Begum Hazrat Mahal National Scholarship Scheme-2021-DETAILS

SCHEME OF
“BEGUM HAZRAT MAHAL NATIONAL SCHOLARSHIP”
FOR MERITORIOUS GIRL STUDENTS BELONGING TO THE MINORITY COMMUNITIE

మైనారిటీ బాలికల కోసం బేగం హజ్రత్‌ మహల్‌ స్కాలర్‌షిప్‌.

మైనారిటీ బాలికలకు స్కాలర్‌షిప్‌లు.. 9, 10 బాలికలకు నెలకు రూ. 5వేలు.. ఇంటర్‌ వాళ్లకు రూ.6 వేలు

ప్రతిభ కలిగిన మైనారిటీ బాలికల చదువును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బేగం హజ్రత్‌ మహల్‌ స్కాలర్‌షిప్‌ పథకం అమలు చేస్తోంది. ఢిల్లీలోని మౌలానా అజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ఈ స్కాలర్‌షిప్స్‌ను అందిస్తోంది. ఇది కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది.

అర్హతలు
తొమ్మిది, పది, ఇంటర్‌ మొదటి, రెండో ఏడాది చదువున్న మైనారిటీ (ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్దులు, జైనులు, పార్సీలు) బాలికలు ఈ స్కాలర్‌షిప్‌ దరఖాస్తుకు అర్హులు. కుటుంబ వార్షికాదాయం రెండు లక్షలకు మించకుండా ఉండాలి. అకడమిక్‌ మెరిట్‌ పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. చదువు మ«ధ్యలో మానేసిన వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇతర స్కాలర్‌షిప్స్‌ పొందేవారు అనర్హులు.

నేరుగా ఖాతాకే
ఈ స్కాలర్‌షిప్స్‌కు ఎంపికైన తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి రూ.5000, అలాగే 11, 12 తరగతి చదివే విద్యార్థులకు సంవత్సరానికి రూ.6000 స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. విద్యార్థి బ్యాంక్‌ ఖాతాలోకి నేరుగా సదరు మొత్తాన్ని జమచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021

నేరుగా ఖాతాల్లో జమ:
9, 10 తరగతులు చదువుతున్న విద్యార్థినులకు నెలకు రూ.5 వేలు,

ఇంటర్మీడియట్ ‌వారికి నెలకు రూ.6 వేల చొప్పున స్కాలర్‌షిప్పులు ఇస్తారు.

ఈ మొత్తం ప్రతి నెలా నేరుగా అభ్యర్థుల ఖాతాలో జమవుతుంది.

స్కాలర్‌షిప్పు పొందినవాళ్లు ఏదైనా కారణంతో చదువును మధ్యలో ఆపేస్తే వారి ఉపకారవేతనం రద్దవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏవైనా ఉపకారవేతనాలు పొందుతున్నవారు దీనికి అనర్హులు.

ముఖ్య సమాచారం:

AMOUNT OF SCHOLARSHIP
Amount of scholarship will be provided Rs.5000/each for
Class IX & X and Rs.6000/-each for Class XI & XII

Begum Hazrat Mahal National Scholarship Scheme GUIDELINES PDF

error: Don\'t Copy!!!!