caronavirus-covid-19-icmr-approved-covid-test-at-home-icmr-guidelines

ఇకపై ఇంటి వద్దే కరోనా పరీక్షలు!*

*?ఇంటివద్దే స్వయంగా కొవిడ్‌ పరీక్ష!*

*యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్‌కు ఆమోదించిన ఐసీఎంఆర్‌*

లక్షణాలున్న వ్యక్తి ఇంటి వద్దే స్వయంగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం ‘CoviSelf’ పేరుతో మైల్యాబ్‌ రూపొందించిన యాంటీజెన్‌ టెస్ట్‌ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి(ICMR) ఆమోదం తెలిపింది. దీంతో మరికొన్ని రోజుల్లోనే ఈ కిట్‌ విస్తృతంగా మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది.

పుణెకు చెందిన మైల్యాబ్‌ రూపొందించిన ఈ కిట్‌లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షకు కావాల్సిన ఓ ద్రవపదార్థంతో కూడిన ట్యూబ్‌, శాంపిల్‌ సేకరణకు స్వాబ్‌, టెస్ట్‌ కార్డుతో పాటు పరీక్ష పూర్తైన తర్వాత వీటిని సురక్షిత విధానంలో పడేసేందుకు ప్రత్యేక కవరు ఉంటాయి. పరీక్ష ప్రారంభించే ముందు మైల్యాబ్‌ రూపొందించిన కొవిసెల్ఫ్ (CoviSelf) యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలను పూర్తిచేయాల్సి ఉంటుంది

Prefilled Extraction Tube: కొవిడ్‌ నిర్ధారణ పరీక్షకు అవసరమయ్యే ద్రవం ఈ ట్యూబ్‌లో ఉంటుంది. దీనిని మూడు, నాలుగు సార్లు కదిలించి ద్రవాన్ని ట్యూబ్‌ కింద భాగంలోకి వచ్చేట్లు చూసుకోవాలి.

* Sterile Nasal Swab: ఈ స్వాబ్‌ను నాసికా రంధ్రాల్లో ఉంచి ఐదు సార్లు తిప్పాలి. ఇలా రెండు నాసికా రంధ్రాల్లో అలా చేయడం వల్ల కచ్చితమైన శాంపిల్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ద్రవపదార్థం ఉన్న ట్యూబులో స్వాబ్‌ను ముంచి, శ్వాబ్‌పై భాగాన్ని తుంచివేయాలి. అనంతరం ట్యూబ్‌ మూతను కప్పివేయాలి.

Test Card: ఇలా శాంపిల్‌ను ముంచిన ద్రవాన్ని టెస్ట్‌ కార్డుపై రెండు చుక్కలు వేయాలి. ఇక అంతే.. ఫలితం కోసం 15 నిమిషాల పాటు వేచి చూడండి.

MyLab CoviSelf App: ఇప్పటికే వివరాలు నమోదు చేసుకున్న ఈ యాప్‌ నుంచి పదిహేను నిమిషాల్లోపే ఓ శబ్దం వస్తుంది. టెస్ట్‌ కార్డ్‌ (Test Card)పైన కేవలం C-క్వాలిటీ కంట్రోల్‌ లైన్‌ వద్ద మాత్రమే చార కనిపిస్తే కొవిడ్‌ నెగిటివ్‌గా నిర్ధారించుకోవచ్చు. ఇక క్వాలిటీ కంట్రోల్‌ లైన్‌-C తో పాటు టెస్ట్‌ లైన్‌- T వద్ద రెండు చారలు కనిపించినట్లయితే కొవిడ్‌ పాజిటివ్‌గా పరిగణిస్తారు. కృత్రమ మేధ సహాయంతో యాప్‌లో 5 నుంచి 7 నిమిషాల్లోనే ఫలితం కనిపిస్తుంది. ఈ ఫలితం కోసం గరిష్ఠంగా 15 నిమిషాలు మాత్రమే వేచిచూడాలి. 20 నిమిషాల తర్వాత వచ్చే ఫలితాలన్ని పరిగణలోకి తీసుకోకూడదని కొవిడ్‌ కిట్‌ రూపకర్తలు వెల్లడించారు. ఇలా వచ్చిన కొవిడ్‌ ఫలితాన్ని యాప్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇదే కొవిడ్‌ నిర్ధారణ ఫలితం ఐసీఎంఆర్‌కు అనుసంధానమైన సర్వర్లోనూ నిక్షిప్తమవుతుంది.

* Bio Hazard Bag: ఇలా కొవిడ్‌ పరీక్ష పూర్తైన తర్వాత పరీక్షకు వినియోగించిన వాటన్నింటిని ప్రత్యేకమైన కవర్లో (Bio Hazard Bag) వేసి చెత్త డబ్బాలో వేయాలి.

కొవిడ్‌ లక్షణాలు ఉండి.. ఈ యాంటీజెన్‌ టెస్టులో నెగటివ్‌ ఫలితం వస్తే మాత్రం వెంటనే RTPCR పరీక్ష చేయించుకోవాలని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది.

ఈ యాంటీజెన్‌ కిట్‌ ధర దాదాపు రూ.250 ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ కిట్‌కు ఐసీఎంఆర్‌ అనుమతి ఇవ్వడంతో మరికొన్ని రోజుల్లోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని మైల్యాబ్‌ డిస్కవరీ సొల్యూషన్స్‌ డైరెక్టర్‌ సుజిత్‌ జైన్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా అన్ని మెడికల్‌ షాప్‌లతోపాటు ఆన్‌లైన్‌లోనూ ఈ కిట్‌ అందుబాటులో ఉంటుందని మైల్యాబ్‌ సంస్థ పేర్కొన్నారు. ఇలా ఇంటిలో స్వయంగా కొవిడ్‌ నిర్ధారణ చేసుకునే కిట్‌లు అమెరికాలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో మాత్రం ఇదే తొలి యాంటీజెన్‌ కిట్‌ కావడం విశేషం.

పల్లెల్లో కరోనా కేసులు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంటింటికెళ్లి పరీక్షలు నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఆదేశాల మేరకు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​) కార్యాచరణకు సిద్ధమయింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం రాత్రి విడుదల చేసింది.

లక్షణాలు ఉన్నవారు, ఇప్పటికే పాజిటివ్​గా తేలినవారితో సన్నిహిత సంబంధం ఉన్నవారికి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్​ చేయాలి. విచక్షణారహితంగా పరీక్షలు నిర్వహించకూడదు.

టెస్ట్ కిట్‌లో ఉన్న పరికరాలతో మ్యానువల్‌లో చెప్పిన విధంగా టెస్ట్ చేసువాలి. ఆ టెస్ట్ ట్రిప్‌ను మొబైల్ కెమెరాతో ఫొటో తీయాలి. ఆ ఫొటోను మీ వివరాలతో సదరు యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. టెస్ట్ స్ట్రిప్‌ను అనలైజ్ చేసిన తర్వాత కరోనా పాజిటివా? నెగెటివా? అనే వివరాలతో రిపోర్టు చూపిస్తుంది

యాప్ సర్వర్ ద్వారా ఆ వివరాలను కేంద్ర, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ సేకరిస్తుంది. పాజిటివ్ వచ్చిన వారి వివరాలను ఆ రోజు కరోనా బాధితుల జాబితాలో చేర్చుతుంది. అన్ని వివరాలను గోప్యంగానే ఉంచుతారు. అంతేకాదు ఆరోగ్య సిబ్బంది కాల్ చేసి.. హోమ్ ఐసోలేషన్‌లో ఎలాంటి మందులు తీసుకోవాలో సవివరంగా చెబుతారు

గూగుల్ ప్లేలో ఉన్న హోం టెస్టింగ్ మొబైల్ యాప్ డౌన్​లోడ్ చేసుకుని అందులో పేర్కొన్న నిబంధనలను అనుసరించి పరీక్షలు నిర్వహించాలి. రోగికి పాజిటివ్, నెగెటివ్​ టెస్ట్ ఫలితాలు అందించాలి.

పరీక్ష ప్రక్రియ పూర్తయిన తర్వాత దానికి ఉపయోగించిన టెస్ట్​ స్ట్రిప్​ను మొబైల్​యాప్​, యూజర్​ రిజిస్ట్రేషన్ చేసిన మొబైల్​ఫోన్​లో ఫోటో తీయాలి

మొబైల్​ఫోన్​ యాప్​లో నమోదు చేసిన డేటాను కేంద్రీకృత సర్వర్​లో భద్రంగా నిల్వచేస్తారు. ఈ సర్వర్​ ఐసీఎంఆర్​ కొవిడ్​-19 టెస్టింగ్​ పోర్టల్​కు అనుసంధానమై ఉంటుంది. అంతిమంగా డేటా అంతా ఇందులోనే నిల్వ ఉంటుంది.

ఈ పరీక్షల్లో పాజిటివ్​ వచ్చిన రోగులంతా 100 శాతం పాజిటివ్​గానే భావించాలి. మరోసారి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. వారంతా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ఐసోలేషన్​లో ఉండాలి

లక్షణాలు ఉన్నప్పటికీ ర్యాట్​ టెస్టుల్లో నెగెటివ్​ వచ్చిన వారు వెంటనే ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలి. తక్కువ వైరల్ లోడ్ ఉన్నవారిని గుర్తించటంలో ర్యాట్ పరీక్షలు విఫలమయ్యే అవకాశం ఉన్నందున నెగెటివ్ వచ్చిన వారు ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలకు వెళ్లాలి.

లక్షణాలున్నా ఇందులో నెగెటివ్ వచ్చిన వారిని అనుమానిత కొవిడ్ రోగులుగా పరిగణించి వెంటనే ఐసోలేషన్​కు వెళ్లమని చెప్పాలి. ఆర్​టీ-పీసీఆర్ పరీక్ష ఫలితం వచ్చేంతవరకు వారు దాన్ని అనుసరించాలి.

కోవిసెల్ఫ్ టీఎం (ప్యాథోక్యాచ్) కోవిడ్19 ఓటీసీ యాంటిజెన్ ఎల్ఎఫ్ అనే కరోనా కిట్‌ను పుణెకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. మొబైల్ యాప్ సాయంతో ఇది పనిచేస్తుంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్లో ఆ యాప్ అందుబాటులో ఉంది.

ICMR GUIDELINES CLICK HERE

error: Don\'t Copy!!!!