస్తుత నెల బేసిక్ తో PRC ని 23.29%  fitmemt తో calculate చేసుకోవటానికి వీలుగా కింది లింక్ లో calculator ఇవ్వబడినది

కాకపోతే కొత్త PRC Master Scales ఇంకా లేనందున ప్రస్తుతానికి సుమారుగా  fixation calculation ఒక ఉదాహరణగా చూపించబడినది

కింది link open చేసిన తర్వాత ప్రస్తుత నెల  Basic,  increment month, HRA select చేసి, submit ట్యాప్ చెయ్యండి

Next screen లో 01/07/2018 నుండి ప్రస్తుత నెల వరకు Year wise increments ప్రస్తుత & కొత్త PRC  comparision తో పాటు నెలకి సుమారుగా Gross లో కనపడే పెరుగుదల చూసుకోవచ్చు

https://prtuinfo.com/ap/prc/prc3.php

దీన్ని కేవలం ఉదాహరణగా పరిగణించగలరు. AP Master Scales declare అయిన తర్వాత exact calculation update చెయ్యటం జరుగుతుంది

2022 జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త జీతాలు

2018 జూలై 1 నుంచి పీఆర్సీ అమలు..

2020 ఏప్రిల్‌ 1 నుంచి మానిటరీ ప్రయోజనాలు

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా

కొత్త స్కేల్స్‌ వర్తింపు

సీపీఎస్‌పై జూన్‌ 30లోగా నిర్ణయం

ఇక నుంచి సెంట్రల్‌ పీఆర్సీ ప్రతిపాదనలే పరిగణనలోక

FIND NEW PRC 2022 YOUR NEW BASIC PAY CLICK HERE

కొత్త జీతాలు ఈ నెల నుంచే.. 
►2018 జూలై 1 నుంచి పీఆర్సీ, 2020 ఏప్రిల్‌ 1 నుంచి మానిటరీ బెనిఫిట్‌ అమలు చేస్తాం. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ.10,247 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను.
►సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే, అంటే ఈ నెల నుంచే ఆ  జీతాలు ఇవ్వాలని ఆదేశించాను.
► కొత్త స్కేల్స్‌ను రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా 2022 జనవరి 1 నుంచే అమలు చేయాలని నిర్ణయించాం.

ACTUAL PRC BENEFIT PDF FILE WITH BASIC PAY

21 నెలల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్‌ 
►సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని చెప్పింది. అయితే మీ అందరి ప్రభుత్వంగా 2020 ఏప్రిల్‌ నుంచే.. అంటే 21 నెలల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని నిర్ణయించాం.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30 లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జూలై జీతం నుంచి ఇస్తాం.
► ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలన్నీ ఏప్రిల్‌ నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించాను.
►పీఆర్సీ అమలు చేసే నాటికి పెండింగ్‌ డీఏలు ఉండకూడదని నిన్న (గురువారం) మీతో (ఉద్యోగ సంఘాలతో) చెప్పిన విధంగా.. అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని చెప్పాను.

సొంత ఇల్లు లేని వారికి స్థలాలు
►సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో– ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10 శాతం రిజర్వ్‌ చేస్తాం. అంతే కాకుండా 20 శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించాం.
►నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటి స్థలం లేదనే మాట లేకుండా చూస్తాం. ఆ రిబేటును ప్రభుత్వం భరిస్తుంది.

DSC-1998 TO DSC-2018 PRC BENEFITS NEW BASIC PAYS CLICK HERE

కారుణ్య ఉద్యోగాలు
►కోవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జూన్‌ 30లోగా ఈ నియామకాలన్నీ పూర్తి చేయాలని ఆదేశించాను. మీ అందరి సమక్షంలో మళ్లీ చెబుతున్నా.
►ఈహెచ్‌ఎస్‌– ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించాలని చెప్పాం. ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి, వారి సూచనలు, సలహాల ప్రకారం మంచి పాలసీ వచ్చేలా చూస్తుంది.
►సీపీఎస్‌కు సంబంధించి కూడా టైంలైన్‌ పెట్టుకోవాలి. ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశాం. జూన్‌ 30లోగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాం.

NEW PRC BASIC PAYS CLICK HERE

ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ఇదే తొలిసారి

  • 27 శాతమైనా ఇచ్చేలా పునరాలోచించాలి: ఉపాధ్యాయ సంఘాలు

ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువుగా ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక (ఫ్యాప్టో) విమర్శించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఫించనుదారులను ఇది నిరాశ పరిచిందని ఫ్యాప్టో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జోసెఫ్‌ సుధీర్‌బాబు, రఘునాథరెడ్డి అన్నారు. ఐఆర్‌ 27శాతం ఇచ్చి ఫిట్‌మెంట్‌ 23 శాతమే ఇవ్వడం సరికాదని యూటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎ్‌స.ఎ్‌స.ప్రసాద్‌ తెలిపారు. 27 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేలా సీఎం జగన్‌ పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు. కొన్ని అంశాలపై సానుకూల ప్రకటన చేయడంపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ధరల సూచీ, ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా తీసుకుంటే 54 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.భానుమూర్తి, పి.పాండురంగ వరప్రసాదరావు అన్నారు.

తెలంగాణలో ఇచ్చినంత కూడా ఇవ్వలేదని… ఇది తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. మూడేళ్ల నుంచి ఎదురుచూస్తున్న పీఆర్‌సీని చివరకిలా 23 శాతంగా ప్రకటించడం నిరాశ కలిగించిందని బహుజన టీచర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు శరత్‌చంద్ర, వెంకట్రావు విమర్శించారు. ఫిట్‌మెంట్‌ కనీసం 27 శాతం కూడా ప్రకటించకపోవడం సరికాదని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఫిట్‌మెంట్‌, ఇంటి అద్దె విషయంలో న్యాయం చేయాలన్నారు.

AP PRC Salary Difference Statement (Online)*
From Jul 2018 to Dec 2021 (Month wise)*
కొత్త PRC లో మీ నెలవారీ జీతం ఎంత తగ్గుతుందో తెలుసుకోండి
రెండు నిమిషాలలో మీ కొత్త జీతం వివరాలను ఒకసారి చెక్ చేయండి.

https://teachernews.in/ap-prc-salary-statement

ప్రభుత్వ ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించారు. ఈ నెల నుండే పెంపుదలను అమలు చేయనున్నారు. 2020 ఏప్రిల్‌ నుండి మానిటరీ బెనిఫిట్స్‌ అమలవనున్నాయి. హెచ్‌ఆర్‌ఏపై సిఎస్‌ స్పష్టత ఇవ్వలేదు. ఐఆర్‌కంటే తక్కువగా ఫిట్‌మెంట్‌ ప్రకటించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ చెల్లించకుండా నిలిపేసిన డిఏ బకాయిలను విడుదల చేసే నిర్ణయాన్ని పిఆర్‌సితో ముడిపెట్టి ప్రకటించారు. పిఆర్‌సిపై నెలరోజులుగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఉద్యోగ సంఘాల నాయకులతో సిఎం సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం మరోసారి సమావేశానికి పిలిపించారు. తొలుత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఉద్యోగులతో చర్చించిన అనంతరం సిఎం వచ్చి పిఆర్‌సి ప్రకటన చేశారు. తొలుత ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సును 60 ఏళ్ల నుండి 62 సంవత్సరాలకు పెంచారు. జనవరి 2022 నుండే ఇది అమల్లోకి వస్తుంది. అధికారుల కమిటీ 14.29 శాతం పెంచాలని సూచించినా 23 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.10,247 కోట్లు భారం పడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీముకు సంబంధించి రెండు వారాల్లో స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సిపిఎస్‌పై జూన్‌లోగా ప్రభుత్వ స్పష్టత ఇస్తుందని తెలిపారు. ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో ఎంఐజి లేఅవుట్లోని ప్లాట్లలో 10 శాతం ప్లాట్లను రిజర్వు చేయడమే కాకుండా 20 శాతం రిటేబును ఇస్తున్నట్లు సిఎం హామీనిచ్చారు. కోవిడ్‌ కారణంగా చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్‌లోపు ఉద్యోగం ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30లోగా ప్రొబేషన్‌, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను జులై నుండి అమలు చేయాలని ఆదేశించారు. అలాగే ఉద్యోగుల పెండింగ్‌ బకాయిలు, పిఎఫ్‌, జిఎల్‌ఐ, లీవ్‌ఎన్‌క్యాష్‌మెంట్‌ వంటి ఏప్రిల్‌నాటికి పూర్తిగా చెల్లించాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో డిఏలన్నీ జనవరి జీతంలో కలిపి ఇవ్వాలని నిర్ణయించారు. కొత్త పేస్కేల్స్‌ను, రెగ్యులర్‌ ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో వారికి కూడా 2022 జనవరి ఒకటోతేదీ నుండే అమలు చేయాలని సూచించారు. మానిటరీ బెనిఫిట్స్‌ 2020 ఏప్రిల్‌ నుండే ఇవ్వాలని నిర్ణయించారు. ఇకముందు కేంద్రం అమలు చేస్తున్న సెంట్రల్‌ పే రివిజన్‌ కమిషన్‌ ప్రతిపాదనలనే యథాతధంగా అమలు చేయాలని సిఎం ఆదేశించారు. సిపిఎస్‌కు సంబంధించి టైంలైన్‌ ఎట్టుకోవాలని, ఇప్పటికే క్యాబినెట్‌ సబ్‌ కమిటీ వేశామని, జూన్‌ 30లోగా మంచి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, సిఎస్‌ సమీర్‌శర్మ తదితరులు పాల్గన్నారు.
ఫిట్‌మెంట్‌పై పునరాలోచన చేయాలి : యుటిఎఫ్‌
నిర్ణీత కాలవ్యవధిలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ పిఆర్‌సి ఫిట్‌మెంట్‌పై ముఖ్యమంత్రి ప్రకటన రాష్ట్రంలో 13 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు నిరాశను మిగిల్చిందని యుటిఎఫ్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్‌.వెంకటేశ్వర్లు, కె.ఎస్‌.ఎస్‌.ప్రసాదు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. అందరి ఆకాంక్షలు అనుగుణంగా 27 శాతం ఫిట్‌మెంట్‌ అమలు చేయాలని కోరారు. ఇంటి అద్దె అలవెన్సులు ప్రస్తుత రేట్ల ప్రకారం యథాతథంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అధికారంలోకి రాగానే 27 శాతం ఇంటీరియమ్‌ రిలీఫ్‌ ప్రకటించి అమలు చేసిన ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పేరుతో 23 శాతానికి ఫిట్‌మెంట్‌ మాత్రమే ప్రకటించడం, ఇంటిఅద్దె అలవెన్సుపై స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం కలిగించేదిగా ఉందని పేర్కొన్నారు. 23 శాతం ఫిట్‌మెంట్‌ వల్ల వేతనాల్లో ఒక స్టేజ్‌ కోల్పోవడమే కాక ఇంటి అద్దె అలవెన్సులు పే కమిషన్‌ ప్రకారం అమలు చేస్తే ఉద్యోగులు నష్టపోతారని పేర్కొన్నారు. సిఎం ప్రకటించిన ఇతర అంశాలపై యుటిఎఫ్‌ పక్షాన హర్షం వ్యక్తం చేశారు.

ఏపీలో ఉద్యోగులకు తగ్గనున్న జీతాలు.

అమరావతి: ఏపీలో ఉద్యోగులకు జీతాలు తగ్గనున్నాయి. ఐఆర్‌ 27 శాతం, ఫిట్‌మెంట్‌ 23 శాతం ఉండడంతో 4 శాతం జీతాలు తగ్గనున్నాయి. తగ్గిన ఫిట్‌మెంట్‌ ప్రభావంతో డీఏలు.. హెచ్‌ఆర్‌ఏల్లో కూడా కోత పడుతుందని ఉద్యోగుల ఆందోళన చెందుతున్నారు. అయితే ఫిట్‌మెంట్‌ను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచడం వల్ల ప్రభుత్వానికి డబ్బు మిగులుతుందే తప్ప తమకు ప్రయోజనం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఫిట్‌మెంట్‌తో పాటు రిటైర్మెంట్‌ వయసు పెంపును ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు భానుమూర్తి, ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్‌ వ్యతిరేకించారు. ప్రభుత్వం మెరుగైన ప్రతిపాదనలతో ముందుకురాకపోతే కార్యాచరణ రూపొందిస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఫిట్‌మెంట్‌ విషయంలో ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం నిరాశ మిగిల్చింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు ద్వజమెత్తుతున్నారు. పీఆర్‌సీలో ఫిట్‌మెంట్‌ 23 శాతంగానే  ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 27 శాతం ఐఆర్‌ తీసుకుంటున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. చరిత్రలో తొలిసారిగా ఏపీ ఉద్యోగులు ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్‌మెంట్‌‌ తీసుకోనున్నారు. అయితే 2020 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆర్ధిక ప్రయోజనాలు కల్పిస్తామని ప్రభుత్వం మెలికపెట్టింది

NEW PRC BASIC PAYS DIFFERENCE CLICK HERE

error: Don\'t Copy!!!!