Dearness-allowance-new-D.A-@5.24%-to-ap-employees-teachers-details

కొత్త DA విడుదల ఆమోదం

ప్రభుత్వం గతంలో  షెడ్యుల్  ప్రకటించినట్లుగా జనవరి నుంచి ఒక DA ఇవాలనే ప్రాతిపదనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ రోజు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

మీ పేరుతో కొత్త DA ఏరియర్స్ వర్కషీట్ ను క్రింది web page లో తయారుచేసుకోవచ్చు.

 మీ పేరు, ఇప్పటి బేసిక్ పే , ఎంటర్ చేస్తే చాలు 3 installments లలో ఎంతెంత ఏరియర్స్ రావాలో నెలవారీ వర్కషీట్ తయారు అయిపోతుంది.

D.A ARREARS FROM JULY 2019 TO DECEMBER 2021 CLICK HERE

మీ BASIC PAY ENTER చేసి మీకు వచ్చే DA ఎరియర్స్ తెలుసుకోవచ్చు CLICK HERE

DA Go 99 dt 20/12/2021 rlsd 

DA enhanced from 1/7/2019

DA enhanced from 33.536% to 38.776%(5.24%)

Cash from Jan/2022

Arrears from 1/7/2019 to 31/12/2021 adjusted to PF in three equal installments from Jan/2022(For CPS employees paid in cash in 3 installments)

Who retired/retire from 1/7/2019 to 30/6/2022 shall be paid in cash

DA arrears from 1/7/2019 to 31/12/2021 (30 months)  adjusted to PF in 3 installments months:*

1st installment 1/7/2019 to 4/2020(10 months)

 2nd installment: from 5/2020 to 2/2021(10months)

3rd installment from 3/2021 to 12/2021(10months)

నూతన DA (5.24 %) ఉత్తర్వుల సారాంశం*

జనవరి-2022 నెల జీతాలతో అనగా ఫిబ్రవరి 1వ తేదీన తీసుకునే జీతాల నుంచి పెరిగిన DA (5.24 %) చెల్లించు విధముగా ఆదేశాలు జారీ.*

PF ఉద్యోగులకు:   01-జూలై-2019 నుంచి 31-డిసెంబర్-2021 వరకు చెల్లించాల్సిన 30 నెలల DA ఎరియర్స్ నగదు జనవరి-2022 నుండి 3 సమాన వాయిదాలలో ZPPF అకౌంట్ కు జమకాబడును.

CPS ఉద్యోగులకు:  01-జూలై-2019 నుంచి 31-డిసెంబర్-2021 వరకు చెల్లించాల్సిన 30 నెలల DA ఎరియర్స్ నగదు (90 %) జనవరి-2022 నుండి 3 సమాన వాయిదాలలో చెల్లించబడును. మిగిలిన 10 % PRAN ఖాతాకు  జమకాబడును.

పదవీవిరమణ ఉద్యోగులకు: 01-జూలై-2019 నుంచి 30-జూన్-2022 మధ్య కాలంలో పదవీవిరమణ చేసిన ఉద్యోగులకు ఎరియర్స్ నగదు ZPPF ఖాతాకు జమ కాకుండా, నగదు రూపంలో చెల్లించబడును.

ఉద్యోగులకు శుభవార్త

5.24 శాతం కరువు భత్యం మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు*

2019 జులై నుంచి చెల్లించాల్సిన మొత్తం మంజూరు

పెరిగిన డీఏ వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1న వేతనాలతో చెల్లింపు

2019 జులై నుంచి 2021 డిసెంబర్‌ వరకు బకాయిలు వచ్చే ఏడాది జనవరి నుంచి 3 వాయిదాల్లో జీపీఎఫ్‌కు జమ

సీపీఎస్‌ ఉద్యోగులకు బకాయిలు వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు వాయిదాల్లో నగదు రూపంలో చెల్లింపు

గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌ సంక్షోభంలోనూ శుభవార్త అందించింది. జులై 2019 నుంచి చెల్లించాల్సిన కరువు భత్యాన్ని (డీఏ) మంజూరు చేసింది. ఉద్యోగుల మూల వేతనంలో ప్రస్తుతమున్న 33.536 శాతం నుంచి 38.776 శాతానికి (5.24) కరువు భత్యం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

►2019 జులై నుంచి 2021 డిసెంబర్‌ వరకు కరువు భత్యం బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమచేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు.

► పెరిగిన కరువు భత్యాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాలతో చెల్లిస్తారు.

► అలాగే, సీపీఎస్‌ ఉద్యోగులకు పెరిగిన డీఏని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాల నుంచి చెల్లిస్తారు.

► సీపీఎస్‌ ఉద్యోగులకు 2019 జులై నుంచి 2021 డిసెంబర్‌ వరకు డీఏ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో నగదు రూపంలో చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎవరెవరికి వర్తిస్తుందంటే..*

పెరిగిన కరువు భత్యం జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, జిల్లా గ్రంధాలయాల సమితి, రెగ్యులర్‌ స్కేల్స్‌లో పనిచేస్తున్న వర్క్‌ చార్జ్‌డ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఉద్యోగులకు వర్తించనుంది. అంతేకాక.. రెగ్యులర్‌ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న ఎయిడెడ్‌ ఇనిస్టిట్యూషన్స్, ఎయిడెడ్‌ పాలిటెక్నిక్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు వర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలతో పాటు వ్యవసాయ యూనివర్శిటీ.. జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన యూనివర్శిటీలో రెగ్యులర్‌ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందికీ పెరిగిన కరువు భత్యం వర్తించనుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉద్యోగుల డీఏకు సొంత నిధులను వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

FOR MORE DETAILS D.A G.O COPY CLICK HERE

NEW D.A TABLE CLICK HERE

D.A CALICULATOR IN ONLINE CLICK HERE

error: Don\'t Copy!!!!