Inter-district-transfers-2021-for-ap-teachers-guidelines-online-link

టీచర్ల అంతర్‌ జిల్లా* బదిలీలకు గ్రీన్‌సిగ్నల్‌

దంపతులు, పరస్పర బదిలీలకే అవకాశం* 

*30 నుంచి జూలై 7 వరకు దరఖాస్తుల స్వీకరణ* 

 ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు, షెడ్యూల్‌ను పాఠశాల విద్య డైరెక్టర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు శుక్రవారం విడుదల చేశారు. భార్యాభర్తలు(స్పౌజ్‌), పరస్పర(మ్యూచువల్‌) బదిలీలకు మాత్రమే ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఏదేని జిల్లాలో ఒక కేడర్‌లో 2021 జూన్‌ 30 నాటికి రెండేళ్ల సర్వీసు నిండిన ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ యాజమాన్యాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, హెచ్‌ఎంలు అంతర్‌ జిల్లా బదిలీలకు అర్హులు.

బదిలీ కోరుకునే జిల్లాలోని ఎయిడెడ్‌, లోకల్‌ బాడీ, రాష్ట్ర/ కేంద్ర ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థలు, యూనివర్సిటీల్లో వారి స్పౌజ్‌ పనిచేస్తూ ఉండాలి. అయితే స్పౌజ్‌ విభాగాధిపతి/ సెక్రటేరియట్‌లో పనిచేస్తుంటే కృష్ణా, గుంటూరు జిల్లాలకు బదిలీ చేస్తారు. స్పౌజ్‌కు క్లియర్‌ వేకెన్సీ ఉంటేనే బదిలీకి అవకాశం ఉంటుంది. మ్యూచువల్‌ విషయంలో ఒకే కేటగిరీ, ఒకే యాజమాన్యానికి మాత్రమే అనుమతిస్తారు. అనధికారికంగా విధులకు గైర్హాజరులో ఉన్నవారు, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొంటున్నవారు, సస్పెన్షన్‌లో ఉన్నవారు బదిలీకి అనర్హులు.

ఒక ఆన్‌లైన్‌ దరఖాస్తుకు మాత్రమే అనుమతిస్తారు. బదిలీ కోరుకునే ఉపాధ్యాయులు సీఎస్‌ఈ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

*బదిలీల షెడ్యూల్‌ ఇలా…

*●జూన్‌ 30 నుంచి జూలై 7 వరకు:* బదిలీకి దరఖాస్తు చేసుకోవడానికి, ప్రింట్‌ కాపీ ఎంఈఓ లేదా డిప్యూటీ ఈఓకి అందించడానికి. 

*●జూలై 7 నుంచి 11 వరకు:* దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, డీఈఓకి సమర్పణ.

*●జూలై 12 నుంచి 17 వరకు:* జిల్లా విద్యాధికారి దరఖాస్తుల పరిశీలన. 

*●జూలై 19:* పాఠశాల విద్యా కమిషనర్‌కు దరఖాస్తుల సమర్పణ. 

*”●జూలై 20 నుంచి 26 వరకు:* దరఖాస్తులను ఫైనల్‌ చేయడం. 

*●జూలై 29:*  ప్రభుత్వానికి దరఖాస్తుల సమర్పణ.

 ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 30 నుంచిదరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ప్రభుత్వానికి అందజేయడం ఉంటుందని పాఠశాల విద్యా కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల నేపధ్యంలో ఆయన అంతర్ జిల్లా బదిలీల మార్గదర్శకాలను విడుదల చేశారు. అంతర్ జిల్లా బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూన్ 30 నాటికి పని చేస్తున్న చోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, యూనివర్సిటీ, హెచ్డీ, సెక్రటరీయేట్, స్థానిక సంస్థల్లో భాగస్వామి పని చేస్తూ ఉండాలని తెలిపారు.

భాగస్వామి సచివాలయం, ప్రభుత్వ ప్రధాన కార్యాలయాల్లో పని చేస్తున్నట్లయితే కృష్ణా, గుంటూరు జిల్లాలకు మాత్రమే ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే కేటగిరీ, యాజమాన్యం ఉన్న చోట పరస్పర బదిలీకి అవకాశం ఇస్తారు.

అయితే ఎంఈవో, డీఈవో ధృవీకరించిన అంగీకారపత్రం జత చేయాల్సి ఉంటుంది. ఒకరు ఒక్కరికి మాత్రమే అంగీకారం ఇవ్వాల్సి ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు.

సర్వీసు నిబంధనల కింద సస్పెండైన వారు, అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అనర్హులుగా తెలిపారు.

అంతర్ జిల్లా బదిలీలకు ఆన్లైన్ దరఖాస్తులను మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.

AP TEACHERS INTER DISTRICT TRANSFERS REGISTRATION FORM GOOGLE FORM LINK

TEACHERS TRANSFERS OFFICIAL WEBSITE CLICK HERE

మార్గదర్శకాలు తెలుగు లో :

AP TEACHERS INTER DISTRICT TRANSFERS REGISTRATION FORM GOOGLE FORM LINK

అంతర్ జిల్లా బదిలీలు : Mutual Transfers కోసం ప్రయత్నించే వారి కోసం ఈ link ఏర్పాటు చేయడం జరిగింది. అంతర్ జిల్లా బదిలీల కోసం చూస్తున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే.

ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉపాధ్యాయుల వివరాలు ఇక్కడ చూడండి (Teachers list)

error: Don\'t Copy!!!!