jagananna-videsi-vidya-deevena-orders-issued-2022-23

జగనన్న విదేశీ విద్యా దీవెనపై ఉత్తర్వులు.. అర్హతలు

విదేశాల్లో చదువుకునే వారికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్…. అగ్రకులాల వారికి కూడా.

జగనన్న విదేశీ విద్యా దీవెన(Jagananna Vidya Deevena)పై ఉత్తర్వులు వెలువరించింది.

జగనన్న విదేశీ విద్యా దీవెన గురించి ప్రభుత్వ ఉత్తర్వులు PDF

ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ కూడా ఈ పథకంలో భాగం కల్పిస్తూ.. తాము ప్రతిభను ప్రొత్సహిస్తామన్న సంకేతాలు పంపింది.*

క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌(QS World University Rankings)లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వమే భరించనుంది.

విదేశీ విద్యను అభ్యసించే అర్హులైన వాళ్ల కోసం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’పై ప్రభుత్వం సోమవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఇప్పుడు అమలు అవుతున్న సంక్షేమ పథకం లాగే.. పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేసేలా ఈ పథకాన్ని అమలు చేయనుంది. 

ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ వర్తించేలా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ఇకపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే భరించనుంది. మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. 100పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే రూ.50లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తించనుంది. 

నాలుగు వాయిదాల్లో.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌. ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదంటే ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లింపు జమ చేస్తుంది ప్రభుత్వం. ఫస్ట్‌సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లింపు ఉంటుంది. అలాగే.. రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపు, నాలుగో సెమిస్టర్‌ లేదంటే ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపు ఉంటుంది. 

అర్హతలు ఇవే
పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది వారీగా లేదంటే.. సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపు ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఇది వర్తిస్తుందని ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టం చేశాయి. టాప్‌ 200 యూనివర్శిటీల్లో ఎన్ని సీట్లు సాధిస్తే అందరికీ సంతృప్తకర స్థాయిలో జగనన్న విదేశీ దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందనుంది. వయసు.. 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులని ప్రకటించింది ప్రభుత్వం. ఏపీలో స్థానికుడై ఉండి.. అలాగే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే జగనన్న విదేశీ విద్యాదీవెన వర్తించనుంది. ప్రతి ఏటా సెప్టెంబర్‌–డిసెంబర్‌, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపుకోసం నొటిఫికేషన్‌ విడుదల చేయనుంది ప్రభుత్వం. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ చేత అర్హుల ఎంపిక ఉండనుంది. 

పక్షపాతం లేకుండా ప్రతిభకే పెద్దపీట వేస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే కేవలం రిజర్వేషన్ ఉన్న విద్యార్థులకే కాదు.. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రకులాలవారికీ కూడా ఈ పథకంలో భాగం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి సుమారు 8 లక్షల రూపాయల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఈ పథకం వర్తింపజేస్తూ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 35 ఏళ్లలోపు ఉన్న వారందరూ అర్హులుగా తెలిపింది. అయిత వీరంతా ఏపీలో స్థానికులై ఉండాలి. అలాగే కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తించేలా నిబంధనలు రూపొందించారు. ప్రతి ఏటా సెప్టెంబరు – డిసెంబరు, జనవరి–మే మధ్య అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీచే అర్హుల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

అయితే దీనికి క్యూఎస్‌ ర్యాంకింగ్స్‌(QS World University Rankings)లో ప్రపంచంలోని మొదటి 200 యూనివర్శిటీల్లో సీటు సాధించిన వారి ఖర్చును ప్రభుత్వమే భరిస్తామని జీవోలో స్పష్టం చేసింది. అంటే మొదటి 100 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సీటు సాధిస్తే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వనుంది. ఇక 100 పైబడి 200 ర్యాంకింగ్స్‌లో ఉన్న యూనివర్శిటీల్లో సాధిస్తే 50 లక్షలు వరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపు చేయనున్నారు. అది కూడా నాలుగు వాయిదాల్లో నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి ఫీజు రియింబర్స్‌మెంట్‌ డబ్బు జమ చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ల్యాండింగ్‌ పర్మిట్‌ లేదా ఐ–94 ఇమ్మిగ్రేషన్‌ కార్డు సాధించగానే మొదటి వాయిదా చెల్లిస్తారు. ఇక ఫస్ట్‌ సెమిస్టర్‌ లేదా టర్మ్‌ ఫలితాలు రాగానే రెండో వాయిదా చెల్లిస్తారు. రెండో సెమిస్టర్‌ ఫలితాలు రాగానే మూడో వాయిదా చెల్లింపులు చేస్తారు. నాలుగో సెమిస్టర్‌ లేదా ఫైనల్‌ ఫలితాలు రాగానే నాలుగో వాయిదా చెల్లింపులు జరుపుతారు. పీహెచ్‌డీ, ఎంబీబీఎస్‌ విద్యార్థులకు ఏడాది వారీగా లేదా సెమిస్టర్‌ వారీగా కోర్సు పూర్తయ్యేంతవరకూ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు వుంటాయి.

2016 –17 నుంచి లబ్ధిదారులుగా ఎంపిక చేసిన 3,326 మందికి 318 కోట్ల రూపాయలను బకాయిలుగా పెట్టింది గత ప్రభుత్వం. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సమయంలో ఆర్ధికంగా వెనకబడ్డ అగ్రకులాలకు దీన్ని వర్తింప చేయలేదు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. గతంలో సంవత్సరాదాయం 6 లక్షల రూపాయల లోపు ఉన్నవారికి మాత్రమే వర్తించేది.. ఇప్పుడు ఆదాయ పరిమితి పెంచింది జగన్ సర్కార్. 8 లక్షల రూపాయల లోపు ఆదాచం ఉన్నవారిరి ఈ పథకం వర్తిస్తుంది. ప్రపంచంలోని కొన్నిదేశాలకే వర్తింపు చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు ప్రపంచంలోని ఎక్కడైనా 200 అత్యుత్తమ యూనివర్శిటీలకు వర్తింపచేస్తూ నిర్ణయం ప్రకటించిన ప్రభుత్వం.

error: Don\'t Copy!!!!