How-to-complete-life-certificate-for-pensioners

Life Certificate: పెన్ష‌న‌ర్లు 6 ర‌కాలుగా లైఫ్ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌చ్చు

పెన్ష‌న‌ర్లు జీవ‌న ధృవీక‌ర‌ణ ప‌త్రం (లైఫ్ స‌ర్టిఫికేట్‌)ను స‌మ‌ర్పించాల్సిన గ‌డువు ద‌గ్గ‌ర ప‌డుతుంది. ప్ర‌తీ సంవ‌త్స‌రం న‌వంబ‌రు నెల‌లో అంటే న‌వంబ‌రు 1 నుంచి 30 లోపు ప్ర‌భుత్వ ఫించ‌నుదారులు వారి జీవ‌న ప్రమాణ ప‌త్రంను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. అప్పుడే ఎలాంటి అవాంత‌రాలు లేకుండా పెన్ష‌న్ పొంద‌చ్చు.

అయితే 80 సంవ‌త్సరాలు దాటిన పెన్ష‌న‌ర్లు మాత్రం అక్టోబ‌రు 1 నుంచే ఈ స‌ర్టిఫికేట్‌ను ఇవ్వ‌చ్చు. జీవ‌న ధృవీక‌ర‌ణ ప‌త్రం ఇచ్చేందుకు వీరికి రెండు నెల‌ల స‌మ‌యం ఉంటుంది. వీరు కూడా న‌వంబ‌రు 30 లోపు గానే స‌మ‌ర్పించాలి.*

పెన్ష‌న్‌, పెన్ష‌న‌ర్ల సంక్షేమ శాఖ సెప్టెంబ‌రు 20, 2021న జారీ చేసిన ఆఫీస్ మెమోరాండ‌మ్ ప్ర‌కారం పెన్ష‌న‌ర్లు వారి వార్షిక జీవ‌న ధృవీక‌ర‌ణ ప‌త్రాన్ని వివిధ మార్గాల‌లో స‌మ‌ర్పించ‌వ‌చ్చు. భౌతికంగా అంటే బ్యాంకు, పోస్టాఫీసు వెళ్లి గానీ, డోర్ స్టెప్ విధానంలో ఇంటి వ‌ద్ద గానీ, డిజిట‌ల్ గానీ లైఫ్ స‌ర్టిఫికేట్‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు.*

పెన్ష‌న‌ర్లు లైఫ్ స‌ర్టిఫికేట్ స‌మ‌ర్పించ‌గ‌ల 5 మార్గాలు..*

1. జీవ‌న్ ప్ర‌మాణ్ పోర్ట‌ల్‌..

పెన్షనర్లు జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు.  పోర్టల్ నుంచి జీవన్ ప్రమాణ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, పెన్ష‌న‌ర్.. అతని/ఆమె వేలిముద్రలను సమర్పించాలి. ఇందుకు యూఐడీఏఐ నిర్దేశించిన పరికరం అవసరం. ఫింగర్‌ప్రింట్ పరికరాన్ని ఓటీజీ కేబుల్ ద్వారా మొబైల్ ఫోన్‌కి కనెక్ట్ చేయచ్చు.

వేలిముద్ర‌ల సేక‌ర‌ణ కోసం యూఐడీఏఐ నిర్దేశించిన పరికరాల జాబితా జీవన్ ప్రమాణ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది.  ఈ పరికరాలు ఈ-కామర్స్ వెబ్‌సైట్ల నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ముందుగా మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసి ఫించ‌నుదారుడు త‌మ వివ‌రాల‌ను(ఆధార్ నెంబ‌రు, మొబైల్ నెంబ‌రు, ఇమెయిల్ ఐడి) అందించ‌డం ద్వారా రిజిస్ట‌ర్ చేసుకువాలి. ఇది ఒన్‌-టైమ్ ప్రాసెస్‌.. ఒక‌సారి చేస్తే స‌రిపోతుంది.

వేలిముద్ర ప‌రిక‌రాన్ని క‌నెక్ట్ చేసి స‌బ్మిట్ చేస్తే ప్రాసెస్ పూర్త‌వుతుంది. పెన్ష‌న‌ర్లు త‌మ సౌల‌భ్యం కోసం ఆధార్‌తో మెబైల్ నెంబ‌రును అనుసంధానించవ‌చ్చు. అయితే ఇది త‌ప్ప‌నిస‌రికాదు.

https://jeevanpramaan.gov.in/ppouser/login

2. బ్యాంకుకు వెళ్ల‌డం ద్వారా..

లైఫ్ స‌ర్టిఫికేట్‌ను  స‌మ‌ర్పించేందుకు మొద‌టి నుంచి అనుస‌రిస్తున్న మార్గం ఇది. పెన్ష‌న్ పొందుతున్న వారు స్వ‌యంగా బ్యాంకుకు వెళ్లి, సంబంధిత ఫారం తీసుకుని, పూర్తి చేసి బ్యాంకు అధికారుల‌కు ఇవ్వాలి. ఫారం బ్యాంకు కౌంట‌ర్‌లో అందుబాటులో ఉంటుంది.*

3. డోర్ స్టెప్ విధానం..

డోర్‌స్టెప్ విధానంలో పెన్ష‌నర్లు ఇంటి వ‌ద్దే లైఫ్ స‌ర్టిఫికేట్‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. ఈ స‌ర్వీస్ మెబైల్ యాప్( డోర్ స్టెప్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.) ద్వారా గానీ, వెబ్‌సైట్( https://doorstepbanks.com/) ద్వారా గానీ, టోల్‌ఫ్రీ నెంబ‌ర్ల (18001213721 / 18001037188) ద్వారా గానీ బుక్ చేసుకోవ‌చ్చు.  బ్యాంకు ఏజెంట్ మీ ఇంటికే వ‌చ్చి కావ‌ల‌సిన ప‌త్రాలు, వేలిముద్ర‌లు క‌ల‌క్ట్ చేసుకుని ప్రాసెస్‌ను పూర్తిచేస్తారు.

ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చి సేవ‌లు అందించినందుకుగానూ నామమాత్ర‌పు రుసుములను వ‌సూలు చేస్తారు.

డోర్‌స్టెప్ బ్యాంకింగ్‌(డీసీబి)ని 12 బ్యాంకులు ఒక కూట‌మిగా ఏర్ప‌డి నిర్వ‌హిస్తున్నాయి.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ)తో పాటు, పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్‌(పీఎన్‌బి), బ్యాంక్ ఆఫ్ బ‌రోడా(బిఓబి), మ‌రికొన్ని ఇత‌ర బ్యాంకులు ఈ సౌక‌ర్యాన్ని అందిస్తున్నాయి.

4. పోస్ట్‌మేన్ ద్వారా..

ఈ విధానంలో బ్యాంకు ఏజెంట్ మాదిరిగానే పోస్ట్‌మేన్ మీ ఇంటి వ‌ద్ద నుంచే లైఫ్ స‌ర్టిఫికేట్ ప్రాసెస్ పూర్తి చేస్తారు. స‌ర్వీస్ బుకింగ్ కోసం గూగుల్ ప్లే నుంచి పోస్ట్ఇన్‌ఫో(Postinfo) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. మినిస్ట్రీ ఆఫ్ ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాలిజితో క‌లిసి పోస్టాఫీసు న‌వంబ‌రు 2020లో ఈ స‌ర్వీసుల‌ను ప్రారంభించింది.*

5. పెన్ష‌న‌ర్ల‌కు బ‌దులు వేరొక‌రు సబ్మిట్ చేయాలంటే..*

సాధార‌ణంగా లైఫ్ స‌ర్టిఫికేట్‌ను స‌బ్మిట్ చేసేందుకు స్వ‌యంగా పెన్ష‌న్ దారుడే బ్యాంకుకు వెళ్లాలి. కానీ సెంట్ర‌ల్ పెన్ష‌న్ అక్కౌంటింగ్ ఆఫీస్‌(సీపీఏఓ) జాబితాలో సూచించిన‌ అధికారులు లైఫ్ స‌ర్టిఫికేట్ ఫారంపై సంత‌కం చేస్తే.. పెన్ష‌న‌ర్లకి బ‌దులు మ‌రెవ‌రైనా ఫారం స‌బ్మిట్ చేయవ‌చ్చు. సీపిఏఓ సూచించిన అధికారుల జాబితా కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.

6. వీడియో కాల్ ద్వారా..

మీకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో పెన్ష‌న్ ఖాతా ఉంటే వీడియో కాల్ ద్వారా కూడా లైఫ్‌స‌ర్టిఫికేట్‌ను ఇవ్వ‌చ్చు.

తమ బ్యాంకులో ఖాతా ఉన్న పెన్షన్‌దారులకు వీడియో కాల్‌ ద్వారా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించే అవకాశం కల్పించింది. దేశంలోనే తొలిసారిగా వీడియో లైఫ్‌ సర్టిఫికెట్‌ సదుపాయాన్ని నవంబర్‌ 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.

దీని ద్వారా పింఛన్‌దారులు తమ ఇంటి వద్ద నుంచే సులభంగా వీడియో కాల్‌ చేసి లైఫ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించొచ్చు.

https://apteachers360.com/sbi-allows-to-submit-pensioners-life-certificate-through-video-call-details/

error: Don\'t Copy!!!!