complete-information-about-family-pension-rules

ఫ్యామిలీ పెన్షన్ గురించి ముఖ్య సమాచారం* FAMILY PENSION

 *ఉద్యోగి సర్వీసులో ఉంటూ గానీ, పదవీ విరమణ చేసి పెన్షన్ పొందుతూగానీ మరణించినచో ఆ ఉద్యోగి/పెన్షనర్  కుటుంబము నకు Revised Pension Rules 1980, రూల్ 50 ప్రకారం ఆ కుటుంబ జీవనాధారం నిమిత్తం కుటుంబ పెన్షన్ ( ఫ్యామిలీ పెన్షన్) చెల్లిస్తారు.*

 

 _*ఉద్యోగి సుదీర్గ కాలంం ప్రభుత్వ ఉద్యోగం చేసి ఏకారణంతో నైన పదవీ విరమణ చేసిన అనంతరం  కుటుంబపోషణకు గాను ప్రభుత్వం నుండి నెలవారీ పెన్షన్ పొందే సౌకర్యం ఉంది. 

దీనినే సర్వీసు పెన్షన్ అంటాం .

ఒకవేళ పెన్షన్ పొందుతూ పెన్షనర్  /ఉద్యోగం చేస్తూ ఉద్యోగి మరణిస్తే  వారికుటుంబ పోషణ నిమిత్తం అర్హులైన వారికి ఇచ్చే పెన్షన్ నే కుటుంబ పెన్షన్ అని అంటాం. కెకెవి*_ 

 

 _సర్వీసులో ఉన్న ప్రతీ ఉద్యోగి తమ  కుటుంబ సభ్యుల వివరాలను తమ డిడివో లకు నిర్ణీత ప్రొఫార్మాలో ఇచ్చి సేవా పుస్తకంలో నమోదు  చేయించుకోవాలి._ 

 *రిటైర్ అయిన తరువాత కూడా ఈ వివరాలుఉపయోగ పడతాయి.వీటి ఆధారంగా మరియు పింఛనుదారు పెన్షన్ ప్రపోజల్స్ పంపు సమయం లో డిడివో లు కుటుంబ పెన్షన్ దారుల వివరాలుదృవీకరించి పంపగా మన పెన్షన్ మంజూరు (PPO) ఉత్తర్వులలో AG గారు కుటుంబ పెన్షన్ దారు వారికి అర్హతకల చెల్లించదగు పెన్షన్  నిర్ణయించి ఉత్తర్వులలో పొందు పరుస్తారు.* 

 

 *ఒకవేళ ఫేమలీ పెన్షన్ కు అర్హత గల కుటుంబ సభ్యుల వివరాలను పెన్షన్ ప్రతిపాధన లతో పంపకపోయినా / రిటైర్ అయిన అనంతరం పిల్లలు శారీరక, మానసిక వైకల్యాలకు గురైనా,రిటైర్ అయి చట్టబద్దంగా వివాహం చేసుకొని పిల్లలు కలిగిన అట్టి వివరాలను  Rule 50(II)(a)(i)(2) of Revised Pension Rules 1980 and Ruling 3 under Rule4 of family pension rules 1964 ననుసరించి,ఫారంF లో పొందుపరచి సంబందిత STO గారికి అందించి PPOలో నమోదు చేసుకొనే అవకాశం ఉంది.

 

 *Rule 50(12) of Revised Pension Rules 1980 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు GOMS No 315 dt 7/10/2010 ప్రకారం కుటుంబ పెన్షన్ పొందుటకు కుంబ సభ్యులుగా ఈ క్రింది వారు వస్తారని పొందు పరచడం జరిగింది.* 

ఉద్యోగి/పెన్షనర్ భార్య/ భర్త.

లీగల్లీ సెపరేటెడ్ స్పవ్జు

కుమారులు

కుమార్తెలు

శరీరక మానసిక వికలాంగులైన పిల్లలు

విడాకులు పొందిన కూతురు

విధవరాలైన కుమార్తె

పైన పేర్కొన్న వారెవరూ లేక పోతే తల్లి దండ్రులు.

FAMILY PENSION

కుటుంబ పెన్షన్ ఎంత చెల్లిస్తారు?

 *ఉద్యోగి సర్విసులో ఉండి మరణిస్తే కుటుంబ పెన్షన్  మొదటి 7 సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి  65 సంవత్సరాలు నిండే వరకు ఏది ముందయితే అంతవరకు చివరి నెల జీతంలో 50% పెన్షన్ గా చెల్లిస్తారు.తదుపరి చివరినెల జీతంలో 30% పెన్షన్ గా చెల్లిస్తారు.* 

 

 *పెన్షనరుగా ఉండి మరణిస్తే చివరి నెల జీతంలో 50% లేదా ప్రస్తుత పెన్షన్ ఏది తక్కువైతే అది,పదవీ విరమణ తేది నుండి 7 సంవత్సరాల కాలము లేదా ఉద్యోగికి 65 సంవత్సరాల వయస్సు పూర్తి అయ్యే తేది వరకూ ఏది ముందు అయితే ఆ తేది వరకు చెల్లించబడును. తదుపరి పెన్షన్ లో 30% పెన్షన్ గా చెల్లిస్తారు.* 

 

 *పెన్షనర్ల విషయంలో వారి  పెన్షన్  AG నుండి మంజూరు సమయంలో PPO లో Family Pension Beneficiary పేరు ,Enhanced Family pension (మొదటి 7 సంవత్సరాల వరకు లేదా ఆ ఉద్యోగికి  65సంవత్సరాలువరకూ) ఆ తరువాత నుండి జీవితాంతం వరకూ Family Pension (30%) వివరాలు కూడా నోట్ చేయబడి ఉంటాయి.* 

 

 *పెన్షనర్ రిటైరైన తదుపరి చట్టబద్ధంగా వివాహం చేసుకున్నచో పెన్షనర్ భార్య/భర్తకు వారికి కలిగిన సంతానానికి కూడా కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు* .

 

 *రికార్డులు లభ్యం కాకపోయినా ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాల్సి ఉంటుంది.* 

 

 *అదృశ్యమైన, ఆచూకి తెలియని ఉద్యోగుల కుటుంబాలకు సంవత్సరం తరువాత కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు.* 

 

 *సంపాదనా పరులు కాని అంగవికలురైన పిల్లలకు కూడా కుటుంబ పెన్షన్ వర్తిస్తుంది.* 

 

 *పెన్షనర్ చనిపోయిన రోజునకు కూడా పెన్షన్ చెల్లిస్తారు. ఆ మరుసటి రోజు నుండి కుటుంబ పెన్షన్ చెల్లిస్తారు* .

 

కుటుంబ పెన్షన్ పై D.R చెల్లిస్తారు.

 

 *కుటుంబ పెన్షన్ దారులుకూడా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందే అవకాశం ఉంది.* 

 

 *Rule 50{(5)(I) ప్రకారం ఫ్యామిలీ పెన్షనర్ పునర్వివాహం చేసుకుంటే, ఫ్యామిలీ పెన్షన్ రద్దవుతుంది* .

 

 *కనీసం 7 సంవత్సరాల సర్వీసు కలిగి ఉంటేనే 50% ఎన్ హన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు కాబడుతుంది. 7 సంవత్సరాల లోపు సర్వీసు కలిగిన వారికి 30% నార్మల్ ఫ్యామిలీ పెన్షన్ మాత్రమే చెల్లిస్తారు.* 

 

 *Rule 50(6)(A)(1) ప్రకారం వితంతువులు ఉంటే వారికి కుటుంబ పెన్షన్ చెల్లించాల్సి వస్తే వితంతువు లందరికి సమానవాటాలు చెల్లిస్తారు* .

 

 *Rule 50(6)(B) ప్రకారం ప్యామిలి పెన్షనర్ గా ఉన్న మొదటి భార్య చనిపోతే వారి పిల్లలుకు , రెండవ భార్యతో పాటు కుటుంబ పెన్షన్ కు అర్హులు.* 

 

 *Rule 50(12)(B)(I) &G.O.Ms.No. 335 F&P తేది:15.9.1993 ప్రకారం రిటైరైన ప్రభుత్వ ఉద్యోగి చట్టప్రకారం పెళ్ళి చేసుకుంటే  ఆ మహిళ కూడా ఫ్యామిలీ పెన్షన్ కు అర్హురాలే* .

 

 *Rule 50(10)(b)(c) & G.O.Ms.No.245 F&P తేది:4.9.2012 ప్రకారం ఒకవ్యక్తి రెండు ఫ్యామిలీ పెన్షన్లు పొందు సందర్భంలో రెండిటి మొత్తం రూ.27,830 కు పరిమితం చేయబడును.* 

 

 *Rule 50(12)(b) Note 2(III) & G.O.Ms.No.236 F&P తేది:28.5.1994 ప్రకారం రిటర్మెంట్ తదుపరి  కలిగిన సంతానం కూడా ఫ్యామిలీ పెన్షన్ కు అర్హత కలిగి ఉంటారు.* 

 

 *Cir.Memo.No.4027/B/26/pension-I/87 Fin తేది:20.8.1991 ప్రకారం మొదటి భార్య బ్రతికి ఉండగా ప్రభుత్వ అనుమతి లేకుండా మరో పెళ్ళి చేసుకుంటే, రెండవ భార్య కుటుంబ పెన్షనుకు అర్హురాలు కాదు.* 

 

 *G.O.Ms.No.20 F&P తేది:24.1.1981 ప్రకారం విడాకులు పొందినప్పటికీ , విడిగా ఉంటున్నప్పటికీ భార్య, పిల్లలు కుటుంబ పెన్షన్ లో వాటకు అర్హులే.* 

 

 *ప్రభుత్వోద్యోగుల కుటుంబ పెన్షన్‌ నిబంధనలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 2019 నవంబర్‌ 25న తెచ్చిన జీవో 152ని ఇటీవల హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోను రాజ్యాంగ విరుద్ధంగా తేల్చింది. చట్టం ద్వారా తెచ్చిన నిబంధనలను కార్య నిర్వాహక ఉత్తర్వులు భర్తీ చేయజాలవని హైకోర్టు స్పష్టం చేసింది. 1980లో  ఏపీ రివైజ్డ్‌ పెన్షన్‌ రూల్స్‌ చట్టబద్ధమైనవని, ఇందులో వితంతు, విడాకులు తీసుకున్న కుమార్తెలు పెన్షన్‌ పొందే విషయంలో ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ నిబంధనలను కార్య నిర్వాహక ఉత్తర్వుల ద్వారా మార్చడానికి వీల్లేదని పేర్కొంది.* 

 

 *పదవీ విరమణ తరువాత ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆ ఉద్యోగి వితంతు కుమార్తె, విడాకులు తీసుకున్న కుమార్తె కుటుంబ పెన్షన్‌ పొందేందుకు అనర్హులుగా చేయడం సరికాదంది. వారు కూడా కుటుంబ పెన్షన్‌ పొందేందుకు అర్హులని తేల్చి చెప్పింది.* 

 

 *పెన్షన్‌ పొందడం జీవనోపాధి హక్కుతో పాటు జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పిందని హైకోర్టు గుర్తు చేసింది

ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంటే ఫుల్ పెన్షన్ కు ఎలిజిబిలిటీ ఉంటుంది? ఏయే బెనిఫిట్స్ వర్తిస్తాయి?*

జ:- 20 సంవత్సరాల సర్వీసు నిండిన ఉద్యోగి యొక్క కోరిక ప్రకారం రిటైర్ అగుటకు అనుమతించబడును.

( G.O (P) No. 88, Finance and Planning (Finance Wing) P.N.C. Dept, Date: 26-01-1980) రూల్ : 42,43

*పెన్షన్ కమ్యూటేషన్:*

వాలెంటరీ రిటైర్మెంటు పొందిన ఉపాధ్యాయుడు తన పెన్షన్ లో 40% అమ్ముకోవచ్చును. దీనినే పెన్షన్ కమ్యూటేషన్ అంటారు.

G.O.m.s.No: 158, Finance and Planning ; Date: 16-09-1999 )

గమనిక:- రిటైరైన సంవత్సరంలోగా సంబంధిత అధికారిగారికి దరఖాస్తు చేసుకోవాలి. సంవత్సరం దాటితే మెడికల్ టెస్టులు, అనేక వివరాలతో జాప్యం జరుగుతుంది

పెన్షన్

పదవీ విరమణ చేయునాటికి 10 సంవత్సరములు అంతకంటే ఎక్కువ సర్వీసు చేసిన వారికి పెన్షన్ ఇస్తారు.

పెన్షన్ లెక్కించు విధానము:-

*చివరి నెల వేతనం× అర్థ సం„యూనిట్లు × 1/2 × 1/66 సూత్రం ప్రకారం లెక్కిస్తారు

20 సంవత్సరాలకు వాలెంటరీ రిటైర్మెంటు కోరితే 5సంవత్సరాల వెయిటేజిని కలిపి సర్వీస్ కాలమునకు కలిపి పెన్షన్ నిర్ణయిస్తారు.

*కుటుంబ పెన్షన్ వివరాలు*

*రిటైర్మెంట్ గ్రాట్యుటీ*

*మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్:*

5 ఇయర్స్ ఫైనాన్షియల్ బెనిఫిట్: క్వాలిఫైయింగ్ సర్వీస్ పొడవు ఆధారంగా. సుమారు మొత్తం Rs.12.00 లక్షల .

*డెత్ గ్రాట్యుటీ*

0-1 సంవత్సరాలు సేవ: 6 టైమ్స్/ 4 (చెల్లింపు రోజు)

1-5 సంవత్సరాల సేవ: 18 సార్లు / 4 (పే,డీఏ )

5-18 సంవత్సరాల సర్వీస్: 36 సార్లు 4 (పే-డే) > 18 సంవత్సరాల సేవ: 38

/4 (చెల్లించాల్సిన రోజు)

మాక్సిమం మొత్తం: Rs.12.00 లక్షల. కుటుంబ పింఛను ఉద్యోగి / పెన్షనర్ యొక్క కుటుంబ సభ్యులకు ఇవ్వబడుతుంది.

*పెన్షన్ రకాలు*

*1. పెంపొందించిన కుటుంబ పెన్షన్ :-*

మిని క్వాలిఫైయింగ్ సర్వీస్:

ఏడు సంవత్సరాలు కంటే ఎక్కువ ఏడు సంవత్సరాల కాలానికి 50% చివరి చెల్లింపు మరియు ఏడు సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలుగా చెల్లింపులు.

*2.  కుటుంబ పెన్షన్: -మినిమం క్వాలిఫైయింగ్ సర్వీస్:*

 ఒక సంవత్సరం నుండి 7 సంవత్సరాల. పెంచిన కుటుంబ పెన్షన్ ముగిసిన తరువాత, కుటుంబ పింఛను ఇవ్వబడుతుంది. మొత్తం చెల్లింపు మరియు అనుమతుల యొక్క 30%

*3. అదనపు సాధారణ కుటుంబ పెన్షన్:-*

 అతని / ఆమె విధులను నిర్వర్తిస్తున్నప్పుడు మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అతని పింఛను ఇవ్వబడుతుంది,

*FAMILY PENSION*

 సర్వీస్ లో ఉండి గానీ, రిటైర్ ఐన తరువాత గానీ ఉద్యోగి మరణించిన ,అతని భార్య కు ఇచ్చే పెన్షన్ ను ఫ్యామిలీ పెన్షన్ అంటారు .

 7ఇయర్స్ సర్వీస్ లోపు చనిపోతే, భార్యకు పే లో 30% ఫ్యామిలీ పెన్షన్ గా ఇస్తారు.

 7ఇయర్స్ సర్వీస్ పైన చేసి రిటైర్మెంట్ లోపు చనిపోతే రెండు రకాలుగా భార్యకు ఫ్యామిలీ పెన్షన్ చెల్లిస్తారు.

a) మొదటి 7 ఇయర్స్ కి 50%

b) 7 ఇయర్స్ తరువాత నుండి 30%.

 EXample 1:

ఓక ఉద్యోగి సర్వీస్ లో ఉండగా మరణించెను.అప్పటికి అయన సర్వీస్ 3y 6m. అపుడు ఆతని పే 7740 ఐన, భార్య కు వచ్చే ఫ్యామిలీ పెన్షన్

 ➡ 7740×30/100 =2322.00

ఇది భార్య కు జీవితాంతం ఇస్తారు.

 Example 2:

 ఉద్యోగి మరణించే నాటికి చేసిన సర్వీస్ 8y 4m. అపుడు పే 11530.ఐన, అతని భార్య కు మొదటి 7ఇయర్స్ వచ్చే ఫ్యామిలీ పెన్షన్

11530×50/100=5765.00.

 7 ఇయర్స్ తరువాత నుండి జీవితాంతం వచ్చే ఫ్యామిలీ పెన్షన్ 11530×30/100 = 3459.00

*CPS ఖాతాదారుడు తన ఖాతా నుండి డబ్బు ను తిరిగి పొందు విధానం (ఉపసంహరణ విధానం)*

రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఎస్.నెం-62 . తేది=07/03/2014 ఉత్తర్వుల ద్వారా ఖాతా దారుడు

1.స్వచ్ఛంద పదవి విరమణ.

2.పదవీ విరమణ

3.ఆకాలమరణం

ఈ మూడు సందర్భాలలో CPS ఖాతా నుండి డబ్బును తిరిగిపొందగలరు.

*1. స్వచ్ఛంద పదవీవిరమణ:*

ఉద్యోగి స్వచ్ఛంద పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తము నుండి 80 % ను నెలవారి పెన్షన్గా ఇవ్వడానికి A.S.Pలో ఎంచుకున్న రకానికి చెందిన పెన్షన్ అందజేస్తారు. 20%నిధి ని చెల్లిస్తారు.

సూచన :–మొత్తం నిధి 1 లక్ష లోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.

దీనికోసం FORM 102-GP ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.A.S

*2. సాధారణ పదవీ విరమణ*

ఉద్యోగి పదవీ విరమణ పొందినప్పుడు తన ఖాతాలో ఉన్న మొత్తములో నుండి 40%ను నేలవారి పెన్షన్ గా ఇవ్వడానికి  A.S.P లో ఎంచుకున్న రకానికి పెన్షన్ అందజేస్తారు.60% నిధిని చెల్లిస్తారు.

సూచన

  మొత్తం నిధి  2లక్ష లలోపు ఉంటే ఆ మొత్తాన్ని చెల్లిస్తారు.

దీనికోసం FORM 101-GS ను పూర్తిచేసి సంభాదిత నోడల్ ఏజెన్సీ కి (treasurer)కి పంపవలెను.

*3. ఆకాలమరణం పొందిన సందర్భంలో*

ఉద్యోగి ఖాతాలో ఉన్న మొత్తం(100%) నిధిని నామినీ  కి చెల్లిస్తారు.

 

దీనికోసం FORM 103-GD ను పూర్తిచేసి సంభందిత నోడల్ ఏజెన్సీ కి (treasurer) కి పంపవలేను.

error: Don\'t Copy!!!!