how-to-verify-Aadhar-card-original-or-duplicate

how-to-verify-Aadhar-card-original-or-duplicate

Aadhaar Card: ఆధార్ కార్డ్ ఒరిజినలో కాదో సింపుల్‌గా ఇలా వెరిఫై చేయండి

Aadhaar Card | మార్కెట్లో ఆధార్ కార్డ్ నుంచి పాన్ కార్డ్ (PAN Card) వరకు అన్నీ డూప్లికేట్ వచ్చేస్తున్నాయి. ఒరిజినల్ కార్డుల్ని గుర్తించడం కష్టం అవుతోంది. ఆధార్ కార్డ్ ఒరిజినలో కాదో సింపుల్‌గా ఎలా వెరిఫై చేయాలో తెలుసుకోండి.

ఆధార్ కార్డ్ విషయంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అనేక సేవల్ని అందిస్తోంది. ప్రస్తుతం ఆధార్ కార్డ్ (Aadhaar Card) అడ్రస్ ప్రూఫ్‌గా, ఐడీ ప్రూఫ్‌గా ఉపయోగపడుతోంది. కొత్తగా పనిమనుషులకు, డ్రైవర్లకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఎవరైనా కొత్తవాళ్లకు ఇల్లును అద్దెకు ఇవ్వాలన్నా ఆధార్ కార్డ్ ప్రూఫ్‌గా తీసుకుంటారు

అయితే ఆధార్ కార్డ్ కాపీ తీసుకుంటున్నారు కానీ అసలు అది ఒరిజినల్ ఆధార్ కార్డేనా కాదా అని తెలుసుకుంటున్నవారు తక్కువ. ఆధార్ కార్డు రిజినలో కాదో తెలుసుకోవడానికి పలు రకాల మార్గాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఆధార్ కార్డును వెరిఫై చేయొచ్చు. మరి ఆధార్ నెంబర్‌ను ఎలా వెరిఫై చేయాలో తెలుసుకోండి

మీరు ఇతరుల ఆధార్ కార్డును ప్రూఫ్‌గా తీసుకున్నట్టైతే వారి ఆధార్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో వెరిఫై చేయొచ్చు. వెరిఫై చేయడం ద్వారా అది ఒరిజినల్ ఆధార్ కార్డో కాదో తెలుస్తుంది. https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ వెరిఫై చేయొచ్చు. ఆధార్ వెరిఫై చేసేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవండి

ఆన్‌లైన్‌లో ఆధార్ నెంబర్ వెరిఫై చేయడానికి ముందుగా https://myaadhaar.uidai.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో Verify Aadhaar పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Proceed and Verify Aadhaar పైన క్లిక్ చేయాలి. అసలు ఆ ఆధార్ నెంబర్ ఉందో లేదో తెలుస్తుంది. దీంతో పాటు వయస్సు, జెండర్, రాష్ట్రం, మొబైల్ నెంబర్‌లోని చివరి మూడు అంకెలు తెలుసుకోవచ్చు

 ప్రతీ ఆధార్ కార్డ్, ఆధార్ లెటర్, ఇ ఆధార్‌పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పేరు, పుట్టిన తేదీ, అడ్రస్, జెండర్ వివరాలతో పాటు ఫోటోగ్రాఫ్ కూడా కనిపిస్తుంది. ఎవరైనా ఫోటోషాప్ ద్వారా ఫోటో మార్చినా, వివరాలు మార్చినా తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో ‘Aadhaar QR scanner’ యాప్ డౌన్‌లోడ్ చేసి ఆధార్ కార్డుపైన ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరిపోతుంది.

ఇలా ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో మీరు ఎవరి ఆధార్ కార్డునైనా వెరిఫై చేయొచ్చు. ఈ ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి ఓసారి మీ ఆధార్ కార్డును వెరిఫై చేసి చూడండి. ఇకపై మీరు ఐడీ ప్రూఫ్‌గా లేదా అడ్రస్ ప్రూఫ్‌గా ఎవరి ఆధార్ కార్డునైనా తీసుకున్నట్టైతే వెంటనే వెరిఫై చేసి వివరాలు సరైనవో కావో తెలుసుకోండి

Aadhaar QR Scanner MOBILE APP DOWNLOAD

VERIFY AADHAR CARD MAIN WEBSITE

error: Content is protected !!
Scroll to Top