good-news-for-ap-teachers-promotions

విద్యా శాఖ లో త్వరలో భారీ మార్పులు

మే నెలలో రేషనలైజేషన్, ప్రమోషన్స్, బదిలీలు జరుగుతాయి*

ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతులు బోధించడానికి ఉన్నత పాఠశాల లో మెర్జ్ అయ్యిన SGT పోస్టులను అప్గ్రెడేషన్ చేస్తారు. వీటిని 100% ప్రమోషన్స్ ద్వారా భర్తీ చేస్తారు*

ముందుగా అప్గ్రెడేషన్ , రేషనలైజేషన్, ప్రమోషన్స్ , బదిలీలు వరుసగా జరిగే అవకాశం వున్నది*.

PSHM పోస్టులను అర్హత వున్న వారికి సబ్జెక్ట్ టీచర్లుగా కన్వర్ట్ చేస్తారు. అర్హత లేని వారికి మెర్జ్ కాకుండా మిగిలిన పాఠశాలలకు సర్దుబాటు చేస్తారు

ప్రమోషన్స్ ,బదిలీల కొరకు టీచర్లు అందరూ 16.2.2022 లోపు TIS నందు డేటా నింపగలరు

రాష్ట్రం లోని జిల్లా, డివిజన్, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు మరియు  ఉపాధ్యాయులకు –  నోట్

 3 వ తరగతి నుంచి ఉన్నత పాఠశాల లకు మ్యాపింగ్ చేయడం వలన రాబోయే అతి తక్కువ కాలం లో సుమారు ఈ సంవత్సరం జూన్ నెల లోపే దాదాపు 25 వేల కు పైగా SGT లకు స్కూల్ అసిస్టంట్లు గా పదోన్నతులు రాబోతున్నాయి .

2.     రాష్ట్రం లో కొత్తగా 840 కు పైగా కొత్త గా అ పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యం లో జూనియర్ కళాశాల లు ఏర్పాటు అవుతాయి తద్వారా స్కూల్ అసి స్టంట్లు కు జూనియర్ లెక్చెరర్ స్థాయి ప్రమోషన్లు ,గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్ స్థాయి పదోన్నతులు లభిస్తాయి .(672 మండలాలు లో ప్రస్తుతం 4 1 మండలాల లో మహిళా కళాశాలలు మాత్రమె ఉన్నాయి ,202 మండలా ల లో అసలు కళాశాలలు లేవు అంటే కొత్తగా 202+202 = 404 , 672-41=631-202 =429 , మొత్తంగా సుమారు 833  కొత్త కళాశాల లు రానున్నాయి ).

3.     రాష్ట్రం లో మండల విద్యా శాఖ అధికారులకు కేవలం విద్యా శాఖ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా సెల్ఫ్ డ్రాయింగ్ అధికారాలు  ఏర్పాటు చేయనున్నాము . మండల వనరుల కేంద్రం పేరు ని మండల విద్యా శాఖ అధికారి కార్యాలయం గా మార్పు ( దశాబ్దాలుగా మండల విద్యా శాఖాధికారుల కోరిక )

4.     ఏ విధమైన విద్యేతర బాధ్యతలు అప్పగించకుండా కేవలం విద్యా సంబంధిత పనులు కేటాయించేలా  త్వరలో ఉత్తర్వులు రానున్నాయి

5.     మండల విద్యా శాఖ వ్యవస్థలో త్వరలో భారీ మార్పులు – ఇందులో భాగం గా మండల స్థాయి ఇద్దరు మండల విద్యా శాఖాధికారులు పోస్టులు, అదేవిధం గా డివిజన్ స్థాయి లో , జిల్లా స్థాయి లో పోస్టులు పెరగనున్నాయి.

ఉపాధ్యాయులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. వారందరికీ ప్రమోషన్లు.. పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్.. జూన్ కల్లా అమల్లోకి

నూతన విద్యా విధానం అమల్లోకి రానున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పారు. నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్ కారణంగా సుమారు 22 వేల మందికి పైగా ఉపాధ్యాయులు ప్రమోషన్లు వస్తాయని నేరుగా ముఖ్యమంత్రే చెప్పారు

22 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు

ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటు

ఎంఈఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

విద్యాశాఖ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్

నూతన విద్యా విధానం అమల్లోకి రానున్న సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఉపాధ్యాయులకు శుభవార్త చెప్పారు. నూతన విద్యా విధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్ కారణంగా సుమారు 22 వేల మందికి పైగా ఉపాధ్యాయులు ప్రమోషన్లు వస్తాయని నేరుగా ముఖ్యమంత్రే చెప్పారు.. అదేవిధంగా ఎంఈఓ పోస్టుల భర్తీకి కూడా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఉపాధ్యాయులను నాన్ అకడమిక్ పనుల కోసం వినియోగించొద్దని ఎస్ఈఆర్టీ సూచనకు సీఎం ఆమోదం తెలిపారు.

పాఠశాల విద్యాశాఖ అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ జూన్ నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలని ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలని.. సబ్జెక్టుల వారీగా కూడా ఉపాధ్యాయులు ఉండేలా చూడాలన్నారు. సుమారు 22 వేల మందికి పైగా ఉపాధ్యాయులకు ఎస్.జి.టి. నుంచి స్కూల్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు.

మండలంలో రెండు జూనియర్ కాలేజీలు..

ప్రతి మండలానికి రెండు స్కూళ్లను రెండు జూనియర్ కాలేజీలుగా మార్చాలంటూ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. తొలుత ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్ కాలేజీగా తీర్చిదిద్దాదామని అనుకున్నామని.. కానీ ఇప్పుడు రెండు జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఒకటి కో-ఎడ్యుకేషన్ కోసం అయితే.. మరొకటి బాలికల కోసం జూనియర్ కళాశాలగా మార్చాలని జగన్ సూచించారు.

ఎంఈఓ కార్యాలయంగా మండల రిసోర్స్ సెంటర్

ఇకపై మండల రిసోర్స్ సెంటర్ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎంపీడీఓ పరిధిలో కాకుండా ఎంఈఓకే నేరుగా డ్రాయింగ్ పవర్స్ ఇవ్వాలని.. విద్యా సంబంధిత కార్యకలాపాలు ఎంఈఓకే అప్పగించాలని ఎస్ఈఆర్‌టీ చేసిన సిఫార్సుకు సీఎం ఆమోదం తెలిపారు. ఎంఈఓ పోస్టుల భర్తీకి కూడా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పలురకాల ఆప్స్‌ కన్నా.. రియల్‌టైం డేటా ఉండేలా.. డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తీసుకురావాలని సీఎం చెప్పారు. విద్యార్థుల మార్కులనూ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయనున్నారు.

పాఠాలు బోధించే ఉపాధ్యాయులను నాన్ అకడమిక్ పనులకు వినియోగించవద్దని.. హెడ్‌మాస్టర్లను పలు రకాల మీటింగ్‌లు కాకుండా సమన్వయం కోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలని సూచించిన ఎస్ఈఆర్‌టీ సిఫారసుకి సీఎం ఆమోదం తెలిపారు.

వచ్చే విద్యాసంవత్సరం (జూన్‌) నాటికి నూతన విద్యావిధానానికి అనుగుణంగా అన్ని సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలన్న సీఎం

విద్యార్థుల సంఖ్యకు తగిన నిష్పత్తిలో టీచర్లు ఉండాలన్న సీఎం

సబ్జెక్టుల వారీగా టీచర్లు కూడా ఉండాలన్న సీఎం

నూతన విద్యావిధానంలో ఏర్పాటవుతున్న స్కూల్స్‌ కారణంగా సుమారు 22 వేలమందికిపైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయన్న సీఎం

వీరందరికీ ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు ఇవ్వాలన్న సీఎం

వీరి సామర్థ్యాలను మెరుగుపరిచేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం

స్కూళ్లలో సరిపడా సిబ్బంది ఉన్నప్పుడే పురోగతి కనిపిస్తుందన్న సీఎం

ప్రమోషన్లు, బదిలీలు ఇవన్నీకూడా పూర్తిచేసి జూన్‌నాటికి నూతన విద్యావిధానం సంస్కరణలు పూర్తిగా అమల్లోకి రావాలి

ప్రతి మండలానికి ఒక హైస్కూల్‌ను జూనియర్‌ కాలేజీగా తీర్చిదిద్దుదామని అనుకున్నాం

ఇప్పుడు ప్రతి మండలానికి రెండు స్కూళ్లను 2 జూనియర్‌ కాలేజీలుగా మార్చండి

ఒకటి కో – ఎడ్యుకేషన్‌ కోసం అయితే, ఒకటి బాలికలకోసం జూనియర్‌ కళాశాలగా మార్చాలి

ఎస్‌ఈఆర్‌టీ ఇచ్చిన సిఫార్సులు అన్నీకూడా అమల్లోకి రావాలన్న సీఎం

మండల రీసోర్స్‌ సెంటర్‌ పేరును మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంగా మార్చేందుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌

ఎండీఓ పరిధిలో కాకుండా ఎంఈవోకే నేరుగా డ్రాయింగ్‌ అధికారాలు

ఇకపై విద్యాసంబంధిత కార్యకలాపాలు ఎంఈవోకే అప్పగిస్తూ ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సుకు సీఎం ఆమోదం

ఎంఈఓ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ 

పలురకాల ఆప్స్‌ కన్నా… రియల్‌టైం డేటా ఉండేలా, డూప్లికేషన్‌ లేకుండా చూడాలన్న ఎస్‌ఈఆర్‌టీ సిఫార్సును అమల్లోకి తీసుకురావాలన్న సీఎం

అటెండెన్స్‌ను ఫిజికల్‌గా కాకుండా ఆన్‌లైన్‌ పద్ధతుల్లో తీసుకోవాలన్న సిఫార్సునూ అమలు చేయాలన్న సీఎం

విద్యార్ధుల మార్కులనూ ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ

పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు నాన్‌ అకడమిక్‌ పనులకు వినియోగించవద్దన్న ఎస్‌ఈఆర్‌టీ 

హెడ్‌మాస్టర్లను పలు రకాల మీటింగులు కాకుండా సమన్వయంకోసం నెలకు ఒకే సమావేశం ఏర్పాటు చేయాలన్న ఎస్‌ఈఆర్‌టీ.. వీటికి ఆమోదం తెలిసిన సీఎం

స్కూళ్ల నుంచి ఫిర్యాదుల పరిష్కారంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం

సదుపాయాల లేమి, మౌలిక వసతుల మరమ్మతులు తదితర అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం

నాడు నేడులో ఏర్పాటుచేసిన ఏ సదుపాయాల్లో ఎలాంటి సమస్యవచ్చినా వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం

►స్కూళ్ల నిర్వహణ, టాయిలెట్స్, తాగునీరు వీటి నిర్వహణపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం

►ప్రభుత్వ పాఠశాలల్లో నాడు – నేడు రెండో విడత పనులపై సీఎం కీలక ఆదేశాలు

►త్వరగా పనులు మొదలుపెట్టాలని సీఎం ఆదేశం

►ఫిబ్రవరి 15 నుంచి పనులు మొదలుపెడుతున్నామన్న అధికారులు

►సెప్టెంబరుకల్లా పనులు పూర్తిచేయడానికి చర్యలు తీసుకుంటామన్న అధికారులు

►జగనన్న విద్యాకానుక, టాయిలెట్ల నిర్వహణ, గోరుముద్ద నాణ్యత, స్కూళ్ల నిర్వహణకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయడానికి 14417 టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు

►ఇది సమర్థవంతంగా పనిచేయాలన్న సీఎం

►స్కూళ్లలో కొత్తగా చేరిన విద్యార్ధులకు డిక్షనరీ ఇవ్వాలన్న సీఎం

►ప్రతిరోజూ ఒక పదాన్ని పిల్లలకు నేర్పాలన్న సీఎం

►ఆ పదాన్ని ఎలా ఉపయోగించాలన్నదానిపై పిల్లలకు నేర్పాలని సీఎం ఆదేశం

►పాఠ్యప్రణాళికలో ఇదొక భాగం చేయాలన్న సీఎం

►డిజిటల్‌ లెర్నింగ్‌పైనా కూడా దృష్టిపెట్టాలన్న సీఎం

►8,9,10 తరగతుల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ ఉండేలా చూడాలన్న సీఎం

►దీన్నొక సబ్జెక్టుగా కూడా పెట్టే ఆలోచన చేయాలన్న సీఎం

error: Don\'t Copy!!!!