Pensioners – Life Certificate -Submission Process

Digital Life Certificate | పెన్షనర్లు నిరంతరం పెన్షన్ పొందేందుకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. జీవన్ ప్రమాణ పత్రను (Jeevan Praman Patra) ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు.

భారత ప్రభుత్వం పెన్షనర్లకోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (Digital Life Certificate) విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీన్ని జీవన్ ప్రమాణ్ పత్ర లేదా జీవన ప్రమాణ పత్రంగా (Jeevan Praman Patra) కూడా పేర్కొంటారు. పెన్షనర్లు ఎలాంటి అవాంతరాలు లేకుండా పెన్షన్‌ అందుకోవాలంటే సమయానికి లైఫ్‌ సర్టిఫికేట్‌ అందజేయాలి. నెలవారీ పెన్షన్‌ అందుకోవడానికి బ్యాంకు, పోస్టాఫీసులేదా పెన్షన్‌ డిస్‌బర్సింగ్‌ అథారిటీలకు(PDA) లైప్‌ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. అయితే ఇప్పుడు పెన్షనర్లు ఆఫీస్‌లకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్‌ చేయవచ్చు. దీన్ని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

పెన్షనర్లు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, సెక్యూర్‌ ఆధార్ బేస్డ్‌ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ సిస్టమ్‌ ఉపయోగించి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను జనరేట్‌ చేయవచ్చు. CSCలు, బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీస్‌లు నిర్వహించే జీవన్ ప్రమాణ్ కేంద్రాల ద్వారా లేదా ఏదైనా PC/మొబైల్/టాబ్లెట్‌లో క్లయింట్ అప్లికేషన్‌తో డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ను పొందవచ్చు. జనరేట్‌ అయిన డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్(DLC) ఆన్‌లైన్‌లో స్టోర్‌ అవుతుంది.

డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ కోసం పెన్షనర్ స్వయంగా పెన్షన్ డిస్‌బర్సింగ్‌ అధికారి ముందు హాజరు కానవసరం లేదు. నేరుగా వెళ్లి పెన్షన్ పంపిణీ ఏజెన్సీకి (బ్యాంక్/పోస్ట్ ఆఫీస్ మొదలైనవి) సమర్పించాల్సిన అవసరం లేదు. వారికి ఇది డిజిటల్‌గా అందుబాటులో ఉంటుంది. పెన్షన్ డిస్‌బర్సింగ్‌ ఏజెన్సీ ద్వారా ఆటోమేటిక్‌గా ప్రాసెస్ అవుతుంది. ప్రతి డిజిటల్‌ సర్టిపికేట్‌కు ప్రమాణ్ ఐడీ ప్రత్యేకంగా ఉంటుంది.

పెన్షనర్లు – లైఫ్ సర్టిఫికెట్ -సబ్మిషన్ ప్రాసెస్- PDF

ఇలా పొందండి

డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ కోసం జీవన్ ప్రమాణ్ యాప్‌ను డివైజ్‌లో డౌన్‌లోడ్ చేసుకొని, డాక్యుమెంట్ కోసం నమోదు చేసుకోవచ్చు. లేదా జీవన్ ప్రమాణ్ సెంటర్‌ని సందర్శించి రిజిస్టర్ చేసుకోవచ్చు. అక్కడ ఆధార్ నంబర్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ పేరు, మొబైల్ నంబర్ వంటి అవసరమైన సమాచారాన్ని అందించమని కోరుతారు. ఆధార్ అథెంటికేషన్‌ కూడా తప్పనిసరి. అందుకు ఫింగర్‌ప్రింట్‌ లేదా ఐరిస్ స్కాన్ అయిన బయోమెట్రిక్‌లను అందించమని అడుగుతారు. జీవన్ ప్రమాణ్ ఆన్‌లైన్ బయోమెట్రిక్ అథెంటికేషన్‌ కోసం ఆధార్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగిస్తుంది.

అథెంటికేషన్‌ పూర్తయిన తర్వాత.. జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ ID మొబైల్ నంబర్‌కు SMS వస్తుంది. ఈ సర్టిఫికేట్ IDలు పెన్షనర్, పెన్షన్ డిస్బర్సింగ్ ఏజెన్సీ కోసం లైఫ్ సర్టిఫికేట్ రిపోజిటరీలో స్టోర్‌ అవుతాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా వీటిని యాక్సెస్‌ చేసుకోవచ్చు. జీవన్ ప్రమాణ్ అధికారిక వెబ్‌సైట్ నుంచి సర్టిఫికేట్ PDF కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకు జీవన్ ప్రమాణ్ IDని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పెన్షన్ పంపిణీ చేసే ఏజెన్సీ జీవన్ ప్రమాణ్ వెబ్‌సైట్ నుంచి కూడా లైఫ్ సర్టిఫికేట్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు.

JEEVAN PRAMAN OFFICIAL WEBSITE CLICK HERE

error: Don\'t Copy!!!!