CSIR innovation Award for School Children -2021-details-registration-link

ప్రఖ్యాత  భారత ప్రభుత్వ పరిశోధనా సంస్థ అయిన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) వారు  పాఠశాల విద్యార్థులలో శాస్త్రీయ వైఖరిని ప్రేరేపిస్తూ , మేధో సంపత్తిని సృష్టించే లక్ష్యంతో , పిల్లలను నూతన ఆవిష్కరణల దిశగా ప్రోత్సహించడానికి “ ఇన్నోవేషన్ అవార్డ్ “ ను ఇస్తోంది . 

18 సంవత్సరాల వయస్సు లోపు విద్యార్థులందరు ఈ అవకాశాన్ని వినియోగించుకొని సృజనాత్మక ఆలోచనలతో చక్కటి ప్రతిపాదనలను పంపి నగదు బహుమతితో కూడిన అవార్డును సాధిo చాలి.

మార్గ దర్శకాలు :

పాఠశాల స్థాయి నుంచి ఇంటర్ వరకు చదువుచున్న విద్యార్థులందరు అర్హులు .

విద్యార్థులకు 18 సంవత్సరాల లోపు వయస్సు వుండాలి ( 2021 జనవరి 1 తేదీ నాటికి)

ఏదైనా క్రొత్త భావన లేదా ఆలోచన లేదా రూపకల్పన లేదా ఇప్పటికే ఉన్న సమస్యలకు పరిష్కారo చూపడం గురించి ప్రతిపాదన పంపాలి 

సమర్పించిన ప్రతిపాదనలు నవీన భావన/ ఆలోచనలై  , పూర్తిగా ప్రయోజనకరమైనవిగా  ఉండాలి. 

ప్రతిపాదనలలో వ్యక్తం చేస్తున్న భావన తప్పకుండా ఒక నమూనా ద్వారా లేదా ప్రయోగాత్మక డేటా లేదా  డిజైన్ ద్వారా నిరూపించబడాలి.

ప్రతిపాదన రూపకల్పనలో ఉపాధ్యాయులు / తల్లిదండ్రులు / స్నేహితులు లేదా ఇతరులు నుంచి సహాయం / మార్గదర్శకత్వం పొందినట్లయితే వారి వివరాలు తప్పనిసరిగా ఉండాలి

 ప్రతిపాదన  ఇంగ్లీష్ / హిందీలో భాషలో 5000 పదాలకు మించకుండా రూపొందించాలి .

 ప్రతిపాదన టైటిల్ , విద్యార్థి పేరు , పుట్టినతేది , ఫోన్ నంబరు , మెయిల్ ఐడి , పాఠశాల అడ్రస్  & నివాస ప్రాంత అడ్రస్  వివరాలు తప్పనిసరిగా పొందుపరచాలి .  

విద్యార్థి చదువుచున్న పాఠశాల లేదా కళాశాల ప్రిన్సిపాల్ ద్వారా ధృవీకరణ పత్రం(ముద్ర మరియు తేదీ కలిగి) విధిగా జతచేయాలి లేదా ప్రిన్సిపాల్ ద్వారా ప్రతిపాదనలను ఫార్వర్డ్ చేయాలి . 

ప్రతిపాదన సాఫ్ట్ కాపీని   ciasc.ipu@niscair.res.in కు  మెయిల్ చేయాలి . 

హార్డ్ కాపీను 

Head,

CSIR – Innovation Protection Unit. 

NISCAIR Building, 

14 Satsang Vihar Marg, 

Special Institutional Area, 

New Delhi – 110067 అడ్రస్ కు రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపాలి.

ప్రతిపాదన పంపుటకు చివరి తేది. 31-05-2021 

బహుమతులు మొత్తం 15 

మొదటి బహుమతి –  1 లక్ష రూపాయలు 

రెండవ బహుమతి –   50,000 రూపాయలు ( ఇద్దరకి )

మూడవ బహుమతి – 30,000 రూపాయలు ( ముగ్గురకు )

నాల్గవ బహుమతి  –    20,000 రూపాయలు ( నలుగురకు )

ఐదవ బహుమతి –     10,000 రూపాయలు ( ఐదు మందికి ) 

AP CSE PROCEEDINGS ABOUT CSIR AWARDS CLICK HERE

CSIR MAIN WEBSITE CLICK HERE

error: Don\'t Copy!!!!