drug-2dg-how-it-is-work-on-vocid-19-karona-patients-details

DRDO Drug 2-DG: డీఆర్డీఓ తయారుచేసిన ఈ మందు… కరోనాపై బాగా పనిచేస్తోంది. దీనికి అనుమతి కూడా వచ్చేసింది.  ఇది ఎలా పనిచేస్తుంది .

DRDO Drug 2-DG: కరోనాకు వ్యాక్సిన్లే తప్ప మందులు ఇప్పటివరకూ లేవు. ఇప్పుడు వాటి ట్రయల్స్ జరుగుతున్నాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఓ పొడిని తయారుచేసింది. దీన్ని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని… భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అనుమతి ఇచ్చింది. DRDO చాలా పెద్దది కదా… అందులో… న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎలీడ్ సైన్సెస్ (INMAS) అనే సంస్థ ఒకటి ఉంది. అదే… ఓ ల్యాబులో ఈ పొడిని తయారుచేసింది. ఇందుకు హైదరాబాద్‌లని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సహకారం అందించింది. ఈ కొత్త మందు పేరు 2-DG (2-డియోక్సీ-D-గ్లూకోజ్). ఈ మందు ద్వారా కరోనా పేషెంట్లు త్వరగా రికవరీ అవుతున్నారు. అంతేకాదు… మెడికల్ ఆక్సిజన్‌పై ఆధారపడే సమయం కూడా తగ్గుతోంది. ఇలా ఇది మంచి ఫలితాలు ఇస్తోంది.

ఇది అన్ని మందుల లాంటిది కాదు. అసలు దీన్ని తయారుచేసిన విధానమే ప్రత్యేకంగా ఉంది. రిపోర్టుల ప్రకారం… ఈ పొడి… కరోనా పేషెంట్ల శరీరంలో కరోనా వల్ల దెబ్బతిన్న కణాలను గుర్తిస్తుంది. అక్కడ వైరస్‌కి ఎనర్జీ రాకుండా అడ్డుకుంటుంది. అందువల్ల వైరస్ నీరసించిపోతుంది. దాని వల్ల వైరస్ ఇక వృద్ధి చెందలేదు. అంతే… అక్కడితో కరోనా ఆగిపోతుంది. క్రమంగా వైరస్ నీరసించి చనిపోతుంటే… కరోనా నయం అయిపోతుంది. ఫలితంగా కణాలు తిరిగి రిపేర్ అయ్యి… బాగవుతాయి. పేషెంట్లు రికవరీ అయ్యి కోలుకుంటారు.

కరోనా లక్షణాలు స్వల్పంగా, తీవ్రంగా ఉన్న వారికి ఈ మందును ఇచ్చారు. రికవరీ ఎక్కువగానే ఉండొచ్చను అని అంచనా వేశారు. మూడో దశ తర్వాత… సైడ్ ఎఫెక్టులు రాకపోతే… అప్పుడు ఇది కరోనా పేషెంట్లకు బాగా ఉపయోగపడగలదని అంటున్నారు. ప్రస్తుతం వాడుతున్న యాంటీ వైరల్ డ్రగ్స్, యాంటీ బయోటిక్స్ వంటివి… పాడైన కణాలనే కాక… ఇతర కణాలపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఐతే… అందువల్ల కలిగే నష్టం కంటే… ప్రయోజనాలే ఎక్కువగా ఉంటున్నాయి. 2-DGని యాంటీవైరల్ డ్రగ్ అని అనలేం. ఎందుకంటే… ఇది వైరస్‌ని చంపదు. దానికి ఆహారం రాకుండా చేస్తుందంతే.

ప్రస్తుతానికి ఈ మందును మాత్ర (టాబ్లెట్)లా కాకుండా… పొడి రూపంలో ప్యాకెట్‌లో ఇస్తున్నారు. దీన్ని నీటిలో కలుపుకొని తాగుతున్నారు. ఇది వాడిన చాలా మందికి RT-PCR టెస్టుల్లో నెగెటివ్ వచ్చింది. అందుకే దీనికి DCGI అనుమతి ఇచ్చింది. మూడో ట్రయల్స్ తర్వాత… అంతా ఓకే అనుకుంటే… దీన్ని టాబ్లెట్లలా తయారుచేసే అవకాశాలు ఉన్నాయి.

May – October 2020. DRDO తో పాటు అనుబంధ సంస్థ అయిన DRL [Defence Reacerch Laboratory ] లు కలిసి క్షేత్ర స్థాయిలో పరీక్షలు చేయడం మొదలు పెట్టాయి. ఈ పరీక్షలు కోవిడ్ పేషంట్ కి ఎంత మోతాదు ఇవ్వాలి ఇచ్చిన తరువాత ఆ పేషంట్ ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనే అంశం మీద ట్రయల్స్ నిర్వహించాయి. అంటే ఇది డోస్ & సేఫ్టీ కోసం అన్నమాట. అయితే డ్రగ్ బాగా పనిచేసింది అలాగే ఎలాంటి సైడ్ ఎఫ్ఫెక్ట్స్ కనిపించలేదు పేషంట్ త్వరగానే కొలుకున్నాడు. తరువాత ఫేజ్ 2 a కోసం అనుమతి వచ్చింది. ఫేజ్ 2 a పరీక్షల కోసం భారత దేశంలోని 11 హాస్పిటల్స్ లో మొత్తం 110 మంది కోవిడ్ పేషంట్ల మీద పరీక్షలు నిర్వహించారు అన్నీ కేసులు విజేయవంతంగా ముగిశాయి. 
ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ : November 2020-March 2021  లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కోసం అనుమతి వచ్చింది. ఈ సారి ఢిల్లీ , ఉత్తర ప్రదేశ్ , వెస్ట్ బెంగాల్ , గుజరాత్ , మహారాష్ట్ర,తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్ , తమిళనాడు,కర్ణాటక రాష్ట్రాలలో 220 మంది కరోనా రోగుల మీద పరీక్షలు నిర్వహించారు. అన్నీ కేసుల్లో కూడా ఉత్తమ ఫలితాలు వచ్చాయి. 
మొత్తం మూడు దశల క్లినికల్ ట్రయల్స్ వాటి డాటా ని విశ్లేషించిన తరువాత ఈ రోజు అత్యవసరంగా అవసరం అయితే వాడడానికి అనుమతి లభించింది  
యాంటీ కోవిడ్ డ్రగ్ 2-deoxy-D-glucose (2-DG) కి. 
So! మన స్వంత వాక్సిన్ తో పాటు అత్యవసర పరిస్థితుల్లో వాడడానికి ఒక డ్రగ్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పటివరకు అవసరార్ధం కోసం రెమిడిసివర్ ని వాడుతూ వచ్చారు ఇక ఆ డ్రగ్ అవసరం ఉండదు. దూరాశతో బ్లాక్ చేసిపెట్టుకున్న అక్రమదారులకి ఇది చేదు వార్త ! 
అలాగే ముందుగా ఆక్సిజెన్ కాన్సంట్రేట్ లు,ఆక్సిజెన్ సిలిండర్ లు బ్లాక్ చేసిపెట్టుకున్న వాళ్ళకి కూడా ఇది చేదు వార్త. ఈ రోజు నుండి హాస్పిటల్ వరకు వెళ్లక్కర లేకుండా డాక్టర్ పర్యవేక్షణలో యాంటీ కోవిడ్ డ్రగ్ 2-deoxy-D-glucose (2-DG) ని వాడి ప్రమాదం లేకుండా బయటపడవచ్చు. వెంటీలేటర్ల అవసరం కూడా పెద్దగా రాదు.

కరోనా చికిత్స కోసం 2-డీజీ ఔషధం తీసుకువచ్చిన డీఆర్డీవో… కేంద్రం గ్రీన్ సిగ్నల్

అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి 2-డీజీ వాడకంతో వేగంగా కోలుకుంటున్న కరోనా రోగులు తగ్గుతున్న ఆక్సిజన్ అవసరం వివరాలు వెల్లడించిన డీఆర్డీవో

DRDO develops new drug to use in corona treatment

భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనా చికిత్స కోసం ఓ సరికొత్త ఔషధాన్ని తీసుకువచ్చింది. దీని పేరు 2 డీఆక్సీ డి గ్లూకోజ్… సంక్షిప్తంగా 2-డీజీ అంటారు. 2-డీజీ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. ఈ ఔషధాన్ని డీఆర్డీవోకు చెందిన ఓ ప్రయోగశాల, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అల్లైడ్ సైన్సెస్ (ఇన్మాస్), డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
ఈ ఔషధాన్ని వాడిన కరోనా రోగులు వేగంగా కోలుకుంటున్నట్టు క్లినికల్ ట్రయల్స్ నిరూపించినట్టు వెల్లడైంది. 2-డీజీ ఔషధాన్ని తీసుకున్న రోగులకు ఆక్సిజన్ పై ఆధారపడాల్సిన అవసరం రాలేదని గుర్తించారు. ఈ ఔషధంతో చికిత్స పొందిన కరోనా రోగుల్లో చాలామందికి స్వల్పకాలంలోనే ఆర్టీ-పీసీఆర్ టెస్టులో నెగెటివ్ వస్తోందని డీఆర్డీవో వెల్లడించింది. వైరస్ పెరుగుదలను ఇది కట్టడి చేస్తోందని తెలిపింది.
 లాక్ డౌన్ ఉన్నా శాస్త్రవేత్తలు నిరంతరం పరీక్షలు చేసుకుంటూ వెళ్లడమే యాంటీ కోవిడ్ డ్రగ్ 2-deoxy-D-glucose (2-DG) బయటికి వచ్చింది. 
DRDO, INMAS, CCMB శాస్త్రవేత్తలకి అభినందనలు మరియు ప్రాణామములు.
error: Don\'t Copy!!!!