new-rules-from-November-1st-2021-details

New Rules From November 1: గ్యాస్ ధరల నుంచి బ్యాంకు సేవల వరకు.. వచ్చే నెలలో రానున్న మర్పులివే.. తెలుసుకోండి.

 ఈ నెలలో గ్యాస్ ధరలతో(Gas Price) పాటు బ్యాంకులు(Banks), వాట్సాప్ సేవలు (Whatsapp) తదితర అనేక అంశాల్లో మార్పులు రానున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్త ఛార్జీలు

బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేయడానికి , విత్‌డ్రా చేయడానికి కొత్త ఛార్జీలను ప్రవేశపెట్టబోతోంది. వాస్తవానికి, నిర్ణీత పరిమితి పరిమితి కంటే ఎక్కువ బ్యాంకింగ్ సేవను ఉపయోగించినందుకు మీరు రుసుము చెల్లించాలి. ఉదాహరణకు, రుణ ఖాతాకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాదారుడు నాలుగోసారి డబ్బులు డిపాజిట్ చేస్తే రూ.40 చార్జీ విధిస్తారు. మీ జన్ ధన్ ఈ బ్యాంకులో ఉంటే, డబ్బు డిపాజిట్ చేయడానికి ఎటువంటి ఛార్జీ ఉండదు. కానీ ఉపసంహరణపై 100 రూపాయలు చెల్లించాలి.

రైలు సమయ పట్టిక

భారతీయ రైల్వేలు దేశంలోని రైళ్ల టైమ్ టేబుల్‌ని మార్చబోతున్నాయి. కొత్త టైమ్ టేబుల్ అక్టోబర్ 1 నుంచి అమలు కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఇప్పుడు 13 వేల ప్యాసింజర్ రైళ్లు, 7 వేల గూడ్స్ రైళ్ల వేళలు మారబోతున్నాయి. నవంబర్ మొదటి తేదీ నుంచి దాదాపు 30 రాజధాని రైళ్ల వేళలు కూడా మారనున్నాయి.

గ్యాస్ సిలిండర్ ధర: సాధారణంగా ప్రతీ నెల 1వ తేదీన గ్యాస్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ ధరలను సవరిస్తూ ఉంటాయి. ఈ నెల 1వ తేదీన సైతం గ్యాస్ ధరలు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి

SBI శుభవార్త: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎప్పటికప్పుడు కొత్త కొత్త సదుపాయాలను ప్రారంభిస్తూ ఖాతాదారులకు సేవలను సులభం చేస్తుంది. తాజాగా పెన్షనర్లకు SBI శుభవార్త చెప్పింది

పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్ ను ఇంట్లో నుంచే వీడియో కాల్ ద్వారా సమర్పించే అవకాశాన్ని కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. నవంబర్ 1 నుంచి ఈ కొత్త సదుపాయం పింఛన్ దారులకు అందుబాటులోకి రానుంది

ఆ ఫోన్లలో వాట్సాప్(Whatsapp) బంద్: నవంబర్ 1వ తేదీ నుంచి పలు ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. ఈ విషయాన్ని ఆయా ఫోన్లను వాడే వారు గమనించాల్సి ఉంటుంది. వచ్చే నెల నుంచి వాట్సాప్ పని చేయని ఫోన్ల జాబితాలో LG, Samsung, ZTE, Huawei తదితర మోడళ్లకు చెందిన స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి

ఈ నెల నుంచే జియో ఫోన్ల అమ్మకాలు: టెలికాం దిగ్గజం జియో అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్ జియోఫోన్ నెక్స్‌ట్‌ను (JioPhone Next) నిన్న విడుదల చేసింది. దివాళీ అంటే నవంబర్ 4 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనొచ్చు. ఈ ఫోన్ ఎంట్రీ ధర రూ.1,999 మాత్రమే కావడం విశేషం. మిగతా మొత్తాన్ని 18 నెలలు లేదా 24 నెలల ఈఎంఐ ద్వారా చెల్లించొచ్చు. ఈఎంఐ ఆప్షన్ వద్దనుకుంటే రూ.6,499 చెల్లించి ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు.

error: Don\'t Copy!!!!