capgemini-it-software-engineer-jobs

IT Jobs: ఫ్రెషర్స్‌కు గుడ్ న్యూస్.. ఆఫ్​ క్యాంపస్​ డ్రైవ్​ నిర్వహించనున్న క్యాప్​జెమిని

మల్టీ నేషనల్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ కంపెనీ (IT Company) క్యాప్​జెమిని (Capgemini) నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. 2019 లేదా 2020లో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసిన ఇంజనీరింగ్​ విద్యార్థులకు ఆఫ్​ క్యాంపస్​ డ్రైవ్ (Off campus drive) నిర్వహించనుంది. దీని ద్వారా ఫ్రెషర్లకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. క్యాప్‌జెమినీ ప్రస్తుతం 13 నగరాల్లో 1,50,000 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూర్, గాంధీనగర్, గురుగ్రామ్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, నోయిడా, పూణే, సేలం, తిరుచిరాపల్లి నగరాల్లో సంస్థ కార్యాలయాలున్నాయి. ఎంపికైన అభ్యర్థులను ఆయా కార్యాలయాల్లో నియమించనుంది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు క్యాప్​జెమినీ అధికారిక వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హత ప్రమాణాలు
అభ్యర్థులు 2019/2020లో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేసి ఉండాలి. అంతకు ముందు పూర్తి చేసిన వారు దరఖాస్తుకు అనర్హులు. ఏదైనా విభాగంలో ఎంసీఏ, బీఈ / బీటెక్ పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఎంఈ / ఎంటెక్​ విద్యార్థులు తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో మాత్రమే ఉత్తీర్ణులై ఉండాలి. గ్రాడ్యుయేషన్ (మొత్తం 8 సెమిస్టర్‌లు), ఎంసీఏ (మొత్తం 6 సెమిస్టర్‌లు), ఎంఈ/ఎంటెక్​లో కనీసం 50% లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

అకడమిక్ ఎడ్యుకేషన్​​ మొత్తంలో అభ్యర్థికి 1 సంవత్సరం కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. బీఈ/ బీటెక్​ పూర్తి చేయడానికి అభ్యర్థికి 4 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టకూడదు. ఇంటర్వ్యూకు హాజరయ్యే నాటికి అభ్యర్థికి ఎలాంటి బ్యాక్‌లాగ్ ఉండకూడదు. దేశంలో ఏ క్యాప్‌జెమిని లొకేషన్‌లోనైనా పనిచేసేందుకు సిద్దంగా ఉండాలి. అవసరమైతే షిఫ్ట్‌ల విధానంలో పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.
కంపెనీలో చేరే సమయంలో సర్వీస్​ బాండ్​పై సంతకం చేయడానికి సిద్దంగా ఉండాలి. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే ఎంపిక ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉంటుంది.

పరీక్ష నుంచి ఇంటర్వ్యూ వరకు మొత్తం ఎంపిక ప్రక్రియ వర్చువల్ మోడ్‌లో జరుగుతుంది. ఉద్యోగ నియామక ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు 8 నుండి-10 వారాల పాటు శిక్షణ ఉంటుంది. పాపులర్​ ట్రైనింగ్​ ప్లాట్​ఫామ్​ నెక్ట్స్​ భాగస్వామ్యంతో శిక్షణనిస్తారు. కోర్సెరా, ప్లూరల్​సైట్​, ఉడామి మొదలైన ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​ల ద్వారా శిక్షణ ఉంటుంది.

ఇలా రిజిస్టర్‌ చేసుకోవాలి:

అనంతరం..
తొలుత రిజిస్టర్ చేసుకున్న తర్వాత.. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు జనవరి 14 నుంచి పరీక్ష అసెస్‌మెంట్‌కు హాజరు కావాలి.

CAPGEMINI IT JOBS ONLINE APPLICATION CLICK HERE

error: Don\'t Copy!!!!