Formative-Assessment-1-Model-papers-from-class-1st-to-5th

Formative-Assessment-1-Model-papers-from-class-1st-to-5th

F.A- 1 (ఫార్మేటివ్ అసెస్మెంట్) జరుపు విధానం గురించి సూచనలు.

ఈ నెల 21 నుండి 25 వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ స్లిప్ టెస్ట్ లు నిర్వహించాలి. 

ప్రాథమిక పాఠశాల  విషయంలో 

21వ తేదీ తెలుగు 

22వ తేదీ ఆంగ్లము, 

23వ తేదీ గణితం, 

25వ తేదీ పరిసరాల విజ్ఞానం నిర్వహించాలి. 

ఈసారి ఈ పరీక్షల నిర్వహణలో కొన్ని ప్రధానమైన మార్పులు చేశారు. ప్రశ్న పత్రము నేరుగా ఎస్ ఎస్ సి ఈ ఆర్ టి వారు ప్రధానోపాధ్యాయులకు మెయిల్ ద్వారా పరీక్ష సమయానికి ఒక గంట ముందు పంపుతారు. ఆ ప్రశ్నాపత్రాన్ని ఒక బోర్డు పైన ప్రదర్శించి విద్యార్థులను రాసుకోమని చెప్పాలి. తర్వాత పరీక్ష నిర్వహించాలి . 

మరుసటి రోజు నుంచి పరీక్ష పత్రాలు మూల్యాంకనం చేయాలి.   తరువాత ప్రధానోపాధ్యాయులు వాటిని అనగా మూల్యాంకనం చేసిన పరీక్షా పత్రాలను ర్యాండమ్ గా తనిఖీ చేయాలి .  

ఆ తర్వాత మార్కులను నమోదు చేసి  ఆన్లైన్లో సమర్పించాలి. తర్వాత తల్లిదండ్రులకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వాలి . ఈ పరీక్షలలో తక్కువ మార్కులు వచ్చిన వారికి రెమిడియల్ టీచింగ్ ప్రత్యేకంగా చేపట్టి తరగతులు నిర్వహించాలి.  

కనుక ఈ సారి నుండి పరీక్షా విధానంలో వచ్చిన మార్పులను గమనించి తదనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి . అంతేకాక దాదాపు నవంబరు ఒకటవ తేదీ నుండి ప్రత్యేక  బోధన నిర్వహించవలసి రావచ్చు.

F.A-1 పరీక్షల మోడల్ పేపర్లు 1వ తరగతి నుండి  5వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లీషు, గణితం, EVS సబ్జెక్టుల మోడల్ పేపర్లు.

F.A-1 Exams all subjects model papers 2021-22

1st Class All Subjects Model Papers

2nd CLASS ALL SUBJECTS MODEL PAPERS

3rd CLASS ALL SUBJECTS MODEL PAPERS

4th CLASS ALL SUBJECTS MODEL PAPERS

5th CLASS ALL SUBJECTS MODEL PAPERS

నిర్మాణాత్మక మూల్యాంకనం నిర్వహణకై సూచనలు

ప్రభుత్వం సరఫరా చేసిన పాఠశాల సంసిద్ధత/వర్క్ షీట్స్ పై లేదా సంబంధిత సబ్జెక్టు లోని మొదటి పాఠం/చాప్టర్ లో FA 1 నిర్వహించాలి.*

FA 1 కి సంబంధించి ముద్రించబడిన/ఉమ్మడి ప్రశ్నపత్రాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించరాదు*

ప్రాధమిక తరగతులకు కూడా FA 1 తప్పనిసరిగా నిర్వహించాలి. దీని కొరకు SCERT వారు విడిగా మార్గదర్శకాలను విడుదల చేస్తారు.*

FA పత్రాలను సరిదిద్దున్నపుడే ఉపాధ్యాయులు...చదువులో వెనుకబడిన విద్యార్థులను విషయం/తరగతి వారీగా గుర్తించి వారి నివారణ బోధనకై ప్రణాళిక చేయాలి*

ఉపాధ్యాయుల సౌకర్యం మేరకు...చదువులో వెనుకబడిన విద్యార్థులకు ఉదయం 8 గం నుండి 9 గం వరకు మరియు సాయంత్రం 4గం నుండి 6గం వరకు లేదా ఆదివారాలలో నివారణ బోధన నిర్వహించవలెను.*

నివారణ బోధన(Remidial టీచింగ్)లో భాగం గా FA 1 లో తక్కువ పెర్ఫార్మెన్స్ చూపిన విద్యార్థులకు... రాసిన FA 1 ప్రశ్నాపత్రాలనే మరొకసారి ఇచ్చి సహచర బృందం/పాఠ్యపుస్తకాల సహాయంతో వానికి జవాబులు రాయమని సూచించాలి.*

ఎట్టి పరిస్థితులలోనూ గైడ్ లు/ క్వశ్చన్ బ్యాంక్ ల ఆధారంగా ప్రశ్నపత్రాలను రూపొందించరాదు.ఒకవేళ అట్లు రూపొందించినట్లు సంచాలకులు, పాఠశాల విద్య వారి దృష్టికి వచ్చిన యెడల సంబంధితులపై కఠిన చర్యలు తీసుకొనబడును.*

VAARADHI WORK BOOKS FOR F.A-1 EXAMS

error: Don\'t Copy!!!!