employees-welfare-fund-loan-application-details

EMPLOYEES WELFARE FUND*

1) G.O.(P) No.173 ఆర్ధిక శాఖ ద్వారా ఈ నిధి ఏర్పాటు చేయబడినది. సభ్యులు చందా, ప్రభుత్వ గ్రాంట్, విరాళముల ద్వారా ఈ నిధికి డబ్బు సమకూరును. ఈ నిధిపై వచ్చే వడ్డీ నుండి ఉద్యోగులకు అప్పులు / గ్రాంటు ఇవ్వబడును*

2) ప్రభుత్వ ఉద్యోగులు స్థానిక సంస్థల ఉద్యోగులు,* *ఉపాధ్యాయులు, వర్క్ ఛార్జ్డ్ మరియు కంటిన్టెంట్ ఉద్యోగులు*

ఈ నిధిలో సభ్యులు. సభ్యత్వం* *క్రింద ప్రతి ఒక్కరు రూ.50/-చెల్లించాలి. మొదటి* *నెల జీతం నుండి ప్రతి సభ్యుడు ప్రతి సంవత్సరం* *మార్చినెల జీతం నుండి ఈ నిధికి* *రూ.20/- జమ చేయాలి*

3) సభ్యులు ఈనిధి నుండి అప్పును పొందుటకు అర్హత గలిగి వుందురు. G.O.Ms.No. 131 Fin.(EWF) Dt: 14.5.2012 .  పొందిన అప్పును సాధారణ వడ్డీతో కలిపి 5సం॥లలోగా తిరిగి చెల్లించాలి. ప్రత్యేక సందర్భాలలో వడ్డీ మినహాయింపును ఇవ్వబడవచ్చును. వైద్యఖర్చులకు, పిల్లల విద్యాభ్యాస ఖర్చులకు ఆచార సంబంధమైన (కర్మ, ఇత్యాది) ఖర్చులకు గాను అర్థిక సహాయం లేదా అప్పును ఈ నిధి నుండి పొందవచ్చును. ప్రసూతి ఖర్చులకై రూ.20 వేల అప్పు ఇస్తారు. గృహనిర్మాణం లేక మరమ్మత్తులకు ఎట్టి మొత్తంను మంజూరు చేయబడదు*

4) ఈ నిధి రాష్ట్ర కమిటీచే* *నిర్వహించబడుతుంది. విధాన* *పరమైన నిర్ణయములు* *వివిధ జిల్లాలకు కేటాయింపులు*

మొదలగునవి రాష్ట్ర కమిటీయే చేయును. రాష్ర  కమిటీకి/ ప్రభుత్వ* *ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడుగాను, ఆర్థిక శాఖ డిప్యూటీ పెక్రటరీ మెంబర్ కమ్ ట్రేసరర్ గా వ్యవహరిస్తారు . ఆంధ్రప్రదేశ్ జాయింట్ స్టాప్ కౌన్సిల్లో సభ్యత్వం గల అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి ఒక్కొక్కరు వర్క్ ఛార్జ్డ్ ఉద్యోగుల ప్రతినిధి ఒకరు ఈ కమిటీలో సభ్యులుగా వుంటారు*

5) జిల్లా కలెక్టర్ అధ్యక్షుడుగాను, జిల్లా ట్రెజర్ ఆఫీసర్ కన్వీనర్ గాను, మెంబర్ సెక్రటరీ కమ్* *ట్రేసరర్ గా  జిల్లా కమిటీ*

ఏర్పడుతుంది. రాష్ట్ర కమిటీల వలనే జిల్లా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సభ్య సంఘాల ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర కమిటీ నిర్ణయించిన పరిమితి లోబడి /అప్పును లేదా ఆర్థిక* *సహాయమును జిల్లా కమిటీ మంజూరు చేయును. అత్యవసర* *సందర్భములలో అధ్యక్షుడే రూ.500/- మేరకు సహాయం మంజూరు చేయును . ఇట్టి అధికారులతోటే జంట నగరాలకు కూడా ఒక ప్రత్యేక కమిటీ వుంటుంది*

6) ఈ అప్పులను డి.డి.ల రూపంలో చెల్లిస్తారు. నిర్ణయించబడిన సమాన వాయిదాలలో ప్రతినెల బిల్లులో రికవరీ చేయాలి.* *(G.O.Ms.No.404 (P) Fin. Dt: 30.7.2001)*

7) ఈ నిధి నుండి సహాయము పొందుగోరు సభ్యులు లేక మరణించిన సభ్యుని కుటుంబ* *సభ్యులు నిర్ణీత ఫారంలో*

*సంబంధిత కమిటీకి దరఖాస్తును పంపుకోవాలి

*Related GOs :*

*Circular Memo No.01/APEWF/2013-2  dt.09.01.2014 EWF Subscription Rs.20*

EWF LOAN GUIDELINES

EWF LOAN APPLICATION FORM

error: Don\'t Copy!!!!