how-many-types-of-tea-colours

Tea colors: బ్లూ టీ, రెడ్ టీ, యెల్లో టీ, పింక్ టీ.. ఈ రంగుల్లో ఉండే టీల గురించి తెలుసా?

Tea colors: ఉదయాన్ని టీ తాగనిదే చాలా మందికి రోజు గడవదు. కేవలం తెల్లవారుజామునే కాదు.. ఒకరోజులో ఐదారు సార్లు కూడా టీ తాగే వాళ్లు చాలా మంది ఉన్నారు. మనం రోజూ తాగే టీల్లో ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి. కడక్, మసాలా, అల్లం, యాలకులు, లవంగ టీ.. ఇలా మార్కెట్లో చాలా రకాలున్నాయి. ఫ్లేవర్ మాత్రమే కాదు.. టీ కలర్స్ కూడా చాలా ఉన్నాయి. అవేంటి? ఎలా చేస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

టీలో మనకు బాగా తెలిసిన టీ ఏదైనా ఉందంటే.. అది పాలు, చక్కెర, టీ పొడితో చేసే సాధారణ టీ..! ఎక్కువ మంది దీనినే తాగుతారు. ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఇక బ్లాక్, గ్రీన్ టీ కూడా చాలా మందికి తెలుసు. కానీ రెడ్ టీ, బ్లూ టీ, యెల్లో టీ గురించి ఎప్పుడైనా విన్నారా?

1. బ్లాక్ టీ: మనం రోజూ తాగే టీలో పాలు కలపకుండా తాగితే అదే బ్లాక్ టీ. దీనినే డికాక్షన్ అని కూడా పిలుస్తారు. దీనిని ఇండియా, చైనా, టిబెట్, మంగోలియా వంటి దేశాలలో పండిస్తారు. టీ ఆకులను ఎండబెట్టి తయారు చేస్తారు. 

2. రెడ్ టీ: దక్షిణాఫ్రికాలో పెరిగే ‘ఆస్పలాథస్’ అనే చెట్టు నుండి రెడ్ టీ వస్తుంది. దీనినే రుబోస్ టీ అని కూడా పిలుస్తారు. ఇందులో గ్రీన్ టీ కంటే 50% ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుపరుస్తుంది. జుట్టును దృఢంగా చేస్తుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది

3. బ్లూ టీ: ఈ రంగులో టీని మీరు ఎప్పుడూ చూసి ఉండరు. కానీ అపరాజిత అనే నీలం పువ్వుతో తయారు చేస్తారు. కెఫీన్ లేని హెర్బల్ టీ ఇది. జ్ఞాపకశక్తిని పెంచడంలో బ్లూ టీ సహాయపడుతుంది. జ్వరం, ఆందోళనను తగ్గిస్తుంది. ఉబ్బసం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్‌ను కూడా నియంత్రిస్తుంది

4. గ్రీన్ టీ: గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇటీవల చాలా మంది ఈ టీని తాగుతున్నారు. ఇది ఇండియా, చైనాలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. మధుమేహం, క్యాన్సర్, మానసిక వ్యాధులతో పోరాడే శక్తి గ్రీన్ టీకి ఉంది. ఇది బరువు తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది

5. పింక్ టీ: ఇది మందార అంటే మందార పువ్వు నుండి తయారు చేస్తారు. ఆరోగ్య పరంగా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మధుమేహం మరియు కడుపు సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

6. ఎల్లో టీ: గ్రీన్ టీ తర్వాత అత్యధికంగా వినియోగించే టీ.. ఎల్లో టీ. ఇది చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. పసుపు రంగులో తీసుకురావడానికి దీని ఆకులను ప్రత్యేక పద్ధతిలో తయారు చేస్తారు. రుచి గ్రీన్ టీ లా చేదుగా కాకుండా.. కాస్త తియ్యగానే ఉంటుంది. ఇందులో గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లన్నీ ఉంటాయి

error: Don\'t Copy!!!!