Mahatma Jyotiba Phule AP Backward Classes Welfare Residential-schools-5th-class-admissions

మహాత్మ జ్యోతిబా ఫూలే  ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థ(రి)

2021-22 విద్యా సంవత్సరమునకు 5 వ తరగతి ప్రవేశ ప్రకటన 

మహాత్మ జ్యోతిబా ఫూలే  ఆంధ్ర ప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయముల సంస్థచే  నడుప బడుచున్న 92 పాటశాలల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 5 వ తరగతి (ఇంగ్లిష్ మీడియం)లో విద్యార్థులను లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాటశాలల కేటాయింపు జరుగును .

Schools and Junior Colleges

At present, 93 BC Residential institutions are functioning in the State of Andhra Pradesh, of which 43 are meant for Boys and 50 for Girls.

14 Residential Junior Colleges (07 for Boys and 07 for Girls) are also functioning in the State.

The total sanctioned strength for the year 2019-20 is 34121 (Boys-18411 Girls- 15710) in the BC Residential institutions.

Out of 93 schools, 10 Institutions located at Amalapuram (East Godavari), Mopidevi (Krishna), Satyavedu (Chittoor), Golagamudi (SPSR Nellore), Akkupally (Srikakulam),Nellimarla-Boys (Vizianagaram), Annavaram (Visakhapatnam), Vemuladeevi (West Godavari), Nakshthra nagar (Guntur), and Singarayakonda (Prakasam) are meant for the children belonging to Fishermen Community.

ప్రవేశానికి అర్హత :

1. వయస్సు : బి .సి . మరియు ఈ .బి.సి . (BC /EBC) లకు చెందిన వారు 01-09-2010 నుండి 31-08-2012 మధ్య పుట్టి వుండాలి.  యస్.సి. మరియు యస్.టి. (ఎస్‌సి/ఎస్‌టి) లకు చెందిన వారు 01-09-2008 నుండి 31-08-2012 మధ్య పుట్టి వుండాలి.  2. సంబందిత జిల్లాలో 2019-20 & 2020-21 విద్యా సంవత్సరములలో నిరవదికముగా ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాటశాలలో 3 మరియు 4 తరగతులు చదివి వుండాలి. 

3. ఆదాయ పరిమితి అభ్యర్థి యొక్క తల్లి , తండ్రి/సంరక్షకుల సంవత్సర ఆదాయము  2020-21 ఆర్థిక సంవత్సరమునకు రూ.1,00,000/-లు మించి ఉండరాదు. 

4. దరఖాస్తు: దరఖాస్తు చేయడానికి ముందుగా పూర్తి వివరాలతో కూడిన సమాచార పత్రం కొరకు http://www.mjpapbcwr.in ను చూడగలరు. 

5. దరఖాస్తు చేయు విధానం :

అభ్యర్థులు పై అర్హతలు పరిశీలించుకొని సంతృప్తి చెందిన తరువాత ఆన్ లైన్ లో తేదీ 14-06-2021 నుండీ తేదీ 30-06-2021 లోగా దరఖాస్తు చేసుకోవాలి.  దరఖాస్తు చేయు విధానములో సందేహమున్నచో పాఠశాల కార్యాలయ పని వేళలు ఉదయం 10.00 గం.ల నుండీ సాయంత్రం 4.30 గం.ల లోపు క్రింద పేర్కొన్న పాఠశాలల ప్రిన్సిపాల్ వార్ల నెంబర్ లకు సంప్రదించగలరు.

పాఠశాలలో ప్రవేశానికి ఎంపిక విధానం:

1. రిజర్వేషన్( రిజర్వేషన్ల వివరాలు పట్టిక(1) నందు ఇవ్వబడినది)

2. స్థానికత

3. ప్రతేక కేటగిరి(అనాధ/మత్స్యకారుల పిల్లలు) మరియు

4. అభ్యర్ధి  కోరిన పాఠశాల ఆధారంగా ఎంపిక జరుగును

5. జిల్లాలవారిగా పాఠశాలల  వివరాలు, జిల్లాలు పట్టిక మరియు పాఠశాల వారీగా కేటాయించిన సీట్లు పట్టిక (2) నందు ఇవ్వబడినది

6. ప్రవేశములు లాటరీ పద్దతి  ద్వారా చేయబడును.

విద్యార్థులకు అందించే సదుపాయములు, ఉచిత వసతి మరియు గురుకుల విధానంలో  చదువుకునే అవకాశం.

నెలకు రూ. 1250/- ల తో  పౌష్టిక విలువలతో కూడిన మెనూ

3 జతల యూనిఫామ్ దుస్తులు

దుప్పటి మరియూ జంపుకానా

బూట్లు, సాక్స్

టై మరియు బెల్ట్

నోట్ పుస్తకములు 

టెక్స్ట్ పుస్తకములు

ప్లేట్ , గ్లాస్, కటోర

కాస్మోటిక్ చార్జీల నిమిత్తం బాలురకు 100 రూ.లు చొప్పున (v, vi), VII నుండి ఇంటర్మీడియట్ వరకు బాలురకు 125/-రూ.ల బాలికలకు 6, 7 వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు నెలకు 110/- రూ.ల చొప్పున మరియు 8 వ తరగతి  ఆ పై తరగతుల పిల్లలకు నెలకు 160/- రూ.ల చొప్పున చెల్లించడం జరుగుచున్నది  మరియు బాలురకు నెలకు రూ. 30/-లు చొప్పున సెలూన్ నిమిత్తం ఖర్చు చేయడం జరుగుచున్నది.

5 వ తరగతిలో ప్రవేశం పొందిన విద్యార్థి ఇంటర్మీడియట్ వరకు గురుకుల పాఠశాలలోనే విద్య నభ్యసించ వచ్చును .

సమీకృత పౌష్టిక ఆహారం క్రింద రోజూ వేరుశనగ చిక్కి, వారానికి ఆరు దినములు గ్రుడ్డు, రెండు సార్లు చికెన్ ఇవ్వబడును. 

ఉల్లాసభరితమైన, ఆహ్లాదకరమైన వాతావరణములో విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయబడుతుంది.  క్రీడలతో పాటు బోధనేతర కార్యక్రమాలలో  కూడా శిక్షణ ఉంటుంది.  గ్రంధాలయాలు, ప్రయోగశాలలు, డిజిటల్ తరగతులతో విద్యాబోధన జరుగుతుంది. 

దరఖాస్తులను ఆన్ లైన్ లో http://apgpcet.apcfss.in/MJPAPBCWR/ వెబ్ సైట్ లో ఏదైనా  ఇంటర్నెట్ సెంటర్ నుండి దరఖాస్తు చేసుకొనగలరు.

ONLINE APPLICATION FOR CLICK HERE

error: Don\'t Copy!!!!