Home » KOUSHAL-Science talent test-2021-22-registration-link-complete-details

KOUSHAL-Science talent test-2021-22-registration-link-complete-details

కౌశల్ ప్రతిభాన్వేషణ పరీక్ష   2 0 2 1

కౌశల్ ప్రతిభాన్వేషణ పరీక్ష   విధివిధానాలు :

1. ఈ పోటీలలో భాగంగా జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో  సైన్సు క్విజ్  మరియు పోస్టర్ ప్రేజెంటేషణ్ పోటీలు నిర్వహించబడును.

2. క్విజ్ టీం ఎంపిక కోసం స్కూల్ స్థాయి లో 8,9 మరియు 10 వ తరగతి విద్యార్థులకు ONLINE లో ప్రాధమిక పరీక్ష జరుపబడును. క్విజ్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న స్కూల్స్ అన్నీ తమ తమ స్కూల్స్ నుండి ప్రతి తరగతి నుండి అనగా 8,9 మరియు 10 వ తరగతి ల నుండి కనీసం ఒకరు నుండి గరిష్టం గా 10 మంది వరకు ఈ ప్రాధమిక పరీక్ష వ్రాయవచ్చును. 

3. ఆన్లైన్ పరీక్ష మొబైల్ ద్వారా కానీ, ట్యాబ్ ద్వారా కానీ ల్యాప్టాప్ ద్వారా కానీ డెస్క్టాప్ ద్వారా కానీ వ్రాయవచ్చు. తరగతిలో టాపర్ గా నిలిచిన విద్యార్థి పాఠశాల క్విజ్ టీం సభ్యుడు గా ఎంపిక చేయబడును..ఈ మూడు తరగతుల విద్యార్థుల మార్కులు కలిపి పాఠశాల మార్కు నిర్ణయించబడును.

4. ఈ పరీక్ష తరగతి వారిగా నిర్వహించబడును. 8,9,మరియు 10 తరగతి వారికి వేరు వేరు ప్రశ్నా పత్రం ఉంటుంది. పరీక్ష సమయం కూడా వేరు వేరు గా ఉంటుంది.

5. 8 వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుండి 10.30 వరకు , 9 వ తరగతి విద్యార్థులకు ఉదయం 11.30 నుండి 12.30 వరకు మరియు  10  వ తరగతి విద్యార్థులకు మద్యాహ్నం 2 నుండి 3pm వరకు  online పరీక్ష నిర్వహించబడును. ఈ ప్రాథమిక పరీక్ష ఆన్ లైన్ లో డిసెంబర్ 8వ తేదీన నిర్వహించబడును.

6. ఆయా తరగతుల గణితం నుండి 15 మార్కులకు, సైన్సు నుండి 15 మార్కులకు మరియు విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అనే అంశం నుండి 10 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 40 మార్కులు. సమయం ఒక గంట.

7. ప్రతీ స్కూల్ నుండి ఆయా తరగతిలో అత్యధిక మార్కులు పొందిన అనగా 8 లో అత్యధిక మార్కులు, 9 లో అత్యధిక మార్కులు, 10 లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థుల మొత్తం మార్కులను స్కూల్ మార్క్ గా పరిగణించబడుతుంది. ఆవిధం గా జిల్లాలో మొదటి 36 స్థానాలలో ఉన్న స్కూల్స్ ని జిల్లా స్థాయి OFF LINE క్విజ్ కి అర్హత పొందుతారు.

8. స్కూల్ స్థాయి లో జరిగే పరీక్ష కి LOGIN వివరాలు మీకు తెలియ చేయ బడతాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి (ఆప్కాస్ట్‌).. భారతీయ విజ్ఞాన మండలి సంయుక్తంగా ప్రతిభాన్వేషణ పోటీలు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో 8 నుంచి 10 తరగతులు చదివే విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులు.

పోటీలు ఎప్పుడు :

 ప్రాథమిక స్థాయి పరీక్ష ఆన్‌లైన్‌లో డిసెంబరు ఎనిమిదో తేదీన, జిల్లా స్థాయి పోటీలు అదే నెల 29న, రాష్ట్రస్థాయి పరీక్ష 2022 జనవరి 22న నిర్వహిస్తారు.

బహుమతులు : 

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విజేతలకు రూ.5 వేలు నగదు, ద్వితీయ స్థానానికి రూ.3 వేలు, తృతీయ స్థానంలో నిలిస్తే రూ.2 వేలు నగదు బహుమతిగా అందజేస్తారు. జిల్లా స్థాయి విజేతలకు వరుసగా రూ.3 వేలు, రూ.2 వేలు, రూ.వెయ్యి అందజేస్తారు. జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రతిభావంతులకు జ్ఞాపిక, ధ్రువపత్రం అందజేస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల విజేతలకు గవర్నర్‌ చేతుల మీదుగా బహుమతులు అందిస్తారు.

పోటీల తీరు : 

ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహిస్తారు. క్విజ్‌.. పోస్టర్‌ ప్రజంటేషన్‌ పోటీలు ఉంటాయి.

అర్హత:

 క్విజ్‌ పోటీలకు టీం ఎంపిక కోసం 8 నుంచి 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు.

పాఠశాల స్థాయిలో బృందంగా ఏర్పడిన విద్యార్థులు అక్కడ ప్రతిభ సాధిస్తే జిల్లా స్థాయికి పంపిస్తారు.

అత్యధిక మార్కుల ప్రాతిపదికన జిల్లా స్థాయిలో గరిష్ఠంగా 36 బృందాలు ఎంపిక చేస్తారు. ‘విజ్ఞానశాస్త్రంలో భారతీయుల కృషి’ అనే అంశంపై క్విజ్‌ పోటీలు ఉంటాయి.

పోస్టర్‌ ప్రజంటేషన్‌ : 

8, 9 తరగతుల విద్యార్థులకే ఈ పోటీ ఉంటుంది. ఒక పాఠశాల నుంచి ఇద్దరికే అవకాశం. 

1.జీవవైవిధ్య సంరక్షణ 

2.జల సంరక్షణ 

3.వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ అంశాలపై పేపర్‌ ప్రజంటేషన్‌ ఇవ్వాలి. క్విజ్‌ టీం, పోస్టర్‌ ప్రజంటేషన్‌ పోటీల్లో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల విద్యార్థులకే పాల్గొనే అవకాశం ఉంది.

రిజిస్ట్రేషన్‌ ఇలా.. 

విద్యార్థులు వ్యక్తిగతంగా.. పాఠశాల నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. నవంబరు 15వ తేదీ దీనికి తుది గడువుగా ఉంది.

వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి (Registration Closes on Nov-15-2021)

METHODOLOGY AND RULES FOR THE KOUSHAL PROGRAM

Level 1: Preliminary Exam (Online)

  • A written test using online devices will be conducted for students of classes 8th, 9th & 10th. The written test will be an open book exam with multiple choice questions on Mathematics, Science & Indian Contributions to science from their respective class (AP State Syllabus) for 120 Marks and Time will be 60 minutes.

  • Top three from each class from each school will get e-Certificate.

  • A three member Team for each school will be selected with Topper from each class ( 8th,9th & 10th ).

Level 2: District Level Competition.

  • Top 12/24/36 Teams in District will be allowed to participate in District Level Competition. The eligibility for District Level will be decided depending on total number of registrations in that particular District.

  • Quiz Competition Cash Awards: 1st : 6000/-, 2nd : 4500/-, 3rd : 3000/-, Consolation: 1500/-

  • Poster Competition Cash Awards: 1st: 2000/-, 2nd: 1500/-, 3rd: 1000/-, Consolation awards : 500/-

Level 3: State Level Competition

  • Top Two teams selected in District level from each District shall be allowed for the State Level Koushal Competition.

  • Quiz Competition will be conducted in two rounds: Preliminary Round and Final Round.

  • Preliminary Round of Quiz will be conducted for teams of all districts.

  • Final Quiz will be conducted for the top six teams selected from preliminary Round.

  • Poster Competition will be conducted for Top three students of each district.

  • Top Three Teams in Quiz and Top three Students in Poster Competition will get Cash Awards.

  • Quiz Competition Cash Awards: 1st: 12000/- 2nd: 9000/- 3rd: 6000/-, Three consolation awards: 3000 each.

  • Poster Competition Cash Awards: 1st: 3000/- 2nd: 2000/- 3rd: 1500/-, Consolation awards : 500/-

  • All the participants should follow the competition rules at the venue. Quiz will be conducted using Digital Projectors. The decision of the quiz-master will be final and will not be subjected to any change.

SYLLUBUS for QUIZ

  • KOUSHAL questionnaire will be from AP State Board syllabus, and 80% of the questions will be from Mathematics, Physical Science and Biological Science syllabus (upto October) of 8th, 9th and 10th Standard. Remaining 20 % of the questions will be on “Indian Contributions to Science.”.

THEMES FOR POSTER PRESENTATION

  • Water Conservation

  • Indian Contributions to Science

  • Organic Farming

  • Biodiversity

  • Traditional Health protection meausers

  • Climate Change & Environmental Protection

KOUSHAL ONLINE REGISTRATION LINK

Koushal Rules & Downloads

KOUSHAL ONLINE REGISTRATION LINK

TELUGU

ENGLISH

error: Don\'t Copy!!!!