online-training-on-CBSE-pattern-22-06-2021-live-class-link

Continuous Professional Development of Primary Teachers*

సీమ్యాచ్‌ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు..

                ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిలో భాగంగా ‘స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌’ (సీమ్యాట్‌) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఉన్న దాదాపు 90 వేల మంది టీచర్లను ఈ శిక్షణలో భాగస్వాములను చేస్తున్నారు.

ప్రాథమిక పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్‌ఈ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో ఆంగ్ల మాధ్యమంలోనూ బోధన చేసేలా ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇస్తారు. తద్వారా విద్యార్థులకు ఉత్తమ పరిజ్ఞానం అందించి వారి సామర్థ్యాలను మరింత మెరుగుపర్చాలని సర్కారు నిర్ణయించింది.

1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్‌ఈ బోధనా విధానం (టీచింగ్‌ మెథడాలజీ), మూల్యాంకన పద్ధతులపై తర్ఫీదు ఇస్తారు.

కరోనా నేపథ్యంలో దీక్షా డిజిటల్‌ వేదిక ద్వారా ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. సోమవారం నుంచి జూలై 3వ తేదీ వరకు కొనసాగే శిక్షణ కార్యక్రమంపై ఉపాధ్యాయులకు సూచనలు జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోలకు, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.*

శిక్షణ ముఖ్యోద్దేశాలివీ..

                 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల కోసం 1–6వ తరగతి వరకు పుస్తకాలను ఆంగ్ల, తెలుగు మాధ్యమాల్లో ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసింది. నూతన పాఠ్య పుస్తకాల నేపథ్య పరిజ్ఞానం, కార్యాచరణ ఆధారిత, ప్రయోగాత్మక అభ్యసనాలతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలను లక్ష్యాలను సాధించేలా సీబీఎస్‌ఈ విధానంలో బోధన చేసేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దనున్నారు.

అభ్యసన ఫలితాలు సాధించడంపై  కంటెంట్‌ అనాలసిస్‌తోపాటు సృజనాత్మక రీతుల్లో బోధనాభ్యసన విధానాలను అనుసరించేలా తర్ఫీదునిస్తారు.

మూల్యాంకన విధానాలు, సాధనాలు, మూల్యాంకన ప్రాసెస్‌లపై శిక్షణ ఇస్తారు. సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అందుకు అనుగుణమైన సామర్థ్యాలతో విద్యార్థులకు బోధన చేసేలా శిక్షణ ఇస్తారు.

తెలుగు మాధ్యమంలో బోధన చేస్తున్న ఉపాధ్యాయులకు సీబీఎస్‌ఈ విధానంలో ఆంగ్ల మాధ్యమ బోధనా పద్ధతులపై శిక్షణ ఇస్తారు.*

*Orientation on CBSE model of Teaching Methodology*

*Assessment Procedures to all Primary School Teachers I to V class* 

*Online Training from 21st June to 3rd July, 2021*  

*through DIKSHA platform* 

*Every day Live session from 3pm to 4.30pm*

online training on CBSE pattern*

*DAY 2 : 22-06-2021 (TUESDAY)

*Topic: Teaching Learning Process and Innovative Strategies*

*Time: 3.00 P.M to 4.00 P.M*

*YOUTUBE LIVE LINK*

https://youtu.be/ffixj7tdduM

*DIKSHA LIVE LINK*

https://diksha.gov.in/play/content/do_313306156377735168175?referrer=utm_source%3Dmobile%26utm_campaign%3Dshare_content

error: Don\'t Copy!!!!