Baseline Assessment-guidelines-sample-papers-marks-entry-form

1.ఈ Baseline test కేవలం విద్యార్థుల స్థాయిని తెలుసుకొనుటకు మాత్రమే

2.Baseline test నిర్వహించడానికి ముందుగా విద్యార్థులు కు ఓరల్ టెస్ట్ నిర్వహించాలి.

22/07/2022 —- TELUGU ORAL TEST.

23/07/2022 —- ENGLISH ORAL TEST.

25/07/2022 —MATHS ORAL TEST.

26/07/2022 —- రాత పరీక్ష ఉండును.

Final format for Readiness program Baseline test PDF

తెలుగు బేస్ లైన్ టెస్ట్ మార్కుల ఎoట్రీ ప్రొఫార్మా PDF

ENGLISH BASELINE TEST ENTRY PROFORMA PDF

MATHS BASELINE ENTRY PROFORMA PDF

3.ORAL TEST లో విద్యార్థులను 5 రకాలుగా విభజించాలి.

23.07.2022 బేస్లైన్ టెస్ట్ నందు మౌఖిక పరీక్ష నిర్వహణకు సూచనలు:

మౌఖిక పరీక్షలలో *నాలుగు, ఐదు  స్థాయిలలో ఉన్న* బాలలకు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి.

*MATHS :-*
L1– ప్రారంభకులు (ఏమి రానివారు).
L2—ఒక అంకె సంఖ్యలు.
L3–రెండు అంకెల సంఖ్యలు.
L4—మూడు అంకెల సంఖ్యలు.
L5– గణిత ప్రక్రియలు (+,౼,×,÷చేయువారు)

*ENGLISH :-*
L1–ప్రారంభకులు (ఏమి రానివారు).
L2–పెద్ద అక్షరాలు (ABCD)
L3–చిన్న అక్షరాలు(abcd)
L4 –Words.
L5 — వాక్యాలు.

పై స్థాయిలలో L4, L5 ల లో ఉన్న విద్యార్థులు కు మాత్రమే రాత పరీక్ష నిర్వహించాలి. పై లెవెల్స్, మార్క్స్ అన్ని విద్యార్థులు వారీగా క్రింది ఇవ్వబడిన XL sheet fill చేసి అదేవిధంగా online లో enter చేయుటకు బధ్రపరుచుకోవలెను. marks regester లో enter చేయవలెను.

*గమనిక :- L4, L5 విద్యార్థులకు పరీక్ష ను చూసిరాతలు లేకుండా చూడవలెను, ఎందుకనగా పై అధికారులు వచ్చి విద్యార్థులను పరిశీలించినపుడు వారి లెవెల్ తగ్గితే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

1ST TO 10TH CLASS ALL SUBJECTS YEAR PLANS & LESSON PLANS CLICK HERE

8TH CLASS NEW TEXT BOOKS 2022-23 CLICK HERE PDF

ప్రథమ్ ఫౌండేషన్ వారు సూచించిన టెస్టింగ్ టూల్స్ ఆధారంగా రూపొందించిన ప్రశ్నా పత్రాలతో అన్ని ప్రభుత్వ (GOVT’ ZP, MUNICIPAL, APMS, KGBV, WELFARE SCHOOLS) మరియు ఎయిడెడ్ యాజమాన్యాలలోని పాఠశాలలలో   తేది 22.07.22 న బేస్లైన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. 

బేస్లైన్ టెస్ట్ రెండవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులకు నిర్వహించాలి.  ప్రశ్నా పత్రాలు సమగ్ర శిక్ష నుండి అందించబడతాయి.

పరీక్ష ముగిసిన తరువాత జవాబు పత్రాలను మరియు ఇతర మెటీరియల్ ను రాష్ట్ర కార్యాలయానికి పంపాలి.

ఒక్కొక్క ఉపాధ్యాయునికి నాలుగు పేజీల ఇన్స్ట్రుక్షన్స్  బుక్లెట్లు ఇవ్వబడతాయి. 

మరో ఐదు  పేజీల ఓరల్ టెస్టింగ్ టూల్స్ ప్రశ్నా పత్రం ఇవ్వబడతాయి. 

ప్రతి విద్యార్థికి పెన్ వినియోగించి వ్రాయ వలసిన  నాలుగు పేజీల టెస్టింగ్ టూల్ ప్రశ్నా పత్రం ఇవ్వబడుతుంది.  ఇవి పది సెట్స్ లో ఇవ్వబడతాయి. 

వీటిని విద్యార్థులకు ఇచ్చేటప్పుడు మొదటి విద్యార్దికి సెట్ 1, రెండవ విద్యార్థికి సెట్ 2,  మూడవ విద్యార్థికి సెట్ 3, ….. వరుస క్రమంలో ఇవ్వాలి. 

మొదటి పదిమంది విద్యార్థులకు వరుసక్రమంలో పది సెట్లు ఇచ్చిన తరువాత పదకొండవ విద్యార్థి నుండి మరల సెట్ 1 నుండి ప్రారంభించి ఇవ్వాలి. 

BASELINE TEST INSTRUCTIONS జూలై 22 న విద్యార్థులకు బేస్ లైన్ టెస్ట్ ఎలా నిర్వహించాలి? CLICK HERE

BASELINE TEST MARKS ENTRY FORM PDF

BASELINE TEST INSTRUCTIONS CLICK HERE

తెలుగు, ఇంగ్లీష్ , గణితంలలో బేస్లైన్ టెస్ట్ నిర్వహించాలి. 

బేస్లైన్ టెస్ట్ రెండు రకాలుగా ఉంటుంది. 

మొదటిది మౌఖిక పరీక్ష. రెండవది రాత పరీక్ష. 

రెండు నుండి పదవ తరగతి వరకు ఒకే రకమైన ప్రశ్నా పత్రం ద్వారా మౌఖిక పరీక్ష జరపాలి. 

మొదటి రోజు తెలుగు, రెండవ రోజు ఇంగ్లీష్ , మూడవ రోజు గణితంలో మౌఖిక పరీక్ష నిర్వహించాలి. 

మౌఖిక పరీక్ష కొరకు ప్రతి పాఠశాలకు రెండు శాంపిల్స్ ఇవ్వబడతాయి. 

ప్రతి శాంపిల్ నందు ఐదు స్థాయిలు ఉంటాయి. 

అవి తెలుగు నందు :-  ప్రారంభ స్థాయి, అక్షరాల స్థాయి, పదాల స్థాయి, పేరా స్థాయి, కథ స్థాయి. 

గణితం నందు :- ప్రారంభ స్థాయి, ఒక అంకె సంఖ్యలు, రెండు అంకెల సంఖ్యలు, మూడు అంకెల సంఖ్యలు, గణిత ప్రక్రియలు 

ఇంగ్లీష్ నందు :- ప్రారంభ స్థాయి, కాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, పదాలు, వాక్యాలు 

విద్యార్థి చదవగలిగిన విధానాన్ని బట్టి ఆ విద్యార్థి ఏ స్థాయిలో ఉన్నాడో గుర్తించాలి. 

ఒక్కొక్క విద్యార్థిని వ్యక్తిగతంగా పిలిచి, చదివించి వారి స్థాయిని నిర్ధారణ చేయాలి. 

మౌఖిక పరీక్ష నిర్వహించగానే పిల్లల స్థాయిని రిజిస్టర్ నందు నమోదు చేయాలి. ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి.  

ముఖ్య గమనిక :- 

మౌఖిక పరీక్షలో నాలుగు, ఐదు స్థాయిలలో ఉన్న బాలలకు  మాత్రమే  రాత పరీక్ష నిర్వహించాలి. 

రెండు నుండి ఐదు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్ లలో మాత్రమే రాత పరీక్ష ఉంటుంది. 

గణితంలో మాత్రం మౌఖిక పరీక్షలో ఉన్న చతుర్విద ప్రక్రియలు చేయగలిగిన విద్యార్థులు రాత పరీక్ష రాసినట్లు పరిగణించాలి. 

ఆరు నుండి పదవ తరగతుల విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీష్ లలో రాత పరీక్ష నిర్వహించాలి. 

రాత పరీక్షలో మొత్తం నాలుగు స్థాయిలు ఉంటాయి.  అవి 

1. అసలు ఏమీ రాయని / చేయని వారు  

2. ప్రయత్నిచారు కానీ అన్నీ తప్పులే  

3. రెండు మాత్రమే సరిగా రాశారు. 4. అన్నీ సరిగ్గా రాశారు. 

➡️ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరూ పైన పేర్కొన్న అంశాలన్నింటినీ క్షుణ్ణంగా అవగాహన చేసుకుని విద్యార్థులకు ఇప్పటినుండే తగిన తర్ఫీదు ఇవ్వాలి. 

➡️తేదీ 22.07.22 న విద్యార్థులందరూ హాజరగుటకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 

➡️ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వారి పరిధి లోని అన్ని ప్రభుత్వ మరియు  ఎయిడెడ్ యాజమాన్యాల పాఠశాలల వారికి ఈ విషయాలు తెలియజేయడంతో పాటు, నిర్వహణ తీరును పర్యవేక్షించవలసిందిగా కోరడమైనది. 

పాఠశాలల్లో రెమెడియల్ టీచింగ్ నిర్వహించుట కొరకు విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేయుటకు బేస్ లైన్ పరీక్ష నిర్వహించుటకు మార్గదర్శకాలతో తాజా ఉత్తర్వులు విడుదల*

అన్ని యాజమాన్య పాఠశాలల్లో భాషలు మరియు గణితంలో 2వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు జులై నెల 22వ తేదీన   నిర్వహిస్తారు

BASELINE TEST నిర్వహణకు సూచనలు తెలుగులో

BASELINE TEST SAMPLE TEST PAPERS

All SUBJECTS TESTING TOOLS PDF

ORAL TEST MATHS SAMPLE PAPERS

 ORAL TEST TELUGU MODEL PAPER

ORAL TEST ENGLISH MODEL PAPER

2ND CLASS TELUGU MODEL PAPER

2ND TO 5TH CLASS ENGLISH MODEL PAPERS

6 TO 10TH CLASS TELUGU MODEL PAPERS

6TH TO 10TH CLASS ENGLISH MODEL PAPERS

6TH TO 10TH MATHS MODEL PAPERS

FOR MORE DETAILS CLICK HERE

error: Don\'t Copy!!!!