ఆన్లైన్లో చిక్కీలు, గుడ్ల వివరాల నమోదు
పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసే కోడిగుడ్లు, చిక్కీల వివరాలను ఆన్లైన్ లో నమోదు చేయాలని సంచా లకులు దివాన్మైదీన్ ఆదేశాలు జారీ చేశారు. గుత్తే దార్ల నుంచి తీసుకున్న పరిమాణాన్ని ఆన్లైన్ యాప్లో నమోదు చేయాలని, నమోదు చేసిన వాటికి మాత్రమే బిల్లులు చెల్లిస్తామని పేర్కొన్నారు. కోడిగుడ్లు నెలకు మూడు పర్యాయాలు, చిక్కీలు రెండు పర్యాయాలను గుత్తేదార్లు సరఫరా చేస్తారు. ఈ సమయంలో ప్రధానోపాధ్యాయులు వివరాలను నమోదు చేయాలని సూచించారు.