central-bank-of-India-recruitment-5000-jobs-details
భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5000 ఖాళీలను నియమించనుంది
భారతదేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 5000 ఖాళీలను నియమించనుంది. నోటిఫికేషన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ యొక్క వివిధ శాఖలు/కార్యాలయాల్లో అప్రెంటిస్‌షిప్ కోసం ఖాళీలను ప్రకటించింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చి 20 నుంచి ప్రారంభమైంది.
అంటే నేటి నుంచి ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా https://www.centralbankofindia.co.in/వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మీరు ఏప్రిల్ 3 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్రెంటిస్‌షిప్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ ఏప్రిల్ రెండో వారంలో జరగనుంది. అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం అప్రెంటీస్‌ల నియామకాలు జరుగుతున్నాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ అభ్యర్థులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది.
దరఖాస్తు రుసుము..
Central Bank of India Apprentice Recruitment 2023*
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి 5000 ఎప్రింటీస్ ఖాళీల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల.
Total Vacancies:* 5000
AP Vacancies:* 141 (VSP: 50, VZY: 41 GNT: 60)
TS Vacancies:* 106 (HYD: 65, WRNGL: 41)
Qualification:* Degree
Stipend:* upto Rs 15,000/-
Online Apply Last Date:* April 3rd
Notification, Online APPLY Link, Complete Details
PWBD అభ్యర్థులు – రూ.400/-+GST
SC/ST అన్ని మహిళా అభ్యర్థులు – రూ.600/-+GST
మిగతా అభ్యర్థులందరూ – రూ. 800/-+GST చెల్లించాల్సి ఉంటుంది.
వయోపరిమితి.. అభ్యర్థుల వయస్సు కనీసం 20 సంవత్సరాలు మరియు గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు పొందుతారు.
అప్రెంటిస్ జీతం..

CENTRAL BANK OF INDIA OFFICIAL WEBSITE
గ్రామీణ/సెమీ-అర్బన్ శాఖలు – రూ. 10,000 నెలకు చెల్లిస్తారు.
పట్టణ శాఖలు – రూ. 15,000 నెలకు చెల్లిస్తారు.
మెట్రో శాఖలు – రూ. 20,000 నెలకు చెల్లిస్తారు.