IBPS PO Recruitment 2022 Notification

Common Recruitment Process (CRP) for Recruitment of Probationary Officers / Management Trainees in Participating Banks (CRP PO/MT-XII)

Important Events

Dates

Commencement of on-line registration of application

02/08/2022

Closure of registration of application

22/08/2022

Closure for editing application details

22/08/2022

Last date for printing your application

01/09/2022

Online Fee Payment

02/08/2022 to 22/08/2022

IBPS PO Recruitment 2022 Notification Out: బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి శుభవార్త.. IBPS నుంచి 6432 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పింది ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS). ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

బ్యాంక్ ఉద్యోగాల (Bank Jobs) కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త చెప్పింది ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS). ప్రొబేషనరీ ఆఫీసర్ (PO), మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్ ద్వారా 6432 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 2వ తేదీ అంటే ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానుంది.

దరఖాస్తు చేసుకోవానికి ఈ నెల 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు ibps.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో సూచించారు.

బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు

S.No

బ్యాంక్

ఖాళీలు

1.

కెనరా బ్యాంక్

2500

2.

యూకో బ్యాంక్

550

3.

బ్యాంక్ ఆఫ్ ఇండియా

535

4.

పంజాబ్ నేషనల్ బ్యాంక్

500

5.

పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్

253

6.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

2094

మొత్తం: 

6432

విద్యార్హతల వివరాలు: అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయో పరిమితి విషయానికి వస్తే.. ఈ ఆగస్టు 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20–30 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల పాటు వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.

IBPS P.O NOTIFICATION PDF

IBPS P.O ONLINE APPLICATION

అభ్యర్థుల ఎంపిక: ప్రిలిమినరీ ఆన్‌లైన్‌ టెస్ట్, మెయిన్‌ ఆన్‌లైన్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్లో వెల్లడించారు.

ఎలా అప్లై చేయాలంటే:

Step 1: అభ్యర్థులు మొదటగా ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 2: హోం పేజీలో కనిపించే “CLICK HERE TO APPLY ONLINE FOR CRPPROBATIONARY OFFICERS/ MANAGEMENT TRAINEES (CRP-PO/MT-XII)” ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3:  అనంతరం “CLICK HERE FOR NEW REGISTRATION” ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

Step 4: అప్లికేషన్ ఫామ్ ను జాగ్రత్తగా నింపాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలి.

Step 5: అనంతరం అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.

Step 6: దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోవాలి.

దరఖాస్తు ఫీజు:

ఎస్సీ/ఎస్టీ/PWBD అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.175 చెల్లించాల్సి ఉంటుంది. ఇతర కేటగిరీల అభ్యర్థులు రూ.850 చెల్లిస్తే సరిపోతుంది.

error: Don\'t Copy!!!!