BASELINE TEST MARKS ONLINE ENTRY FORM-for-Level-1-2-3-pdf

బేస్ లైన్ పరీక్ష వారధి వర్క్ షీట్స్  మరియు FA-1 & FA-2 మార్కుల నమోదుపై ప్రధానోపాధ్యాయులకు ముఖ్య సూచనలు …..
గౌరవ డైరెక్టర్ వారు , ఎస్.సి.ఇ.ఆర్.టి వారు తేది 29.07.2021 న నిర్వహించిన వెబెక్ష్ మీటింగ్ ద్వారా తెలియజేసి న విషయాలు 

1.  రాష్ట మరియు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా లోని ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలలలో బేస్ లైన్ పరీక్ష చక్కగా నిర్వహిస్తున్నందులకు ముందుగా ఉప విద్యాశాఖాధికారులకు, మండల విద్యాశాఖాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. 

2.  బేస్ లైన్ పరీక్ష జవాబు పత్రాలను విద్యార్ధుల తల్లిదండ్రుల ద్వారా తెప్పించుకొని వాటిని వెంటనే మూల్యాంకనము చేయాలి.

3.  విద్యార్దులు పొందిన మార్కులను సబ్జెక్టు వారీగా పాఠశాలలో ప్రతేక రిజిస్టర్ నందు నమోదు చేయాలి.
4.  సి.ఎస్.ఇ  పోర్టల్ త్వరలో ఓపెన్ అవుతుంది. పోర్టల్ ఓపెన్ అయిన వెంటనే తరగతి వారీగా, సబ్జెక్టు వారీగా ప్రతి విద్యార్ధి మార్కులు . సి.ఎస్.ఇ సైట్ నందు నమోదు చేయాలి.

5.  బేస్ లైన్ పరీక్ష కొరకు ఉపాధ్యాయులు రూపొందించిన ప్రశ్నాపత్రాలను, పరీక్ష వ్రాస్తున్న సందర్భంగా విద్యార్దులకు వారి తల్లిదండ్రులు తీసిన ఫోటోలు తప్పనిసరిగా సేకరించాలి. 
6. చక్కగా రూపొందించిన ప్రశ్నాపత్రాలను, విద్యార్దుల పరీక్ష వ్రాస్తున్న ఫోటోలను, జవాబుపత్రాలు సమర్పిస్తున్న సందర్భంగా తీసిన ఫోటోలను సేవ్ చేయాలి. వాటినుండి ఉత్తమమైన 5 ఫొటోస్ ఎస్.సి.ఇ.ఆర్.టి వారి మెయిల్ కు పంపించాలి.

7. కొద్ది రోజులలో అన్ని మండలాలకు వారధి వర్క్ షీట్స్ సప్లై చేయబడతాయి. వాటిని వెంటనే ప్రభుత్వ యాజమాన్యంలోని అన్ని పాఠశాలలకు అందించాలి.
8. ఆన్లైన్ లో సప్తగిరి ఛానల్ నందు బోధన ప్రారంభమైన పిదప మాత్రమె విద్యార్దులకు వారధి వర్క్ షీట్స్ రోజువారి అందించవలెను.
9.  6 నుండి 9 తరగతుల విద్యార్దులకు గత విద్యా సంవత్సరం అనగా 2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించిన FA-1 మరియు FA-2 ల మార్కులను ఇంకా కొన్ని పాఠశాలల వారు సి.ఎస్.ఇ పోర్టల్ నందు పూర్తిగా నమోదు చేయలేదు. అలాంటి పాఠశాలలు వెంటనే వాటిని నమోదు చేయాలి.

*ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు గమనిక :-*

? *ది.15.07.2021 నుండి కోవిడ్ ప్రోటోకాల్ ననుసరించి HM లు అడ్మిషన్స్ చేపట్టాలి*

? *ది.27.07.2021 నుండి ది.31.07 2021 వరకు విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ నిర్వహించాలి*

? *ది.28.07.2021 నుండి ది.03.08.2021 వరకు విద్యార్థులు రాసిన బేస్ లైన్ పరీక్షా పత్రాలను మూల్యాంకనం చేయాలి*

? *ది.02.08.2021 నుండి ది.07.08.2021 వరకు గత తరగతుల వర్క్ బుక్ లను విద్యార్థులతో సాధన చేయించాలి (ప్రాధమిక తరగతులకు మాత్రమే)*

? *ది.04.08.2021 నుండి ది.31.08.2021 వరకు 6 నుండి 10 తరగతుల విద్యార్థులతో ప్రస్తుతం చదువుతున్న తరగతుల వర్క్ షీట్ బుక్స్ ని సాధన చేయించాలి*

? *ది.09.08.2021 నుండి ది.31.08.2021 వరకు ప్రాధమిక తరగతుల విద్యార్థులతో వారి ప్రస్తుత తరగతుల వర్క్ షీట్ బుక్ లెట్ లను సాధన చేయించాలి*

బేస్లైన్ టెస్ట్ పూర్తి అయిన తర్వాత విద్యార్థులకు వచ్చిన మార్కులను ఆన్లైన్ చేయుటకు మార్కుల ఎంట్రీ ప్రొఫార్మా  లు 

LEVEL-1 BASELINE TEST MARKS ONLINE ENTRY FORM PDF

LEVEL-2 BASELINE TEST MARKS ONLINE ENTRY FORM PDF

Level-3 BASELINE TEST MARKS ONLINE ENTRY FORM PDF

LEVEL-3 HIGH SCHOOL BASELINE MARKS  ENTRY PROFORMA(EXCELL MODEL)

LEVEL-2 BASELINE TEST MARKS ENTRY PROFORMA (EXCELL MODEL)

LEVEL-1 BASELINE TEST MARKS ENTRY PROFORMA (EXCELL MODEL)

DTP వర్క్ చేసిన Level-1, Level-2, Level-3,
T.M, E.M & U.M. Baseline Test Papers. https://drive.google.com/file/d/1S_wdVf0VaTHMkOcIT_cE8HSD21sK3C1B/view

LEVEL-1, 2 & 3 BASELINE TEST PAPERS FOR ALL SUBJECTS 1ST CLASS TO 10TH CLASS CLICK HERE

BASELINE TEST నిర్వహణ కు సూచనలు.

*రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాల మేరకు జూలై 27 నుండి 31 వరకు మన పాఠశాలలో బేస్ లైన్ పరీక్ష నిర్వహణకు, ఆగస్టు 4 వతేది నుండి10 వ తేది వరకు మార్కుల నమోదు కు సూచనలు:*

*సబ్జెక్ట్ ఉపాధ్యాయులకు సూచనలు:*

ఉపాధ్యాయులు వారు గత సంవత్సరం బోధించిన సబ్జెక్టుకు సంబంధించి ప్రతి తరగతికి విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించే విధంగా మోడల్ పేపర్లో సూచించిన విధంగా 10 బిట్లు తయారుచేసి తరగతి ఉపాధ్యాయునికి ఆదివారం సాయంత్రం లోపు పంపాలి.

*తరగతి ఉపాధ్యాయులకు సూచనలు:*

తరగతి సంబంధించి సబ్జెక్టు ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి బిట్స్ అన్నింటినీ కలిపి కన్సాలిడేటెడ్ ప్రశ్నపత్రాన్ని 60 ప్రశ్నలతో తయారుచేసి అవసరమైనన్ని కాపీలు పాఠశాల ఖర్చుతో జిరాక్స్ తీయించవలెను. వాటిని విద్యార్థులను దత్తత ఇచ్చిన ఉపాధ్యాయులకు అందజేయవలెను. ఈ పనులను సోమవారం లోపు పూర్తిచేయాలి.

*విద్యార్థులను దత్తత తీసుకున్న ఉపాధ్యాయులకు సూచనలు:*

ఉపాధ్యాయులు వారికి దత్తత ఇచ్చిన విద్యార్థులకు సంబంధిత ప్రశ్నాపత్రాలను వారి తల్లిదండ్రుల ద్వారా ఫోన్ చేసి జూలై27 నుండి పిలిపించి అందజేసి విద్యార్థులతో పరీక్ష వ్రాయించి తిరిగి తల్లిదండ్రుల ద్వారా జూలై 31 లోపు తెప్పించుకొనవలెను.
ఆ విద్యార్థులకు సంబంధించి ప్రశ్నాపత్రాలను *”కీ”* ద్వారా మూల్యాంకనం చేసి, నిర్దేశిత తేదీలలో కేటాయించిన విద్యార్థుల మార్కులను అప్లోడ్ చేయించవలెను.

1) అన్ని పాఠశాలలో అన్ని తరగతులకు అందరు విద్యార్థులకు ప్రారంభ పరీక్ష నిర్వహణ చేయాలి .

2)క్రింది తరగతి పాఠ్యాంశ విషయాలు మరియు సామర్థ్యాల అనుగుణంగా మాదిరి పరీక్ష పత్రాలు ఇచ్చారు.

వీటి ఆధారంగా ఉపాధ్యాయులు స్వయంగా ప్రారంభ పరీక్ష పత్రాలు తయారు చేసి నిర్వహణ చేయాలి .

3) ఎట్టి పరిస్థితుల్లో విధ్యార్థుల ను పాఠశాల కు పిలవరాదు.

4) తల్లి తండ్రులు ద్వారా పరీక్ష పత్రాలు పంపిణీ మరియు పరీక్ష రాసిన అనంతరం తిరిగి పొందడం చేయాలి.

*5) పరీక్ష నిర్వహణ జూలై 27 నుండి 31 వరకు.*

*6) మూల్యాంకనం జూలై 28 నుండి 3 ఆగస్టు.*

*7)మార్కుల నమోదు 4 ఆగస్టు నుండి 10 వరకు.*

level 1 1&2 తరగతులకు

level 2 3,4&5 తరగతులకు.

level 3 6 నుండి 10 తరగతులకు

8) తెలుగు మరియు ఆంగ్ల మాధ్యమంలో విడి విడిగా ప్రశ్న పత్రాలను అందజేయాలి.

పై అంశం సమర్థవంతంగా నిర్వహణ చేయడానికి ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు భాధ్యత వహించాలి.

వారి అభ్యసనసామర్థ్యాల అంచనాకు ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు బేస్‌లైన్‌ పరీక్షలను నిర్వహించనుంది.

వచ్చే నెల 4 నుంచి సాధన పత్రాలకు జవాబులు రాయించాలని సూచించింది.

*♦ఇళ్ల దగ్గరే సాధన..*

సాధనపత్రాలకు జవాబులను విద్యార్థులు తమ ఇళ్ల దగ్గరే రాయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు మార్గదర్శకాలను జారీ చేశారు. 

ALL SUBJECTS WORK BOOKS LATEST PDF PAGE

1st CLASS TO 10th CLASS NEW TEXT BOOKS 2021-22 PDF

error: Don\'t Copy!!!!