how-to-solve-whatsapp-storage-problem-enable-disappiering-message

మిత్రులారా ! 

*మీరు ఉన్న వాట్సప్ గ్రూప్ లలో వచ్చే వందలాది మెస్సేజ్ లతో మీ  ఫోన్ నిండి పోకుండా ఇలా చేయండి.

*వాట్సాప్ గ్రూపుల వలన మీ సెల్ నిండి పోయి ఇబ్బంది పెడుతుంటే ఇలా చేయండి*

 ఇలా చేస్తే మీ ఫోన్ నిండి పోదు 

1 గ్రూపు ఓపెన్ చేసి కుడి వేపు పైన నిలువుగా  ఉన్న  మూడు చుక్కలు తాకితే మీకు 

 ఇలా కనిపిస్తుంది 

Group Info

Group Media

Search

Mute notifications

Wall Paper

More 

అని కనిపించాయి కదా !

 Group Info మీద క్లిక్ చెయ్యండి 

ఇప్పుడు మీకు 

MuteNotific theations

Custom  Notifications

Media Visibility 

Starred Messages అని కనిపిస్తాయి 

 ‘Meadia Visibility’ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దానిని క్లిక్ చెయ్యండి… 

అపుడు మీకు. 

Default

Yes

*No* అని కనిపస్తాయి.. 

 *దానిలో NO అని సెట్ చేయండి*

మీ సమస్య పరిష్కారం అయిపొయింది.. ఇప్పుడు ఫోటోలు , వీడియోలు కనపడతాయి కానీ

 *మీ సెల్ ఫోన్ మెమరీ లోకి రావు*

 ఇలా చేస్తే మీరు ఎన్ని గ్రూపులలో ఉన్న మీ సెల్ జామ్ అవదు…

WhatsApp Feature: మెసేజెస్‌తో వాట్సప్ ఫుల్ అవుతోందా?

ఈ సెట్టింగ్స్ మార్చండి

WhatsApp Disappearing Messages | వాట్సప్‌లో ఎక్కువగా వస్తున్న మెసేజెస్ తలనొప్పిగా మారుతోందా? ఈ సింపుల్ టెక్నిక్‌తో మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలిట్ చేయొచ్చు. సెట్టింగ్స్ ఇలా మార్చండి.

వాట్సప్… పాపులర్ మెసేజింగ్ యాప్. ఇన్‌స్టంట్‌గా మెసేజెస్ పంపాలన్న ఆలోచనతో వాట్సప్ మొదలైంది. ఆ తర్వాత మెసేజెస్ మాత్రమే కాదు ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, ఆడియో మెసేజెస్ ఇలా అనేక ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇక స్నేహితులను, కుటుంబ సభ్యులను ఒకే చోటికి కలిపే గ్రూప్స్ కూడా వచ్చేశాయి. వాట్సప్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్ని తలనొప్పులు కూడా ఉన్నాయి. ఎక్కువగా వాట్సప్ గ్రూప్స్‌లో వచ్చే మెసేజెస్, ఫైల్స్‌తోనే సమస్య. స్నేహితులకు ఓ గ్రూప్, కుటుంబ సభ్యులకు ఓ గ్రూప్, బంధువులకు ఓ గ్రూప్, ఉద్యోగుల కోసం ఓ గ్రూప్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు కనీసం 10 గ్రూప్స్‌లో ఉంటారు. ఈ గ్రూప్స్‌లో రోజూ వందలాది మెసేజెస్ వస్తుంటాయి. అందులో వచ్చే ఫోటోలు, వీడియోలతో స్మార్ట్‌ఫోన్ స్టోరేజ్ ఫుల్ కావడం మామూలే. ఈ సమస్యకు పరిష్కారం చూపించింది వాట్సప్. కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. డిసప్పియరింగ్ మెసేజెస్ పేరుతో ఫీచర్ అందిస్తోంది.

వాట్సప్ డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. మీరు మీ వాట్సప్ అప్‌డేట్ చేసి ఈ ఫీచర్ ఆన్ చేయొచ్చు. మీరు కావాలనుకున్నప్పుడు ఆఫ్ చేయొచ్చు. ఈ ఫీచర్‌ను ఓ ఛాట్‌లో ఆన్ చేస్తే మీరు అందులో గత వారం రోజుల మెసేజెస్ తప్ప ఇంకేమీ కనిపించవు. అంతకు ముందు వచ్చిన మెసేజెస్ అన్నీ ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. మీరు పంపిన మెసేజ్‌తో పాటు, మీకు వచ్చిన మెసేజెస్ వారం రోజుల తర్వాత డిలిట్ అయిపోతాయి. అయితే ఛాట్‌లో వచ్చిన ఫోటోలు, వీడియోలు డిలిట్ కావొద్దంటే ఆటో డౌన్‌లోడ్ ఆన్ చేయాలి. అందులో వచ్చిన ఫోటో, వీడియో ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అవుతుంది. ఛాట్‌లో ఫైల్స్ డిలిట్ అయినా ఫోన్‌లో ఉంటాయి. మరి మీ వాట్సప్‌లో డిసప్పియరింగ్ మెసేజెస్ ఎలా ఆన్ చేయాలో తెలుసుకోండి.

ముందుగా మీ వాట్సప్ ఓపెన్ చేయండి. అందులో ఏదైనా ఛాట్ ఓపెన్ చేయండి. కాంటాక్ట్ పేరు మీద ట్యాప్ చేయండి. మీకు Disappearing messages కనిపిస్తుంది.
అందులో On, Off ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు On పైన క్లిక్ చేస్తే డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఆన్ అవుతుంది. ఇక ఆ ఛాట్‌లోని మెసేజెస్ వారం రోజుల తర్వాత ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్ ఆఫ్ చేయాలంటే Off పైన క్లిక్ చేస్తే చాలు.

error: Don\'t Copy!!!!