Direct Recruitment-Permission-to-the-APPSC-for-issue-of-Notifications-1180-posts

ఏపీపీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అనుమతి*

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేరుగా నియా మకాల కోసం పాలనా అనుమతులు మంజురు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈబీసీ రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.

రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,180 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ గురువారం జీవో 49 విడుదల చేసింది. ఏపీపీఎస్సీ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు 1,180 పోస్టుల భర్తీకి ఆమోదం కోరుతూ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటితో పాటు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈబీసీ) 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయాలని కోరారు. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేందుకు గాను ఏపీపీఎస్సీకి అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఆయుష్ విభాగంలో యునాని మెడికల్ ఆఫీసర్లు 26,

హోమియో పతిలో 53 మంది,

ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్ పోస్టులు 72,

హోమియోపతి అధ్యాపకులు 24,

డాక్టర్ఎన్ఆర్ఎస్, జీఎసీ పరిధిలో మరో 3,

జూనియర్ అసిస్టెం ట్ – కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు (రెవెన్యూ డిపార్ట్ మెంట్) 670,

వివిధ విభాగా ల్లో 190 అసిస్టెంట్ ఇంజనీర్లు,

దేవాదాయశాఖ పరిధిలో గ్రేడ్-3 ఈఓపోస్టులు 60,

హార్టీకల్చర్ అధికారుల పోస్టులు 39,

ఏపీ సచివాలయంలో తెలుగు రిపోర్టర్లు 5,

జిల్లా పౌరసంబంధాలు, సమాచారశాఖ అధికారులు 4,

ఏపీ లెజిస్లేచర్ సెక్రటేరి యట్లో ఇంగ్లీష్ రిపోర్టర్లు 10,

ఏపీఆర్ఈఐ సొసైటీ జూనియర్ అధ్యాపకులు 10,

డిగ్రీ కళాశాల అధ్యాపకులు 5,

ఏపీ ఫారెస్ట్ సర్వీసెస్ పరిధిలో 9 అసిస్టెంట్ కన్సర్వే టర్ పోస్టులతో కలిపి మొత్తం 1180 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కానుంది.

FOR MORE DETAILS G.O.Ms.NO.49 CLICK HERE

error: Don\'t Copy!!!!