NABARD-recruitment-2021-jobs-162-notification-online-application

NABARD Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.. నాబార్డ్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డవలప్మెంట్ – నాబార్డ్ (NABARD) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డవలప్మెంట్ – నాబార్డ్(NABARD) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 162 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది సంస్థ. అసిస్టెంట్ మేనేజర్, మేనేజర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 17న ప్రారంభం కానున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. దరఖాస్తులకు ఆఖరి తేదీగా ఆగస్టు 7ను నిర్ణయించారు.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అధికారిక వెబ్ సైట్ nabard.org లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు నియామక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహించనున్నారు. అందులో మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ కాగా.. రెండవది మెయిన్స్, చివరిగా ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఖాళీల వివరాలు..

అసిస్టెంట్ మేనేజర్ (రూరల్ డవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్): 148
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(రాజ్ భాష సర్వీస్): 5
అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ(ప్రొటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీస్): 2
మేనేజర్ ఇన్ గ్రేడ్ బీ(రూరల్ డవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్): 7

అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులకు 55 శాతం మార్కులను అర్హతగా నిర్ణయించారు.

లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో పీజీ చేసిన అభ్యర్థులు సైతం ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/PWD అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.

మేనేజర్ గ్రేడ్ బి: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి బ్యాచలర్ డిగ్రీ ని 60 శాతం మార్కులతో పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ/PWD అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.

లేదా 55 శాతం మార్కులు(ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో పీజీ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

Recruitment To The Post Of Manager In Grade ‘B’ (RDBS) – 2021

Recruitment To The Post Of Officers In Grade ‘A’ Assistant Manager (Protocol And Security Service) -2021

Recruitment To The Post Of Assistant Manager In Grade ‘A’ (RDBS)/ (Rajbhasha Service) -2021

NABARD ONLINE APPLICATION & NOTIFICATION

error: Don\'t Copy!!!!