Education-minister-pressmeet-highlights-about-ap-education

Hon"ble Ed minister Press meet  Highlights:

>అంగీకారము తెలిపిన Management ల

Aided  Degree&Junior colleges  Staff  నుGovt Junior/Degree Colleges లో Absorb చేయుటవలన ఉద్యోగాలు కోల్పోతున్న  సుమారు 7700 +కాంట్రాక్టు Lectures ల కు  తిరిగి  ఉద్యోగాలు కల్నించుటకు‌CM గారితో చర్చించి నిర్ణయము తీసుకొనబడును. GOVT Degree&Junior  Colleges లో Lectures బదిలీలు ఈ నెల 29 తో పూర్తి అవగానే‌ Aided Lecturers  Absorption  పూర్తి అగును

>..అలాగె‌ మున్సిపల్ పరిధిలోని Aided Schools Teachers ను  Municipal.Schools లో Absorb చేయమని వారు కోరుతున్నారు.దీనిపై సాధ్యాసాధ్యాలు ఆలోచిస్తాం. Aided Teachers ను  Web councling ద్వారా Govt/ LB Schools లో Absorb చేస్తాము

> Willing ఇచ్చిన Aided Schools లోని Teaching &Non Teaching  Staff ను ఈ రోజు Relieve చేసినాము.ఆ స్కూల్స్ లో విద్యార్ధులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకొన్నాము.-Honble Ed minister

Govt Junior colleges లో JL పదోన్నతులు వస్తాయని ఆశిస్తున్న School Asst కు ఈ నిర్ణయము అన్ని పాతమే.

ప్రజల అవసరాలకు తగ్గట్టుగా విద్య ఉండాలన్నదే ఉద్దేశం’.

ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్య ఉండాలన్నదే తమ ఉద్దేశమని ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. సోమవారం  నిర్వహించిన విలేఖరుల సమావేళంలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎయిడెడ్‌ విద్యాసంస్థల్లో సంస్కరణల కోసం కమిటీ వేశామని తెలిపారు. ప్రభుత్వ పథకాలు, అమ్మఒడి అందిస్తున్నందున అధ్యయనం కోసం ప్రభుత్వం కమిటీ వేసిందపి, ఈ కమిటీ ప్రభుత్వానికి తన రిపొర్ట్‌ ఇచ్చిందని వెలల్లడించారు. స్వచ్చందంగా గ్రాంటు, కాలేజీలు, ఆస్తులు వదులుకోవడానికి ముందుకు వస్తే ఏం చెయ్యాలో ప్రభుత్వానికి  కమిటీ సూచనలు చేసిందన్నారు. యాజమాన్యాలు అప్పగిస్తే ప్రభుత్వమే నడిపేలా ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ యాజమాన్యమైన గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ని ఉపసంహరించుకుంటామన్నా అంగీకరిస్తాం. 93 శాతం ఎయిడెడ్  యాజమాన్యాలు పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగిస్తూ ఆమోదం తెలుపగా.. 5 నుంచి 7 యాజమాన్యాలు ఆస్తులు కూడా ఇవ్వడానికి ముందుకొచ్చారు. 89 శాతం జూనియర్ కాలేజీలు లెక్చరర్లను సరెండేర్ చేశారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిని ప్రభుత్వానికి రిపోర్ట్ చేయగా.. 2 వేల ఎయిడెడ్ పాఠశాలల్లో 1200 పైగా స్కూళ్ళు ప్రభుత్వానికి సిబ్బందిని అప్పగించింది.100 శాతం పాఠశాలలు ఆస్తులతో సహా మొత్తం ఏ ఒక్క స్కూలు కూడా మూతపడదు.

ఎవరైనా నడపలేకపోతే ప్రభుత్వ పాఠశాలలుగా మార్చి నడుపుతాం. కాంట్రాక్ట్ లెక్చరర్లు సమస్యలను గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం, వర్కింగ్ కమిటీని వేశాం.కాంట్రాక్ట్ లెక్చరర్లు కు ఉద్యోగ భద్రతకు చర్యలు చేపడతాం.ఖాళీలలో వీరిని ఉపయోగించే ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్టు లెక్చరర్లు ఎవ్వరు ఉద్యోగాలు పోతాయని ఆందోళన చెందాల్సిన పనిలేదు. గతంలో ప్రభుత్వం పూర్తిగా ప్రయివేటు విద్య వ్యాపారాన్ని ప్రోత్సహించింది. కానీ ఇప్పుడు ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నాం’ అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు.

https://youtu.be/6Cw7q4WRDEQ

error: Don\'t Copy!!!!