How-to-link-PAN-card-to-Aadhar-card-number-link-status

పాన్ ఆధార్ లింక్ డెడ్‌లైన్ ఇదే.. క్షణాల్లో అనుసంధానం చేసుకోండిలా.

2 నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం

             మీకు పాన్ కార్డు ఉందా? అయితే మీరు కచ్చితంగా పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ పని చేయకపోతే మీరు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంతేకాకుండా రూ.1000 జరిమానా కూడా చెల్లించుకోవాలి. ఇప్పటికే బ్యాంకులు ఈ విషయాన్ని కస్టమర్లకు తెలియజేస్తున్నాయి.
              పాన్ ఆధార్ లింక్‌కు జూన్ 30తో గడువు ముగుస్తుంది. అంటే మీరు ఈ నెలలో కచ్చితంగా రెండింటినీ అనుసంధానం చేసుకోవాలి. లేకపోతే మీ పాన్ కార్డు చెల్లుబాటు కాదు. దీంతో మీరు పాన్ కార్డును అవసరం ఉన్న చోట ఉపయోగించలేరు. దీంతో ఇబ్బందులు తప్పవు.

     మీరు పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి 2 ఈజీ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌లోనే మీరు పాన్ ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు. దీని కోసం మీరు IT వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఇక్కడ కింద ఇంపార్ట్‌మెంట్ లింక్స్ అని ఉంటుంది. ఇందులో పాన్ ఆధార్ లింక్ ఆప్షన్ కనిపిస్తుంది.

     మీరు దీనిపై క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది. అయితే ప్రస్తుతం ఈ సైట్ మెయింటెనెన్స్‌లో ఉంది. అందువల్ల ఓపెన్ కాదు. ఓపెన్ అయితే మీ ఆధార్ నెంబర్, పాన్ కార్డు వివరాల ద్వారా రెండింటినీ లింక్ చేసుకోవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా అనుసంధానం చేసుకోవచ్చు. 567678 లేదా 56161 నెంబర్లకు UIDPAN అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి పాన్ నెంబర్ ఎంటర్ చేసి మెసేజ్ పంపాలి.

ఆధార్‌ లేని పాన్‌ కార్డులను ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 139ఏ(2)ప్రకారం రద్దు చేస్తామని సీబీడీటీ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆధార్ ‌తో అనుసంధానం చేయకపోతే పాన్ కార్డును రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సైతం హెచ్చరించింది. 

మీ పాన్ – ఆధార్ లింక్ చేయటం కోసం కింది లింక్ పై క్లిక్ చేయండి

https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar

*మీ పాన్ – ఆధార్ లింక్ అయ్యిందో లేదో STATUS తెలుసుకోటానికి కింది లింక్ ఫై క్లిక్ చేయండి*

 https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status

error: Don\'t Copy!!!!