how-to-find-LPG-cylinder-subsidy-details

how-to-find-LPG-cylinder-subsidy-details

గ్యాస్ సబ్సిడీ డబ్బు ఎంతోస్తోంది? అకౌంట్‌లో పడుతోందా? లేదా? ఇలా తెలుసుకోండి!

Gas Cylinder: మీకు వంట గ్యాస్ సబ్సిడీ వస్తోందా ?.. ఇలా చెక్ చేసుకోండి..

LPG Cylinder Subsidy: LPG సబ్సిడీ రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. రూ. 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న వ్యక్తులు సబ్సిడీ పరిధిలోకి రారు. 10 లక్షల ఆదాయాన్ని భార్యాభర్తలిద్దరి ఆదాయాన్ని కలిపి లెక్కిస్తారు.

మీరు ఎల్‌పీజీ సిలిండర్ వాడుతున్నారా?  అయితే మీరు సులభంగానే గ్యాస్ సబ్సిడీ డబ్బులు వస్తున్నాయో.. లేదో.. సులభంగా తెలుసుకోవచ్చు.

మీరు గ్యాస్ సిలిండర్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు సబ్సిడీ డబ్బులు కూడా వస్తుంటాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన ప్రతిసారి సబ్సిడీ డబ్బులను వినియోగదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తూ ఉంటుంది.

సిలిండర్ డెలివరీ తర్వాత 2- 3 రోజుల్లో ఈ డబ్బులు వస్తాయి.

 బ్యాంకు ఖాతాలో ఆధార్ అనుసంధానం చేయకుంటే డబ్బులు జమ కావు కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఆధార్‌కి లింక్ చేయాలి.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉపయోగించే ప్రతి కుటుంబానికి దాదాపుగా సబ్సిడీ డబ్బులు లభిస్తుంటాయి. అయితే కొంత మందికి సబ్సిడీ డబ్బులు రాకపోవచ్చు. ఇలాంటి వారు ఉంటే 18002333555 నెంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. అలాగే అకౌంట్‌ నెంబర్‌తో ఎల్‌పీజీ ఐడీ లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే భార్యాభర్తల వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు పైన ఉంటే ఎల్‌పీజీ సబ్సిడీ రాదని గమనించాలి.

ఇండేన్ గ్యాస్ వాడే వారు సులభంగానే సబ్సిడీ వస్తోందో రాలేదో తెలుసుకోవచ్చు.

ఏ బ్యాంక్‌లో సబ్సిడీ పడుతోందో కూడా చూసుకోవచ్చు.

ఇంట్లో ఈ విధంగా LPG సబ్సిడీని తనిఖీ చేయడానికి ముందుగా www.mylpg.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అప్పుడు మీరు మూడు కంపెనీలలో మీ సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంచుకోవాలి. అప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది.

గ్యాస్ సర్వీస్ ప్రొవైడర్ సమాచారం ఇక్కడ ఇవ్వబడుతుంది. కుడి వైపున, మీరు సైన్ ఇన్ మరియు కొత్త వినియోగదారు ఎంపికల నుండి ఎంచుకోవాలి. మీకు ID ఉంటే సైన్ ఇన్ చేయాలి లేదా కొత్త వినియోగదారుని ఎంచుకోవాలి

వ్యూ సిలిండర్ బుకింగ్ హిస్టరీ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. రు క్లిక్ చేయడం ద్వారా సబ్సిడీ డబ్బు గురించి తెలుసుకోవచ్చు. ఒకవేళ మీకు సబ్సిడీ అందకపోతే 18002333555 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు

తర్వాత సబ్సిడీ సంబంధిత సమస్యలు అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ సబ్సిడీ వివరాలు మీకు తెలుస్తాయి. ప్రస్తుతం సిలిండర్ బుకింగ్‌పై రూ.47.5 గ్యాస్ సబ్సిడీ డబ్బులు వస్తున్నాయి.

https://www.mylpg.in/

FIND YOUR LPG GAS SUBSIDY CLICK HERE(indian gas)