How-to-download-masked-aadhar-card-regular-aadhar-card-details

ఆధార్ (Aadhar) కార్డు విష‌యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్(Central Government) ఇటీవల దేశ పౌరుల‌కు ఓ కీల‌క సూచ‌న చేసిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డును ఇత‌రుల‌కు ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ‘మాస్క్‌డ్ కాపీ’ (Masked Aadhaar Card) ల‌ను మాత్ర‌మే ఇవ్వాల‌ని ఆ ప్రకటనలో కేంద్రం స్పష్టం చేసింది. అయితే.. ఆధార్ కార్డు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఈ సూచ‌నలు చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. వివిధ అవసరాల కోసం ఏ సంస్థ‌కైనా.. ఇంకా ఎవరికైనా ఆధార్ ను ఇవ్వాల్సి వస్తే ‘ఫొటోకాపీ ఆధార్‌’ను ఇవ్వ‌వద్దని ఆ ప్రకటనలో కేంద్రం పౌరులకు సూచించింది. అలా ఇస్తే మీ ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని కేంద్రం హెచ్చ‌రించింది.

అయితే.. ఫొటోకాపీకి బదులుగా మాస్క్‌డ్ కాపీల‌ను ఇవ్వండని వెల్లడించింది. కాగా.. ఈ మాస్క్‌డ్ కాపీలో చివ‌రి నాలుగు అంకెలు మాత్ర‌మే క‌నిపిస్తాయి. దీంతో ఆధార్ దుర్వినియోగం అవడం కుదరదని వివరించింది కేంద్రం. అయితే.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వెనక్కితగ్గింది. ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. మాస్క్డ్ ఆధార్ మాత్రమే ఇతరులతో పంచుకోవాలన్న ప్రకటనను విరమించుకుంటున్నట్లు స్పష్టం చేసింది.

Masked Aadhaar: ఆధార్ కు కూడా మాస్క్.. సెక్యూరిటీ కోసం UIDAI మరో సూపర్ ఫీచర్.. మాస్క్ ఆధార్ డౌన్ లోడ్ ఇలా..

ఆధార్ కార్డును మరింత సురక్షితంగా ఉంచడం కోసం మాస్క్ ఆధార్ ను తీసుకువచ్చింది UIDAI. ఆ ఆధార్ ప్రత్యేకతలు, డౌన్ లోడ్ విధానం గురించిన వివరాలివే..

మన దేశంలో ఆధార్ ఇప్పుడు ప్రతీ ప్రభుత్వ పనికి తప్పనిసరిగా మారింది.

చివరికి కరోనా పరీక్షలకు, వ్యాక్సినేషన్ కు కూడా ఆధార్ నే గుర్తింపు కార్డుగా వినియోగిస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో UIDAI సైతం అనేక రకాల ఆధార్ సేవలను చాలా సులభతరం చేసింది. చాలా సేవలను ఆన్లైన్లోనే అందిస్తోంది.

తాజాగా మరో ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది యూఐడీఏఐ(UIDAI). అదే మాస్క్ ఆధార్. ఏంటి ఈ మాస్క్ ఆధార్ అని అనుకుంటున్నారా?. మాస్క్ ఆధార్ అంటే.. ఆధార్ నంబర్ పూర్తిగా కార్డుపై కనిపించదు. మొత్తం 12 అంకెల ఆధార్ నంబర్ పై మొదటి 8 నంబర్లు ఆధార్ కార్డుపై కనిపించవు. చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి.

ఇతర వివరాలు అంటే పేరు, డేట్ ఆఫ్ బర్త్, చిరునామా, క్యూఆర్ కోడ్ తదితర వివరాలు ఎప్పటిలాగే కనిపిస్తాయి. అయితే ఈ మాస్క్ ఆధార్ కార్డును ఎవరైనా చూసినా.. వారికి నంబర్ తెలియకుండా ఉంటుంది. 

ఈ ఫీచర్ కార్డును మరింత సురక్షితంగా మారుస్తుంది.

ఈ ఆధార్ కార్డును ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..
-మాస్క్ ఆధార్ కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలంటే మొదటగా https://eaadhaar.uidai.gov.in/ లింక్ పై క్లిక్ చేయాలి.
-లేదా https://uidai.gov.in/ ని ఓపెన్ చేసి.. అందులో ని ‘My Aadhaar’ విభాగం కింద, ‘Download Aadhar’ లింక్ పై క్లిక్ చేయాలి.
-అనంతరం Aadhaar Number, Enrolment ID(EID), Virtual ID(VID) ఏదో ఒక ఆప్షన్ ఎంచుకుని వివరాలు నమోదు చేయాలి.

– అనంతరం I want a masked aadhaar అనే ఆప్షన్ ను సెలక్ట్ చేయండి
-తర్వాత ‘‘Send OTP’’ ఆప్షన్ పై క్లిక్ చేయండి, అనంతరం మొబైల్ కు ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని నమోదు చేయాలి.
-అనంతరం Download Aadhaar పై క్లిక్ చేసి ఆధార్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
-ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ masked aadhaarను డౌన్ లోడ్ చేసుకోండి.
-ఏమైనా సందేహాలుంటే పైన ఇచ్చిన వీడియోను చూసి నివృత్తి చేసుకోవచ్చు.

DOWNLOAD YOUR MASKED AADHAR CARD

error: Don\'t Copy!!!!