Jobs in TCS-for-degree-candidates-2022

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) వేర్వేరు ప్రోగ్రామ్స్ ద్వారా ఖాళీలను భర్తీ చేస్తోంది. బీఏ, బీకామ్ లాంటి డిగ్రీలు పాసైనవారికి కూడా టీసీఎస్‌లో ఉద్యోగాలు ఉన్నాయి. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగాల భర్తీకి వేర్వేరు డ్రైవ్స్ నిర్వహిస్తోంది. ఇప్పటికే స్మార్ట్ హైరింగ్ 2022, ఎంబీఏ హైరింగ్ 2022, ఆఫ్ క్యాంపస్ డిజిటల్ హైరింగ్ 2022, అట్లాస్ హైరింగ్ 2022 పేరుతో పలు రకాల డ్రైవ్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. టీసీఎస్‌లో ఉద్యోగాలు పొందాలంటే బీటెక్, ఎంటెక్, ఎంబీఏ లాంటి కోర్సులు చదవాలని అనుకుంటారు నిరుద్యోగులు

TCS BPS Hiring 2022 – Overview

Recruitment Firm Name Tata Consultancy Services (TCS)
Recruitment Drive  TCS BPS Hiring 2022
Eligible Candidates’ Qualification B.Com, BA, BAF, BBI, BBA, BBM, BMS, BSc-IT/CS/General, BCA, BCS, B.Pharm, and M.Pharm
Last Date To Register To Be Announced | Registration are Open
Required Years Of Passing for Candidates 2020, 2021, or 2022 
Service Sector  Business Process Services (BPS)
Selection Criteria  Test & Interview
Test Duration 65 minutes
Work Experience  Candidates with work experience of up to 3 months are eligible to apply 
Minimum & Maximum Age Minimum age – 18 years 

Maximum age – 28 years

Official Website https://www.tcs.com/ 

ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు కూడా టీసీఎస్‌లో ఉద్యోగాల కోసం అప్లై చేయొచ్చు. ఇందుకోసం టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ (TCS BPS Hiring) కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. టెక్ కోర్సులు కాకుండా ఆర్ట్స్, కామర్స్, సైన్స్ కోర్సులు చదివినవారిని టీసీఎస్ కాగ్నిటీవ్ బిజినెస్ ఆపరేషన్స్ (CBO), బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్స్యూరెన్స్ (BFSI), లైఫ్ సైన్సెస్ విభాగాల్లో నియమిస్తోంది టీసీఎస్

టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ప్రోగ్రామ్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. చివరి తేదీ, పరీక్ష తేదీ, ఇంటర్వ్యూ తేదీలను వెల్లడించలేదు టీసీఎస్. 2020, 2021, 2022 సంవత్సరాల్లో ఆర్ట్స్, కామర్స్, సైన్స్ గ్రాడ్యుయేషన్ పాసైనవారు టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అప్లై చేయొచ్చు. ఫుల్ టైమ్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ కోర్సులు పూర్తి చేసినవారు మాత్రమే అప్లై చేయాలి

బీకామ్, బీఏ, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఎస్సీ ఐటీ, సీఎస్, జనరల్, బీసీఏ, బీసీఎస్, బీఫార్మసీ, ఎంఫార్మసీ కోర్సులు చదివినవారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు https://www.tcs.com/careers/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ప్రోగ్రామ్‌కు అప్లై చేయడానికి https://www.tcs.com/careers/tcs-bps-hiring లింక్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో వివరాలన్నీ చదివిన తర్వాత TCS Next Step Portal లింక్ పైన క్లిక్ చేయాలి. హోమ్ పేజీలో Register Now పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత BPS పైన క్లిక్ చేయాలి

పేరు, పుట్టిన తేదీ, జెండర్, ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, విద్యార్హతలతో రిజిస్ట్రేషన్ చేయాలి. వివరాలు సరిచూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ స్టేటస్‌లో Application Received అని ఉండాలి. Application Received అని స్టేటస్ ఉంటే రెండో స్టెప్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి

ఇందుకోసం CT/DT ఐడీతో రెండో స్టెప్ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. https://www.tcs.com/careers/tcs-bps-hiring వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత Apple Here with CT/DT ID పైన క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి

error: Don\'t Copy!!!!