jobs-in-Medha Servo Drives Pvt.Ltd-interviews-srikakulam-22.11.2021

AP Job Mela: ఏపీలో డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. ఏడాదికి రూ.2.47 లక్షల వేతనం.. రేపే ఇంటర్వ్యూలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపింది. రేపు Medha Servo Drives Pvt.Ltd సంస్థలో ఉద్యోగాల కోసం జాబ్ మేళా(Job Mela)ను నిర్వహించనున్నట్లు తెలిపింది. వివరాలు ఇలా ఉన్నాయి.

 (APSSDC) నుంచి ఇటీవల జాబ్ మేళా (Job Mela)లకు సంబంధించి వరుస ప్రకటనలు (Job Notification) విడుదలవుతున్న విషయం తెలిసిందే. తాజాగా సంస్థ నుంచి మరో ప్రకటన విడుదలైంది. Medha Servo Drives Pvt.Ltd సంస్థలో ఖాళీల భర్తీకి ఈ జాబ్ మేళా (Job Mela) ను నిర్వహిస్తున్నారు. మొత్తం 20 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ (Online Registration) చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఈ నెల 22న శ్రీకాకుళం (Srikakulam)లో నిర్వహించనున్న ఇటర్వ్యూ (Interviews)లకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ (Hyderabad) లో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
ఈ జాబ్ మేళా ద్వారా Medha Servo Drives Pvt.Ltd సంస్థలో 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు సిగ్నలింగ్ అసిస్టెంట్ ట్రైనీగా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. బీఎస్సీ(Computers and Electronics) విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు 2020/2021 లో పాసై ఉండాలి. అభ్యర్థులు టెన్త్, ఇంటర్ లో 80 శాతం మార్కులు, డిగ్రీలో 70 శాతం మార్కులు సాధించి ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థుల వయస్సు 18-24 ఏళ్లు ఉండాలి. పురుషులు, స్త్రీలు ఎవరైన ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు.

ఇతర వివరాలు:

-అభ్యర్థులు ముందుగా www.apssdc.inలో రిజిస్టర్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ లో రాత పరీక్ష(Aptitude Test) నిర్వహించనున్నారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్/లేదా నేరుగా ఫేస్ టూ ఫేస్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
-ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల పాటు పని చేస్తామని అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
-ఈ మేరకు ఒరిజినల్ సర్టిఫికేట్లను హెచ్ఆర్ కు సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
-అగ్రిమెంట్ పూర్తి అయిన తర్వాత ఆ సర్టిఫికేట్లను తిరిగి అందించనున్నట్లు సంస్థ తెలిపింది.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు ఉదయం 10-6.30 గంటల మధ్య 7095731303, 9110573923 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.

ONLINE REGISTRATION LINK CLICK HERE

error: Don\'t Copy!!!!