how-to-change-your-name-complete-process-details

how-to-change-your-name-complete-process-details

మీరు పేరును మార్చుకోవాలను కొంటున్నారా ? ఐతే ఇలా చేయండి

*ఆధునిక కాలంలో తల్లిదండ్రులు పెట్టిన పేర్లు పిల్లలకు నచ్చడం లేదు. ఇలాంటి పేర్లు పెట్టారేంటి అని పిల్లలు నిందిస్తూవున్నారు. మరికొందరు చిన్నపుడే దత్తు పోవడం వలన, మరికొందరికి విద్యా సంస్థలలో ప్రవేశం సందర్భంగా తల్లిదండ్రులు చెప్పిన పేర్లు పాఠశాలల రికార్డుల్లో  తప్పుగా వ్రాసుకోవడం వంటి వలన , కొందరికి పాసుపోర్టు పొందటానికి పేర్లు సరిదిద్దుకోవాల్సి వస్తుంది*

*ఇలా పేరు మార్చుకోవాలంటే ఏ శాఖను ఆశ్రయించాలో ఏయో డాక్యూమెంట్లు సమర్పించాలో తెలియక ఇబ్బంది పడుతూవుంటారు*

*8.12.1977 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని సాధారణ పరిపాలనా శాఖ (GAD)వారు GO (P) No 819 లో పేరు మార్చుకొనేటందుకు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఇచ్చారు*

*(1) పేరు మార్పు కోరుకొనే వ్యక్తి భారతపౌరుడై వుండాలి*

*(2) ఆంధ్రప్రదేశ్ లో స్థిర నివాసం ఉండాలి*

*(3) Form 1 లో జిల్లా కలెక్టర్ & ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటుకు ధరఖాస్తు చేసుకోవాలి. మీ సౌలభ్యం కోసం Form – 1 కిందన ఇచ్చాను*

*(4) మీరిచ్చిన ఫారం – 1 ను మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ( సంబంధిత తహశీల్దారు ) కు విచారణ నిమిత్తం పంపడం జరుగుతుంది*

*(5) మీరిచ్చిన వివరాలు సరిగా వున్నాయని అనగా భారతపౌరుడని ఆంధ్రప్రదేశ్ లో ఫలానా చిరునామాలో వున్నాడని  ఇతను కోరినట్లుగా ఇంటిపేరు, లేదా పేరు, లేదా ఇంటిపేరుతో సహా పేరు మార్చవచ్చునని జిల్లామేజిస్ట్రేట్ (జిల్లా కలెక్టరు ) కు నివేదిక పంపడం జరుగుతుంది*

*(6) మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ( తహశీల్దారు ) గారి నివేదిక సరిగా వున్నదని జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (జిల్లా కలెక్టరు ) నమ్మితే*

*(7) అనెక్జరు – 2 లో మీరు కోరుతున్న పేరు మార్పు వివరాలను రెండువార్త పత్రికలలో అంటే ఒకటి స్థానిక తెలుగు దినపత్రిక తప్పకవుండాలి, మరొకటి ఆంగ్ల దినపత్రికలో  ప్రచురించటానికి, మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గెజిట్ లో ప్రచురించటానికిగాను రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరికి పంపండం జరుగుతుంది. ఎప్పుడైతే రాష్ట్ర గెజిట్ లో మీ పేరు, ఇంటిపేరు , ఇంటిపేరుతో సహ పేరు మార్పులతో నోటిఫికేషన్ రూపంలో ప్రచురించబడుతుందో ఆనాటి నుండి మీరు కోరిన పేరుమార్పు అమలులోకి వస్తుంది. పేరు మార్పు కోసం ప్రభుత్వం రుసుము కట్టలంటే on line లో చలానారూపంలో చెల్లించాలి*

*ఇక ఆంధ్ర రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకై కేంద్రప్రభుత్వం* 

*విధివిధానాలను లెటర్ నెం.M (H.A) 23012/10/ 84 తేదీ, 18.5.1983 రూపంలో విడుదలచేసింది* దీని ప్రకారం*

*(1) ప్రభుత్వ ఉద్యోగి తన పేరులోని వివరాలను అధికారపూర్వకంగా మార్చుకోవాలంటే సంబంధిత  జిల్లా ఎగ్జిగ్యూటివ్ మేజిస్ట్రేటు ( జిల్లా కలెక్టరు ) నుండి, పేరు మార్పుచేసుకొనే వివరాలున్న ఒక ద్రువీకరణపత్రాన్ని ( సర్టిఫికేటు )  ఇతరులులాగా పొందాల్సిన పనిలేదు*

*(2) అందుకు బదులుగా ఒక ఐదు రూపాయల నాన్ జ్యూడిషియల్ బాండ్ ను (Non Judicial  of Bond, value – Rs5/-) ఇవ్వాలి.సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ బాండ్ ను రిజిస్ట్రేషన్ చేయించరాదు.. మీకోసం  మీరు ఇవ్వాల్సిన బాండ్ కాపీని కింద ఇవ్వడం జరిగింది*

*(3)  ఎగ్జిగ్యూట్ చేయాల్సిన బాండులో వివరాలను సంపూర్తిగా నింపి అదే శాఖలోని ఇద్దరు అధికారుల చేత సాక్ష్యం వేయించాలి*

*(4) ఇలా నింపిన బాండ్ ను రెండు దినపత్రికలలోనూ ఆంధ్రప్రదేశ్ గెజిట్  లోనూ ప్రచురించటానికిగాను పనిచేస్తున్న శాఖాధికారి (Head of the Dept.) ద్వారా డైరెక్టర్ ఆఫ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరి వారికి పంపాలి*

*(5) మీరు బాండులో పంపిన వివరాలు సక్రమంగా వుంటే డైరెక్టర్ ఆఫ్ స్టేషనరి అండ్ ప్రింటింగ్ వారు మీపేరులో మార్పు కోరిన వివరాలను రెండు దినపత్రికలలోనూ ప్రచురింపచేసి, ఆంధ్రప్రదేశ్ గెజిట్ ద్వారా నోటిఫికేషన్ ఇస్తారు. పత్రికలలో వివరాలను ప్రచురించటానికి అయ్యే ఖర్చును ప్రభుత్వ ఉద్యోగి భరించాలి. గెజిట్ నోటిఫికేషన్ వివరాలను శాఖాధికారి (HOD) కి ఇచ్చి SR ఇతర పత్రాల (డాక్యూమెంట్ల) లో మార్పులు చేసుకోవచ్చును. e. SR  లో గెజిట్ నోటిఫికేషన్ కాపీని (Upload)  చేరిస్తే  చాలా మంచిది*

*ఈ సేకరణ మీకో అవగాహన కొరకే. మిగతా వివరాలు మార్పులు జరిగివుంటే సంబంధిత ఆధునాతన  ప్రభుత్వ ఉత్తర్వులు చూడండి*