Currency Note Press Recruitment-JOBS-149-details

Currency Note Press Recruitment: కరెన్సీ నోట్‌ ప్రెస్, నాసిక్‌లో 149 పోస్టులు.. నెలకు రూ.1 లక్ష వ‌ర‌కు వేతనం

సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కి చెందిన నాసిక్‌ రోడ్‌లోని కరెన్సీ నోట్‌ ప్రెస్‌(సీఎన్‌పీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 149
పోస్టుల వివరాలు: వెల్ఫేర్‌ ఆఫీసర్‌–01, సూపర్‌వైజర్లు–16,సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌–01, జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్లు–06, జూనియర్‌ టెక్నీషియన్లు–125.

వెల్ఫేర్‌ ఆఫీసర్‌:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 
వేతనం: నెలకు రూ.29,740 నుంచి రూ. 1,03,000 వరకు చెల్లిస్తారు.

సూపర్‌వైజర్లు: 
విభాగాలు: టెక్నికల్‌–కంట్రోల్, టెక్నికల్‌–ఆపరేషన్, అఫీషియల్‌ లాంగ్వేజ్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 18ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం: నెలకు రూ.27,600 నుంచి రూ.95,910 వరకు చెల్లిస్తారు.

సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌:
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్, స్టెనోగ్రఫీ(ఇంగ్లిష్‌/హిందీ) ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.23,910 నుంచి రూ.85,570 చెల్లిస్తారు.

జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్లు:
అర్హత: 55 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తో పాటు టైపింగ్‌ స్పీడ్‌ ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.21,540 నుంచి రూ.77,160 చెల్లిస్తారు.

జూనియర్‌ టెక్నీషియన్లు: 
విభాగాలు: ప్రింటింగ్‌/కంట్రోల్, వర్క్‌షాప్‌.
అర్హత: ప్రింటింగ్, మెకానికల్, ఎయిర్‌ కండిషనింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌ ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు  రూ.18,780 నుంచి రూ.67,390 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్, స్టెనోగ్రఫీ/టైపింగ్‌ స్పీడ్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 25.01.2022

వెబ్‌సైట్‌: https://cnpnashik.spmcil.com

NOTIFICATION CLICK HERE

Recruitment of various posts in CNP, Nashik CLICK HERE

error: Don\'t Copy!!!!