EBC-NESTHAM-eligibilities-guidelines-complete-details

EBC Nestham: అగ్రవర్ణపేదలకు సువర్ణావకాశం.. ఈ అర్హతలుంటే రూ.15వేలు.. ఇలా అప్లై చేసుకోండి..

EBC నేస్తం గైడ్ లైన్స్ 

EBC నేస్తానికి కావలసిన డాకుమెంట్స్.

1, వాలిడ్ ఆధార్ కార్డు.

2, రైస్ కార్డు.

3. ఆధార్ కు లింక్ ఐన మొబైల్ నెంబర్.

4. యాక్టీవ్ లో ఉన్న బ్యాంకు అకౌంట్ బుక్.

5. ఇన్కమ్ సిర్టిఫికెట్.

6. క్యాస్ట్ సిర్టిఫికెట్.

7. ఆధార్ అప్డేట్ హిస్టరీ (అవసరం కావచ్చు )   

పైన తెలిపిన డాకుమెంట్స్ అన్ని రెడీ చేసుకోవలెను.

29/09/2021 తేదీనాటికి 45 సంవత్సరాలు నిండి ఉండాలి.

29/09/2021 తేదీనాటికి 60 సంవత్సరాల లోపు ఉండాలి.

29/09/2021 తేదీనుండి 05/10/2021 వరకు అప్లై చేసుకోవచ్చు.

టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ నెలకు రూరల్ లో 10000,

అర్బన్ లో 12000 మించి ఉండకూడదు.

మగాని ఐతే 3 ఎకరములు. మెట్ట ఐతే 10 ఎకరములు, రెండుకలిపి 10 ఎకరాముల లోపు ఉండవలెను.

కుటుంబం లో  ప్రభుత్వ ఉద్యోగి ఉంటే అనర్హులు. సానిటరీ వారు ఉంటే వారికి మినహాయింపు కలదు.

నాలుగు చక్రముల వాహనం ఉండకూడదు. (వైట్ బోర్డ్ ).

ఇన్కమ్ టాక్స్ పెయర్ కుటుంబం లో ఉంటే అనర్హులు.

మున్సిపాలిటీ లలో సొంత ఇల్లు 750 చరపు అడుగుల ఇల్లు ఉంది ఇంటి పన్ను కడుతున్న వారు అనర్హులు.

EBC Nestham Scheme: అగ్రవర్ణపేదలకు ఆర్ధికసాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే

అగ్రవర్ణపేదలకు ఆర్ధికసాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ఈబీసీ నేస్తం పథకాన్ని (EBC Nestham Scheme) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలోని కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, వైశ్య ఇలా అగ్రవర్ణాలకు చెందిన పేదలకు వైఎస్ఆర్ చేయూత (YSR Cheyutha), కాపునేస్తం (Kapu Nestham Scheme) పథకాల మాదిరిగానే ఆర్ధిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ఇప్పటికే అర్హుల వివరాలను అంచనా వేసిన ప్రభుత్వం నిధుల లభ్యతపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో లబ్ధిదారుల అర్హతలు, దరఖాస్తు చేసుకునే విధానం, ప్రభుత్వానికి సమర్పించాల్సిన పత్రాల వివరాలను విడుదల చేసింది. గ్రామ వాలంటీర్, సచివాలయ స్థాయిలో దరఖాస్తులు చేయాలని సూచించింది.

1. పథకం పేరు : ఈబీసీ నేస్తం

2. ముఖ్య ఉద్దేశం : GO విడుదల అయిన రోజుకు 45 నుంచి 60 సంవత్సరాలు నిండిన ఈబీసీ [EBC] మహిళలకు వారి జీవన ప్రమాణాలు మెరుగు పరచటం కోసం ఆర్థిక సాయం అందించటం.

3. ఆర్థిక సాయం : సంవత్సరానికి 15000/- చెప్పున మూడు సంవత్సరాలుకు 45000/- రూపాయలు.

4. 2021-22 బడ్జెట్ : సంవత్సరానికి 670-605 కోట్లు అలా మూడు సంవత్సరాలు కు 1810-2011 కోట్లు.

5. అర్హతలు :

వైయస్సార్ చేయూత మరియు కాపు నేస్తం లో ముందుగా కవర్ అయినటువంటి ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీ మహిళలు అర్హులు కారు. కేవలం ఈబిసి మహిళలు మాత్రమే అర్హులు.

తప్పకుండా ఆధార్ కార్డ్ అనేది వారి పేరు మీద ఉండాలి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ బుక్కు కూడా వారి పేరు మీద ఉండాలి.

కుటుంబ ఆదాయం గ్రామాల్లో అయితే నెలకు 10,000 దాటకూడదు అదేవిధంగా పట్టణాలలో అయితే నెలకు 12000 దాటకూడదు.

ఈ కుటుంబం మొత్తానికి పల్లపు భూమి 3 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి లేదా పల్లపు భూమి మరియు మెట్ట భూమి రెండు కలిపి 10 ఎకరాల కన్నా తక్కువగా ఉండాలి.

కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి గాని పెన్షనర్ గాని ఉండకూడదు. (పారిశుద్ధ్య కార్మికులు అర్హులు.)

కుటుంబంలో ఎవరి పేరు మీద కూడా ఫోర్ వీలర్ ఉండకూడదు. (టాక్సీ ఆటో టాక్టర్ ఉంటే పర్లేదు)

కుటుంబంలో ఎవరూ కూడా ఇన్కమ్ టాక్స్ కడుతున్న వారు ఉండకూడదు.

మునిసిపాలిటీ లో ఉన్నటువంటి భూమి 750 స్క్వేర్ ఫీట్లు కన్నా తక్కువగా ఉండాలి.

వయసు : GO విడుదల అయిన రోజుకు 45 నుంచి 60 సంవత్సరాలు నిండిన ఈబీసీ మహిళలు అర్హులు.
డేట్ అఫ్ బర్త్ ప్రూఫ్ లు :
1. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ( డేట్ అఫ్ బర్త్ ఉంటేనే )
2. బర్త్ సర్టిఫికెట్ / 10వ తరగతి సర్టిఫికెట్
3.ఆధార్ కార్డ

6. అర్హుల ఎంపిక, ఆమోదం మరియు శాంక్షన్ ప్రాసెస్ :
i. సచివాలయ లో ఉన్నటువంటి వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సర్వే అనేది చేసి అర్హులను ఎంపిక చేస్తారు.

ii. ఎంపిక చేసేటప్పుడు అవసరం అయ్యే విషయాలు:

పేరు
ఆధార్ నంబర్
ఫోన్ నంబర్
కుటుంబ పెద్ద పేరు
కుటుంబ పెద్ద ఆధార్ కార్డు నంబర్
కుల ధ్రువీకరణ సర్టిఫికెట్
జనన ధ్రువీకరణ సర్టిఫికెట్
కుటుంబ మొత్తం ఆదాయం
బ్యాంకు అకౌంట్ పాసుబుక్ కాపీ
అకౌంట్ నెంబర్ / IFSC కోడ్ /బ్రాంచ్ పేరు
4 వీలర్ ఉంటే వెహికల్ నెంబర్
భూమి వివరాలు (పళ్ళము / మెట్ట )
మున్సిపాలిటీ ప్రాపర్టీ వివరాలు
గవర్నమెంట్ ఎంప్లొయ్/ పెన్సనర్ స్టేటస్

iii. గ్రామ వార్డు వాలంటీర్లు సర్వే చేసే ముందు అర్హత ప్రమాణాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

iv. వాలంటీర్లు సర్వే చేసిన తరువాత సచివాలయాల్లో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ గారు వాలిడేషన్ చేస్తారు. తరువాత సంబంధిత ఎంపీడీవో / మునిసిపల్ కమిషనర్ ప్రూఫ్ లను పరిశీలించి అప్లికేషన్లను స్క్రూటినీ చేసి BC కార్పొరేషన్ యొక్క ED వారికి ఫార్వర్డ్ చేస్తారు, వారు జిల్లా కలెక్టర్ వారికి ఫార్వర్డ్ చేస్తారు, అక్కడ వెరిఫికేషన్ చేసి అప్రూవల్ లిస్ట్ ను AP STATE Welfare and Development Corporation ఫైనల్ శాంక్షన్ చేసి అమౌంట్ బడ్జెట్ అనుగుణం గా వేస్తారు.

7. వెబ్ సైట్ : దీని పూర్తి ఆన్లైన్ ప్రాసెస్ అనేది సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గారి నవశకం లాగిన్ లో అవుతుంది.

అన్ని ప్రభుత్వ పధకాలకు అవసరమైన అప్లికేషన్ ఫారాలు CLICK HERE

error: Don\'t Copy!!!!